సందీప్ కిషన్, హన్సిక
సందీప్ కిషన్ హీరోగా జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో లె రకెక్కిన చిత్రం ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’. ‘కేసులు ఇవ్వండి ప్లీజ్’ అన్నది ఉపశీర్షిక. హన్సిక హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో నటించారు. జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో ఎస్.ఎన్.ఎస్ క్రియేషన్స్ పతాకంపై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జగదీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ చిత్రం టైటిల్ సాంగ్‌ను తెనాలిలో ఆదివారం విడుదల చేశారు.
‘‘ఇంతకాలం రకరకాల భోజనాలు తిన్నట్టుగా అనిపించినా, ఈ సినిమాతో అమ్మ చేతి వంట తిన్నంత తృప్తిగా ఉంది. చాలాకాలం తర్వాత నా సినిమాను నేనే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను’’ అని తెనాలిలో జరిగిన సాంగ్ రిలీజ్ కార్యక్రమంలో అన్నారు సందీప్ కిషన్. బ్రహ్మానందం, మురళీ శర్మ, ‘వెన్నెల’ కిశోర్, ప్రభాస్ శ్రీను, పృథ్వి, రఘుబాబు, రజిత, కిన్నెర, అన్నపూర్ణమ్మ, వై.విజయ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సీతారామరాజు మల్లెల, కెమెరా: సాయిశ్రీరాం, సంగీతం: సాయికార్తీక్.
Comments
Please login to add a commentAdd a comment