BAN Vs IRE, One-Off Test: Tucker Ton Fronts Ireland Fight Back - Sakshi
Sakshi News home page

BAN Vs IRE One Off-Test: శతక్కొట్టిన టకెర్‌.. ఐర్లాండ్‌ అసాధారణ పోరాటం 

Published Fri, Apr 7 2023 7:15 AM | Last Updated on Fri, Apr 7 2023 10:14 AM

BAN Vs IRE One Off Test: Tucker Ton Fronts Ireland Fight Back - Sakshi

మిర్పూర్‌: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో ఐర్లాండ్‌ అసాధారణ పోరాటపటిమను కనబరిచింది. 131  పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 27/4తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఐర్లాండ్‌ ఆట ముగిసే సమయానికి 107 ఓవర్లలో 8 వికెట్లకు 286 పరుగులు సాధించింది.

వికెట్‌ కీపర్‌ లొర్కాన్‌ టకెర్‌ (162 బంతుల్లో 108; 14 ఫోర్లు, 1 సిక్స్‌) వీరోచిత సెంచరీ చేశాడు. హ్యారీ టెక్టర్‌ (56; 7 ఫోర్లు, 1 సిక్స్‌), మెక్‌బ్రైన్‌ (71 బ్యాటింగ్‌; 8 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. టెక్టర్, టకెర్‌ ఆరో వికెట్‌కు 72 పరుగులు... టకెర్, మెక్‌బ్రైన్‌ ఏడో వికెట్‌కు 111 పరుగులు భాగస్వామ్యం జోడించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement