నాగచైతన్య ‘మజిలీ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఢిల్లీ సుందరి దివ్యాన్ష కౌశిక్. ‘‘స్టోరీలైన్ నచ్చితే చిన్నపాత్ర అయినా చేస్తాను’ అంటున్న దివ్యాన్షు తన గురించి తాను చెప్పుకున్న కొన్ని ముచ్చట్లు....
అమ్మా నాన్నా నేను
మొదటిసారి నాగచైతన్యను కలిసినప్పుడు ‘‘నా పేరు దివ్యాన్షు’’ అని పరిచయం చేసుకున్నాను. నా పేరులోని చివరి అక్షరాలతో ‘మజిలీ’లోని నా పాత్రకు ‘అన్షూ’గా పేరు పెట్టారు. ఇంట్లో నన్ను ‘అన్నీ’ అని పిలుస్తారు. అమ్మ ‘అనూ’, నాన్న ‘అశ్విన్’ నా పేరులో ధ్వనిస్తారు!
నాటకాలు వేశాను
మా అమ్మ ఢిల్లీలో పేరున్న మేకప్–ఆర్టిస్ట్, బ్యూటీ ఎడిటర్. ఆమె నిరంతర విద్యార్థి. ఇప్పటికీ ఫ్యాషన్ వరల్డ్‌కు సంబంధించి కొత్త కోర్సులు చదువుతూనే ఉంటుంది. ఢిల్లీలో అమ్మతో పాటు షూట్స్‌కు వెళుతుండేదాన్ని.‘‘మీ అమ్మాయి బాగుంది. సినిమాల్లోకి తీసుకురావచ్చు కదా’’ ఇలాంటి కామెంట్స్ వినిపిస్తూ ఉండేవి. ఈ సంగతి ఎలా ఉన్నా ముస్సోరిలోని బోర్డింగ్ స్కూల్‌లో చదువుకునే రోజుల్లో డిబేట్స్‌లో చురుగ్గా పాల్గొనేదాన్ని. నాటకాలు వేసేదాన్ని. అయితే నటనను ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు. భవిష్యత్‌లో మేక్‌ప్–ఫీల్డ్‌లో పనిచేయాలని అనుకునేదాన్ని. అమ్మకు ఢిల్లీలో ఉన్న ఫామ్‌హౌస్‌లో స్పా, సెలూన్‌ను ఉన్నాయి.
ఆ సినిమా చూసిన తరువాత...
‘కబీ ఖుషీ కబీ ఘమ్’ సినిమాలో కరీనాకపూర్‌ను చూసిన తరువాత యాక్టర్ కావాలని డిసైడైపోయాను.అంతకుముందు జర్నలిస్ట్ కావాలని, ఒక పత్రికకు ఎడిటర్ కావాలని అనుకునేదాన్ని!అప్పట్లో కాస్త లావుగా ఉండేదాన్ని.సినిమాల్లో నటించాలనే ఆలోచన వచ్చిన తరువాత...‘‘అసలు ఈ బరువుతో సాధ్యమేనా?’’ అనే సందేహం వచ్చింది. ఆ తరువాత మాత్రం బరువు తగ్గడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాను.
ఆమెతో మళ్లీ పనిచేయాలని ఉంది!
యశ్‌రాజ్ ఫిలిమ్స్‌లో పనిచేస్తున్నప్పుడు కాస్టింగ్, ఫిల్మ్‌మేకింగ్ ప్రాసెస్ గురించి వివరంగా తెలుసుకున్నాను. మోటర్‌సైకిల్ కమర్షియల్ పదిమంది దృష్టిలో పడేలా చేసింది. ఆ సమయంలోనే డైరెక్టర్ శివ నిర్వాణ ‘‘తెలుగు ఫిల్మ్ అడిషన్‌కు ఆసక్తి ఉందా?’’ అని అడిగారు. ఉంది అన్నాను. సెలెకై్టపోయాను. ముఖ్యవిషయం ఏమిటంటే నేను సమంతకు పెద్ద ఫ్యాన్. మక్కీ(ఈగ) సినిమా చాలాసార్లు చూశాను. ఆమెతో మళ్లీ పనిచేయాలని ఉంది.
Comments
Please login to add a commentAdd a comment