'మజిలీ’ తో మొదలుపెట్టిన దివ్యాన్ష కౌశిక్.. అనతికాలంలోనే ఎంతోమంది మదిని దోచి అంతులేని అభివనాన్ని సొంతం చేసుకుంది. తాను అనుకోకుండా నటిగా మారాను. లేకుంటే ఫ్యాషన్ జర్నలిస్ట్‌గా .. ఏదైనా ఫ్యాషన్ మ్యాగజైన్‌కి ఎడిటర్‌ని కావాలి అనే లక్ష్యంతో ఉండేదాన్ని అని చెబుతోంది దివ్యాన్ష. మరి ఆమె మదిని దోచిన ఫ్యాషన్ బ్రాండ్స్ ఏంటో చూద్దాం.. అనుకోకుండా నటిగా మారాను. లేకుంటే ఫ్యాషన్ జర్నలిస్ట్‌గా .. ఏదైనా ఫ్యాషన్ మ్యాగజైన్‌కి ఎడిటర్‌ని కావాలి అనే లక్ష్యంతో ఉండేదాన్ని.
దిల్నాజ్..
ముంబైకి చెందిన దిల్నాజ్ కర్బరీ.. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలియానీ వద్ద దాదాపు పదిహేనేళ్ల పాటు కోచర్ డిజైన్ హెడ్‌గా పనిచేసింది. ఫ్యాషన్‌పై ప్రావీణ్యం, పట్టు రెండ ఉండటంతో 2009లో తన పేరు మీదనే ముంబైలో ‘దిల్నాజ్’ ఫ్యాషన్ హౌస్‌ని ప్రారంభించింది. వైబ్రెంట్ కలర్స్.. డిజైన్స్‌కి ఈ బ్రాండ్ పెట్టింది పేరు. గ్రాండ్ లుక్‌నిచ్చే దిల్నాజ్ బ్రాండ్ దుస్తులు సెలబ్రిటీలను సైతం మెప్పిస్తున్నాయి. ధర కాస్త ఎక్కువే! ఆన్‌లైన్‌లోనూ లభ్యం. ఇక దివ్వాన్ష కౌశిక్ కోసం దిల్నాజ్ డిజైన్ చేసిన చీర బ్రాండ్ ధర రూ. 59,900/-
దివ్యాన్ష కౌశిక్‌జ్యూలరీ బ్రాండ్: జతిన్ మోర్ జ్యూయల్స్ ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.
జతిన్ మోర్..
అతిప్రాచీన, ప్రసిద్ధ జ్యూలరీ బ్రాండ్స్‌లో ఒకటి జతిన్ మోర్ జ్యూయల్స్. 1891లో ఆనంద్ మోర్ ప్రారంభింన వ్యాపారాన్ని.. ప్రస్తుతం వారి నాలుగోతరం వారసుడు జతిన్ మోర్.. ‘జతిన్ మోర్ జ్యూయల్స్’ పేరుతో కొనసాగిస్తున్నాడు. సంస్కృతి, సంప్రదాయ, హస్తకళల సారాన్ని ఆధునిక డిజైన్స్‌లో వర్ణింనట్టుంటాయి ఈ ఆభరణాలు. అదే వీరి బ్రాండ్ వాల్య! ధర ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. పలు ప్రముఖ నగరాలతోపాటు ఆన్‌లైన్‌లోన లభ్యం.
దివ్యాన్ష కౌశిక్
-దీపిక కొండి
Comments
Please login to add a commentAdd a comment