హాకీ ఎక్స్‌ప్రెస్‌ | Sandeep Kishan looks stunning in first-look poster of A1 Express | Sakshi
Sakshi News home page

హాకీ ఎక్స్‌ప్రెస్‌

Published Sun, Jan 10 2021 4:02 AM | Last Updated on Sun, Jan 10 2021 4:03 AM

Sandeep Kishan looks stunning in first-look poster of A1 Express - Sakshi

సందీప్‌ కిషన్, లావణ్యా త్రిపాఠి జంటగా నటించిన న్యూఏజ్‌ స్పోర్ట్స్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’. డెన్నిస్‌ జీవన్‌ కనుకొలను దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్‌ పతాకాలపై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్, సందీప్‌ కిషన్, దయా వన్నెం నిర్మించారు. ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ ఫస్ట్‌ లుక్‌ను శనివారం విడుదల చేసింది చిత్రబృందం. పోస్టర్‌లో ఎయిట్‌ప్యాక్‌ బాడీతో ఒక చేతిలో హాకీ స్టిక్‌ పట్టుకుని మరో చేతిలో చొక్కా ఊపుతూ కనిపించారు సందీప్‌. త్వరలో థియేటర్‌లలో విడుదలయ్యేందుకు సిద్దమవుతుందీ సినిమా. తెలుగు సినిమా పరిశ్రమలో హాకీ నేపథ్యంలో వస్తున్న ఈ తొలి చిత్రానికి హిప్‌హాప్‌ తమిళ సంగీత దర్శకుడు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement