Tucker
-
భారత్- న్యూజిలాండ్ సెమీస్‌కు అంపైర్లు వీరే.. 2019 వరల్డ్‌కప్‌లో కూడా
వన్డే వరల్డ్‌కప్-2023లో సెమీఫైనల్స్ సమరానికి సమయం అసన్నమైంది. ఈ మెగా టోర్నీ తొలి సెమీఫైనల్లో నవంబర్ 15 ముంబై వేదికగా భారత్-న్యూజిలాండ్ తాడోపేడో తేల్చుకోనున్నాయి. అనంతరం నవంబర్ 16న ఈడెన్ గార్డెన్స్ వేదికగా రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ సెమీఫైనల్స్ పోరుకు అంపైర్ల జాబితాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. భారత్-న్యూజిలాండ్ మధ్య జరగనున్న తొలి సెమీఫైనల్‌కు ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, ఆస్ట్రేలియాకు చెందిన రాడ్ టక్కర్ వ్యవహరించనున్నారు. అదేవిధంగా థర్డ్ అంపైర్‌గా జోయెల్ విల్సన్, ఫోర్త్ అంపైర్‌గా అడ్రియన్ హోల్డ్‌స్టాక్ విధులు నిర్వర్తించనున్నారు. మ్యాచ్ రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్ నియమించబడ్డాడు. కాగా ఈ మ్యాచ్ రాడ్ టక్కర్‌కు అంపైర్‌గా వందో అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. మరోవైపు వన్డే ప్రపంచకప్-2019లో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీఫైనల్లో కూడా రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ ఫీల్డ్ అంపైర్‌గా వ్యవహరించాడు. ఆ మ్యాచ్‌లో కివీస్ చేతిలో భారత్ ఓటమి పాలైంది. ఇక ఆసీస్-దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న రెండో సెమీఫైనల్‌కు రిచర్డ్ కెటిల్‌బరో, నితిన్ మీనన్ ఫీల్డ్ అంపైర్లుగా ఎంపికయ్యారు. థర్డ్ అంపైర్‌గా క్రిస్ గఫానీ, ఫోర్త్ అంపైర్‌గా మైఖేల్ గోఫ్ వ్యవహరించనున్నారు. అదేవిధంగా మ్యాచ్ రిఫరీగా జావగల్ శ్రీనాథ్ ఉండనున్నారు. చదవండి: World cup 2023: కివీస్‌తో సెమీస్ పోరు.. టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా? -
పేరుకే కుక్క కానీ కోట్ల లో సంపాదన .
-
అలాంటి వారికి సమాధానమే టక్కర్
‘‘మీరెప్పుడూ లవర్ బోయ్ పాత్రలు చేస్తుంటారు. కంప్లీట్ కమర్షియల్ సినిమా చేయొచ్చు కదా?’ అని చాలామంది నన్ను ప్రశ్నిస్తుంటారు.. వారికి సమాధానమే ‘టక్కర్’. ఫుల్ యాక్షన్ అండ్ రొమాంటిక్ టచ్‌తో ఈ ప్రేమకథ నడుస్తుంది’’ అన్నారు సిద్ధార్థ్. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వంలో సిద్ధార్థ్, దివ్యాంశా కౌశిక్ జంటగా నటించిన చిత్రం ‘టక్కర్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ప్యాషన్ స్టూడియోస్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సిద్ధార్థ్ మాట్లాడుతూ– ‘‘బాయ్స్’తో హీరోగా ఎంట్రీ ఇచ్చా. ఈ ఆగస్టుకి హీరోగా 20 ఏళ్ల కెరీర్ పూర్తవుతుంది. ఇప్పటికీ నా చేతిలో అరడజను సినిమాలు ఉండటం హ్యాపీ’’ అన్నారు. ‘‘టక్కర్’ న్యూ జనరేషన్ సినిమా. ఇందులో సిద్ధార్థ్‌ని రగ్డ్ లవర్ బోయ్‌గా చూస్తారు ’’ అన్నారు కార్తీక్ జి. క్రిష్. ‘‘ఈ సినిమాతో మళ్లీ పాత సిద్ధార్థ్‌ని చూస్తాం’’ అన్నారు చిత్ర సహనిర్మాత వివేక్ కూచిభొట్ల. -
ఈ కుక్క సంపాదన రూ.8 కోట్లకుపైనే! ఫాలోవర్లు కోట్లలోనే..
ప్రతి కుక్కకూ ఒక రోజు వస్తుంది అంటుంటారు.. కానీ టక్కర్ బడ్జిన్ అనే ఈ కుక్కకు సంవత్సరమంతా దానిదే.. ఎందుకంటే సంవత్సరంలో ఇది సంపాదించిన మొత్తం ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు. అమెరికాలోని మిచిగాన్‌లో టక్కర్ బడ్జిన్ అనే కుక్క మిలియన్ డాలర్ల సంపాదనతో సోషల్ మీడియా టాప్ డాగ్‌గా ఉద్భవించింది. ఇన్స్టాగ్రామ్, ట్విటర్, ఫేస్బుక్, టిక్‌టాక్, యూట్యూబ్.. ఒక్కటేమిటి అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలోనూ ఈ కుక్కకు పేజీలు ఉన్నాయి. మిలియన్లకొద్దీ ఫాలోవర్లు ఉన్నారు. ప్రింటెడ్ పెట్ మెమోరీస్ అనే సంస్థ నిర్వహించిన పరిశోధన ప్రకారం.. టక్కర్ అనే ఈ ఐదేళ్ల కుక్క.. రెండు ఏళ్ల వయసు నుంచే సంపాదించడం మొదలు పెట్టింది. తన సోషల్ మీడియా పేజీల్లో ప్రకటనలు, పెయిడ్ పోస్ట్‌లు, ఇతర మార్గాల ద్వారా ఒక మిలియన్ యూఎస్ డాలర్లు (రూ.8 కోట్లకుపైనే) సంపాదించగలిగింది. View this post on Instagram A post shared by TUCKER | The Golden Retriever (@tuckerbudzyn) ఈ కుక్కను పెంచుతున్న కోర్ట్నీ బడ్జిన్ అది సోషల్ మీడియా ద్వారా ఎంత సంపాదిస్తోందో వివరించారు. యూట్యూబ్ పెయిడ్ పోస్ట్‌కు గానూ 30 నిమిషాల ప్రీ-రోల్ కోసం 40,000 నుంచి 60,000 డాలర్లు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే 3 నుంచి 8 కథనాలకు దాదాపు 20,000 డాలర్లు సంపాదిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కుక్కను చూసుకునేందుకు కోర్ట్నీ, ఆమె భర్త మైక్ ఇద్దరూ వారి ఉద్యోగాలను విడిచిపెట్టారు. టక్కర్, దాని పిల్ల టాడ్‌ను చూసుకునేందుకే అంకితమయ్యారు. 2018లో కేవలం ఎనిమిది వారాల వయసున్న ఆ కుక్కను ఇంటికి తీసుకువచ్చిన రోజున కోర్ట్నీ దాని కోసం ఇన్స్టాగ్రామ్ పేజీని సృష్టించడంతో టక్కర్ స్టార్డమ్ మొదలైంది. తర్వాతి నెలలో టక్కర్ మొదటి వీడియో వైరల్‌గా మారింది. ప్రస్తుతం టక్కర్‌కు వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో దాదాపు 25 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. టిక్‌టాక్‌లో 11.1 మిలియన్లు, యూట్యూబ్‌లో 5.1 మిలియన్లు, ఫేస్బుక్లో 4.3 మిలియన్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 3.4 మిలియన్లు, ట్విటర్లో 62,400 మంది ఫాలోవర్లను ఈ కుక్క సంపాదించుకుంది. ఇదీ చదవండి: Tax Exemption: పన్ను మినహాయింపు.. లీవ్ ఇన్క్యాష్మెంట్పై ఆర్థిక శాఖ కీలక ప్రకటన -
కయ్యాలే...కయ్యాలే
సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ జంటగా నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘టక్కర్’. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఫ్యాషన్ స్టూడియోస్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 26న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం నుంచి ‘కయ్యాలే...కయ్యాలే’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ను ఇటీవల చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. నివాస్ కె. ప్రసన్న సంగీత సారథ్యంలో కృష్ణకాంత్ లిరిక్స్ అందించిన ఈ పాటను నిరంజన్ రామనన్ ఆలపించారు. ఈ సినిమాకు సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మయాంక్. -
శతక్కొట్టిన టకెర్.. ఐర్లాండ్ అసాధారణ పోరాటం
మిర్పూర్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో ఐర్లాండ్ అసాధారణ పోరాటపటిమను కనబరిచింది. 131 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. ఓవర్‌నైట్ స్కోరు 27/4తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఐర్లాండ్ ఆట ముగిసే సమయానికి 107 ఓవర్లలో 8 వికెట్లకు 286 పరుగులు సాధించింది. వికెట్ కీపర్ లొర్కాన్ టకెర్ (162 బంతుల్లో 108; 14 ఫోర్లు, 1 సిక్స్) వీరోచిత సెంచరీ చేశాడు. హ్యారీ టెక్టర్ (56; 7 ఫోర్లు, 1 సిక్స్), మెక్‌బ్రైన్ (71 బ్యాటింగ్; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. టెక్టర్, టకెర్ ఆరో వికెట్‌కు 72 పరుగులు... టకెర్, మెక్‌బ్రైన్ ఏడో వికెట్‌కు 111 పరుగులు భాగస్వామ్యం జోడించారు. -
కొత్త సీఎస్ నియామకంపై ఏపీ సర్కార్ కసరత్తు
విజయవాడ: నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. ప్రస్తుత సీఎస్ టక్కర్ పదవీ కాలం రేపటితో (మంగళవారం)తో ముగియనుంది. దీంతో ఆయన స్థానంలో కొత్త సీఎస్ కోసం ప్రభుత్వం సమాచాలోచనలు చేస్తోంది. కాగా కొత్త సీఎస్ రేసులో అజయ్ కల్లాం, దినేష్ కుమార్, అనిల్ చంద్ర పునీత్ ఉన్నారు. కాగా అజయ్ కల్లాంను సీఎస్‌గా నియమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావించినట్లు తెలుస్తోంది. అయితే ఆయన మార్చి 31న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో నెలలో రిటైర్ అయ్యే అధికారికి.. పదవీకాలం పొడిగింపు కుదరదని డీవోపీటీ, పీఎంవో స్పష్టం చేసింది. అజయ్ కల్లాం ప్రస్తుతం ఫైనాన్స్ విభాగం ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ఆయన పదవీ పొడిగింపు కుదరదని తేల్చిచెప్పడంతో ఈ నేపథ్యంలో అజయ్ కల్లాం నియామకంపై సందిగ్ధత నెలకొంది. దీంతో సీనియారిటీ జాబితాలో గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి దినేశ్ కుమార్ ను పూర్తిస్థాయి సీఎస్‌గా నియమించడంపై ప్రభుత్వం పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. -
సీఆర్డీఏ కమిషనర్‌గా చెరుకూరి శ్రీధర్
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(ఏపీ సీఆర్డీఏ) కమిషనర్‌గా చెరుకూరి శ్రీధర్ నియమితులయ్యారు. గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఉన్న శ్రీధర్‌ను సీఆర్డీఏ కమిషనర్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రస్తు తం ఆ స్థానంలో ఉన్న నాగులాపల్లి శ్రీకాంత్‌ను సాధారణ పరిపాలన శాఖ(పొలిటికల్) కార్యదర్శిగా బదిలీ చేసింది. ఈ మేరకు మొత్తం నలుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ సత్యప్రకాష్ టక్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. విజయనగరం జిల్లా కలెక్టర్ ముదావతు ఎం.నాయక్‌ను తూర్పుప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ(విశాఖపట్నం) సీఎండీగా బదిలీ చేశారు. శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్ విజయనగరం జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. శ్రీధర్ నియామకం చట్టం విరుద్ధం! సాక్షి, విజయవాడ బ్యూరో: సీఆర్డీఏ కమిషనర్‌గా చెరుకూరి శ్రీధర్ నియామకం చట్టవిరుద్ధమని అధికార వర్గాల్లో గుప్పుమంటోంది. సీఆర్డీఏ కమిషనర్ (సీఈవో)గా నియమితుడయ్యే అధికారికి అంతకుముందు రాష్ట్రంలో కలెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలని 2014 సీఆర్డీఏ చట్టం సెక్షన్ 21(1)లో స్పష్టంగా పేర్కొన్నారు. శ్రీధర్ ఇప్పటివరకూ కలెక్టర్‌గా పనిచేయలేదు. 2009 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం జాయింట్ కలెక్టర్ హోదాలో పనిచేస్తున్నారు. కానీ, ప్రభుత్వం అవేమీ పట్టించుకోకుండా నేరుగా కమిషనర్‌గా నియమించింది. తాను రూపొందించిన చట్టంలోని నిబంధనలను తానే ఉల్లంఘించి శ్రీధర్‌కు సీఆర్డీఏ కమిషనర్‌గా పోస్టింగ్ ఇచ్చింది. వాస్తవానికి నాగులపల్లి శ్రీకాంత్‌ను కమిషనర్‌గా నియమించినప్పుడే జూనియర్‌కు ఆ స్థాయి పోస్టింగ్ ఇవ్వడం ఏమిటని ఐఏఎస్ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ నియామకానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఏకంగా చట్టంలోనే ఒక నిబంధనను చేర్చింది. ఆయనకు కలెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉండడంతో దాన్నే నిబంధనగా చేర్చింది. కానీ ఇప్పుడు దాన్ని ఉల్లంఘించి అంతకంటే జూనియర్ అధికారిని నియమించడం గమనార్హం. -
అడ్డగోలు దోపిడీని ఓకే చేసేద్దాం!
-
అడ్డగోలు దోపిడీని ఓకే చేసేద్దాం!
- నేడు కేబినెట్ ప్రత్యేక భేటీ - నోటిమాటపై రూ.86 కోట్ల పనులు అప్పజెప్పిన సీఎం - టెండర్లు లేవు, నిబంధనలు పాటించలేదు - నామినేషన్లు, కొటేషన్లపై పనులు కుదరదన్న ఆర్థిక శాఖ - సీఎం సంతకం ఉంటేనే బిల్లులు చెల్లిస్తామని స్పష్టీకరణ - ఇరుక్కోకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి ఎత్తుగడ - మంత్రివర్గంతో ఆమోదింపచేసేందుకు ప్రయత్నాలు సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గం నేడు ప్రత్యేకంగా భేటీ కానుంది. రైతుల బాధల గురించో, ఆడపడుచుల కష్టాల గురించో, రాష్ట్రాభివృద్ధి గురించో చర్చించేందుకు కాదు... మరెందుకో తెలుసా? ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నోటిమాటపై కృష్ణా పుష్కరాల పనులు చేపట్టిన సోమా కంపెనీకి నామినేషన్‌పై రూ.86 కోట్ల పనులు అప్పగించేందుకు. అదేంటీ... పనులు అప్పగించాలంటే టెండర్లు పిలవాలి కదా.. అనుకుంటున్నారా? బాబు గారి జమానాలో అలా ఉండ దు మరి. పనులేవైనా సరే... టెండర్లు పిలవకుండా తాత్సారం చేయడం, చివరకు గడువు సమీపిస్తున్నప్పుడు నామినేషన్లపై భారీ మొత్తాలకు పనులు అప్పగించి, అందినమేరకు కమీషన్లు తీసుకోవడం చంద్రబాబు సర్కారు శైలి. కృష్ణా పుష్కరాల పనుల విషయంలోనూ ఇదే తీరును అమలుచేస్తున్నారు. అలా పనులు దక్కించుకున్న అస్మదీయ సంస్థ కు బిల్లుల ఆమోదం కోసం నేడు ప్రత్యేకంగా రాష్ట్ర మంత్రివర్గం భేటీ కావడం విశేషం. నోటిమాటపై రూ.86 కోట్ల పనులు... పరిపాలనపరమైన అనుమతులు, టెండర్లు, శాఖలతో పని లేకుండా ముఖ్యమంత్రి నోటి మాటతో రూ.86 కోట్ల విలువైన దుర్గా పుష్కర ఘాట్ పనులను సోమా కనస్ట్రక్షన్ సంస్థ చేపట్టిన విషయం తెలిసిందే. ఇందుకు సాగునీటి శాఖ ఎటువంటి అనుమతులను ఇవ్వలేదు. అయితే ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు పుష్కర ఘాట్ పనులను కొటేషన్లు ద్వారా సోమా కనస్ట్రక్షన్‌కు అప్పగిస్తామంటూ ఆర్థిక శాఖ అనుమతికోసం ఫైలు పంపింది. ఇందుకు ఆర్థిక శాఖ ససేమిరా అంది. ఐదు లక్షల రూపాయలకన్నా ఎక్కువ విలువగల పనులకు టెండర్లను పిలవాల్సి ఉందని, పైగా రూ.86 కోట్ల విలువైన పనులను కొటేషన్లపై ఇచ్చేందుకు అంగీకరించబోమని స్పష్టం చేసింది. నిబంధనల మేరకు టెండర్లను పిలవాల్సిందేనని ఆఫైలును సాగునీటి శాఖకు తిప్పిపంపింది. దీంతో సాగునీటి శాఖ ఇప్పటికే ఆ సంస్థ పనులు ప్రారంభించిందని ఆర్థిక శాఖ దృష్టికి తీసుకువెళ్లింది. పనులు ప్రారంభించడానికి ముందుగా వచ్చిన ఫైళ్లపై ఆర్థిక శాఖ అభిప్రాయాన్ని చెబుతుందని, ఇప్పటికే ప్రారంభించిన వాటికి ఎటువంటి ఆమోదం తెలపదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సాగునీటి శాఖ ముఖ్యమంత్రి ద్వారా ఫైలు సర్యులేట్ చేసి ఆర్థిక శాఖ నుంచి బిల్లులను పొందాల్సి ఉంటుంది. అంటే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే సోమా సంస్థ పనులు చేపట్టినందున సంబంధిత ఫైల్లో ఆ విషయాన్ని పేర్కొనడంతో పాటు ముఖ్యమంత్రి ఆమోదం పొందాల్సి ఉంటుంది. అయితే తాను సంతకం చేస్తే భవిష్యత్తుల్లో చిక్కుల్లో పడే ప్రమాదం ఉందని పసిగట్టిన సీఎం, ఆ పనులకు మంత్రివర్గంతో ఆమోదింపచేసి అక్రమాన్ని సక్రమం చేయాలని వ్యూహం పన్నారు. ఆ మేరకు మంగళవారం కేబినెట్ సమావేశంలో నామినేషన్‌పై సోమాకు దుర్గా ఘాట్ పనులను అప్పగించేందుకు ఆమోదం తెలుపనున్నారు. నేడు మంత్రివర్గ ప్రత్యేక సమావేశం... రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆగస్టు 1వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహించాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు అన్ని శాఖలకు ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే మంగళవారం ఉదయం 10 గంటలకు మంత్రివర్గ సమావేశం ఉన్నట్లు సోమవారం ఉదయం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సమాచారం వచ్చింది. వచ్చే నెల 1వ తేదీన మంత్రివర్గ సమావేశం మంగళవారానికి ముందుకు జరిగిందని అధికార యంత్రాంగం భావించారు. అయితే వచ్చే నెల 1వ తేదీ మంత్రివర్గ సమావేశం యధావిధిగా ఉందని, మంగళవారం మంత్రివర్గ సమావేశం ప్రత్యేకించి కృష్ణా పుష్కరాలపైనేనని సీఎం కార్యాలయం సమాచారం అందించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ సోమవారం పుష్కర పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం నోటిమాటపై రూ.86 కోట్ల విలువైన దుర్ఘ ఘాట్ పనులను చేస్తున్న సోమా కంపెనీకి నామినేషన్‌పై పనులు అప్పగించి, గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికే కేబినెట్ సమావేశం అని సమీక్షలో తేలింది. అయితే నామినేషన్‌పైన, కొటేషన్లపైన పనుల అనుమతికి ఎట్టిపరిస్థితుల్లోను అనుమతించలేమని ఆర్థిక శాఖ సీఎస్ నిర్వహించిన సమీక్షలో మరోసారి స్పష్టం చేయడం గమనార్హం. అయితే నామినేషన్‌పై పనులు అప్పగించడాన్ని మంగళవారం మంత్రివర్గంతో ఆమోదింపచేసి, బిల్లులు చెల్లించేందుకు సర్కారు సన్నద్ధమవుతోంది. -
‘స్విస్‌ఛాలెంజ్’లో నిబంధనలు పాటించండి
నిర్ణయాన్ని కేబినెట్‌కు వదిలేస్తూ సీఎస్ ప్రత్యేక నోట్ సాక్షి, హైదరాబాద్: రాజధాని అమరావతి డెవలప్మెంట్ భాగస్వామిగా సింగపూర్ కంపెనీలను స్విస్ ఛాలెంజ్ విధానంలో ఎం పిక చేసే అంశానికి సంబంధించి చట్టంలో పేర్కొన్న నిబంధనలను పాటించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ సూచించారు. మంగళవారం సీఆర్డీఏ అధికారులతో సమావేశానంతరం ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక నోట్ సమర్పించారు. సింగపూర్ ప్రైవేట్ కంపెనీలు అసెండాస్, సెమ్బ్బ్రిడ్జి, సెమ్‌కార్ప్ కన్సార్టియం సమర్పించిన స్విస్ ఛాలెంజ్ ప్రతిపాదనల్లో అత్యంత కీలకమైన సబ్సిడీ అండ్ డెవలప్మెంట్ అగ్రిమెంట్‌కు, షేర్ హోల్డింగ్ అగ్రిమెంట్‌కు ముందుగానే సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపిన సంగతి తెల్సిందే. ఆర్థికమంత్రి యనమల నేతృత్వంలోని మంత్రుల కమిటీ సింగపూర్ కంపెనీల కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదనలకు ఆమోదించగా ఆ సిఫార్సులను ఆమోదిస్తూ సీఎం కూడా సంతకం చేశారు. అనంతరం సీఎస్ అధ్యక్షతన గల మౌలిక సదుపాయాల అభివృద్ధి అధారిటీకి పంపించారు. అయితే సంబంధిత శాఖకు ఫైలు సర్క్యులేట్ చేయకుండా ఆయా శాఖల అభిప్రాయాలు లేకుండా అథారిటీకి పంపించి వెంటనే కేబినెట్‌కు పెట్టాలంటే ఎలాగని సీఎస్ శుక్రవారం నాటి సమావేశంలో ప్రశ్నించిన విషయం తెలిసిం దే. 24న జరిగే మంత్రివర్గ సమావేశానికి స్విస్ ఛాలెంజ్ ప్రతిపాదనలు వెళ్లనున్నాయి. ఇప్పటికే సీఎం ఆమోదించినందున కేబినెట్ ఆమోదం లాంఛనమే కానుంది. కేబినెట్ ఆమోదం అనంతరం సింగపూర్ కంపెనీల ప్రతిపాదనలను బహిరంగ పరుస్తూ ఛాలెంజ్ చేయడానికి అవకాశం కల్పిస్తారు. -
27న వెళ్లాల్సింది హెచ్ఓడీలే..
ఉద్యోగులకు సీఎస్ స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి ఈనెల 27న వెళ్లాల్సింది హెచ్ఓడీలు మాత్రమేనని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ స్పష్టం చేశారు. శుక్రవారం తన ఛాంబర్ ఎదుట భైఠాయించిన సచివాలయ ఉద్యోగుల వినతి పత్రం స్వీకరించిన తర్వాత ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకుని వాటిపై వివరణ ఇచ్చారు. శాఖాధిపతుల (హెచ్ఓడీ) కార్యాలయాల ఉద్యోగులు మాత్రమే ఈ నెల 27వ తేదీలోగా కొత్త రాజధానికి వెళ్లాల్సి ఉంటుందని సర్క్యులర్ ఇచ్చామన్నారు. అయితే వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం భవన నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదని, అవి సిద్ధమైన తర్వాతే సచివాలయ ఉద్యోగుల తరలింపు అంశంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మొత్తం మీద 60 రోజుల్లో సచివాలయాన్ని పూర్తి స్థాయిలో తరలిస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు అన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. తరలింపుపై రెండు మూడు రోజుల్లో రోడ్ మ్యాప్ ఖరారు చేస్తామన్నారు. ఉద్యోగుల సమస్యలు తెలుసుకుని పరిశీలించేందుకు సచివాలయం ఎల్ బ్లాక్ ఏడో అంతస్తులో హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.అమరావతికి వెళ్లడానికి ఇబ్బందులున్న వారు హెల్ప్‌డెస్క్‌లో వినతులు ఇవ్వవచ్చన్నారు. సిద్ధపడిన వాళ్లనే తరలించాలి..:ఏపీ కొత్త రాజధాని అమరావతికి వెళ్లడానికి సిద్ధపడిన వాళ్లను మాత్రమే తీసుకువెళ్లాలని సచివాలయ ఉద్యోగ సంఘ నాయకుడు, ఏపీ హౌసింగ్ సొసైటీ మాజీ అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డి కోరారు. సీఎస్‌కు వినతి పత్రం సమర్పించిన తర్వాత సచివాలయం మీడియా పాయింట్లో ఆయన మాట్లాడారు. రాజధాని తరలింపునకు వ్యతిరేకం కాదని.. అయితే కనీస వసతులు కల్పించాలని కోరుతున్నట్లు సచివాలయం గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య అన్నారు. తరలింపు అంశంతో చాలా సమస్యలు ఏర్పడ్డాయన్నారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలతో పాటు ఇక నుంచి ఉద్యోగస్తుల ఆత్మహత్యలు జరిగే ప్రమాదం ఉందని సచివాలయం ఉద్యోగ సంఘం నేత బాబూరావు సాహెబ్ ఆందోళన వ్యక్తం చేశారు. -
జూన్ 27లోగా ఆ కార్యాలయాలు వెళ్లాల్సిందే
సాక్షి, హైదరాబాద్: జూన్ 27వ తేదీ నుంచి కొత్త రాజధాని నుంచే శాఖాధిపతుల కార్యాలయాలు పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ లోగా అవి హైదరాబాద్ నుంచి రాజధాని ప్రాంతం గుంటూరు, విజయవాడలకు తరలి వెళ్లాల్సిందేనని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాశ్ టక్కర్ బుధవారం సర్క్యులర్ జారీ చేశారు. తొలి ప్రాధాన్యంగా శాఖలకు చెందిన ప్రభుత్వ భవనాలు ఉంటే అక్కడికి తరలి వెళ్లాలని చెప్పారు. లేదంటే గుంటూరు, విజయవాడల్లో ఆ జిల్లాల కలెక్టర్లు ప్రవేట్ భవనాలను గుర్తించారని, వెంటనే ఆ భవనాలు పరిశీలించి అద్దెకు తీసుకోవడంతో పాటు జూన్ 27లోగా వెళ్లాలన్నారు. హైదరాబాద్‌లోని కార్యాలయాల్లో ఫర్నిచర్, పరికరాలతోపాటు ఉద్యోగులందరూ ఆలోగా తరలివెళ్లాల్సిందేనని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ ఇప్పటికే 16,96,231 చదరపు అడుగుల నిర్మాణ స్థలం గల 85 ప్రైవేట్ భవనాలను గుర్తించారని, 2,34,000 చ.అడుగుల పార్కింగ్ స్థలాన్ని గుర్తించారని తెలిపారు. గుంటూరు జిల్లా కలెక్టర్ 1,50,000 చ.అడుగుల నిర్మాణ స్థలమున్న నాలుగు ప్రైవేట్ భవనాలను గుర్తించారన్నారు.ఉన్నతాధికారులు ఆ జిల్లా ల కలెక్టర్ల సాయంతో ఆ భవనాలను పరిశీలించి అద్దె ఒప్పందాలను చేసుకోవాలన్నారు. రాష్ట్ర విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10ల్లో ఉన్న సంస్థలు మినహా మిగతా శాఖాధిపతుల కార్యాలయాలన్నీ తరలివెళ్లాల్సిందేనని ఉద్ఘాటించారు. భారీగా అద్దెలు చెల్లించేందుకు సిద్ధం శాఖాధిపతుల కార్యాలయాలకు అవసరమైన ప్రైవేట్ భవనాలకు ఎంత వరకైనా అద్దె చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల అధికారుల సమావేశంలో స్పష్టం చేశారు. చదరపు అడుగుకు రూ.25 వరకు నెలకు అద్దె చెల్లించేందుకు కూడా వెనుకాడేది లేదని ఆయన తెలిపారు.