ఫ్యామిలీస్టార్‌ సినిమాలో హీరోయిన్‌గా లక్కీ చాన్స్‌? | Divyansha Kaushik Lucky Chance as Heroine in Family Star Movie | Sakshi
Sakshi News home page

లక్కీ చాన్స్‌?

Published Fri, Jul 21 2023 12:36 AM | Last Updated on Fri, Jul 21 2023 2:13 AM

Divyansha Kaushik Lucky Chance as Heroine in Family Star Movie - Sakshi

‘గీత గోవిందం’ (2018) వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత హీరో విజయ్‌ దేవరకొండ, దర్శకుడు పరశురామ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. అయితే కథ రీత్యా ఈ సినిమాలో మరో హీరోయిన్‌కు చోటు ఉందని, దీంతో ఈ పాత్రకు దివ్యాంశ కౌశిక్‌ను చిత్రయూనిట్‌ సెలక్ట్‌ చేసుకున్నారనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.

ఇదే నిజమైతే దివ్యాంశకు మరో లక్కీ చాన్స్‌ దక్కినట్లేనని సినిమా ప్రేమికులు చెప్పుకుంటున్నారు. ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘ఫ్యామిలీస్టార్‌’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరిలో విడుదల చేయనున్నట్లుగా చిత్రయూనిట్‌ ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement