
‘అందాల రాక్షసి’సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన లావణ్య త్రిపాఠి.. అతికొద్ది కాలంలోనే అభిమానుల్లో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నారు. ‘భలే భలే మగాడివోయ్’, ‘సోగ్గాడే చిన్నినాయన’, ‘ఉన్నది ఒక్కటే జిందగీ’, ‘అర్జున్ సురవరం’, వంటి హిట్ చిత్రాల్లో నటిగా వందకు వంద మార్కులను సొంతం చేసుకున్నారు. తాజాగా సందీప్ కిషన్ హీరోగా హాకీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి సందీప్ కిషన్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన చిత్ర బృందం.. ఈ రోజు లావణ్య త్రిపాఠి బర్త్‌డే సందర్భంగా ఆమె లుక్‌ను తాజాగా రివీల్ చేసింది.
ఈ సినిమాలో ‘హాకీ ప్లేయర్ లావణ్య రావు’ పాత్రలో లావణ్య త్రిపాఠి కనిపించనున్నారు. ఈ పాత్రలో జీవించాలనే ఉద్దేశంతో హాకీలో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంపై సందీప్ భారీ ఆశలే పెట్టుకున్నాడు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం నిర్మిస్తున్న ఈ చిత్రానికి హిప్ హాప్ తమిజా సంగీతమందిస్తున్నాడు. ఈటీవలే నిఖిల్, లావణ్య హీరోహీరోయిన్‌లుగా నటించిన ‘అర్జున్ సురవరం’ బ్లాకబస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి లావణ్య త్రిపాఠిపై ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా ఆమె నవ్వంటే తనకు ఎంతో ఇష్టమని మనసులోని మాటను బయటపెట్టారు చిరు.
Comments
Please login to add a commentAdd a comment