సింగిల్‌ కింగులం.. | Sundeep Kishan A1 Express: First lyrical song is out | Sakshi

సింగిల్‌ కింగులం..

Published Thu, Feb 13 2020 2:49 AM | Last Updated on Thu, Feb 13 2020 2:49 AM

Sundeep Kishan A1 Express: First lyrical song is out - Sakshi

సందీప్‌ కిషన్, లావణ్య త్రిపాఠి

హాకీ నేపథ్యంలో తెలుగులో తెరకెక్కుతోన్న తొలి చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’. సందీప్‌ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్నారు. డెన్నిస్‌ జీవన్‌ కనుకొలను దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్‌ పతాకాలపై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్, సందీప్‌ కిష¯Œ , దయా పన్నెం నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ముగింపు దశలో ఉంది.  సామ్రాట్‌ సాహిత్యం అందించగా హిప్‌ హాప్‌ తమిళ స్వరపరచిన ఈ చిత్రంలోని తొలి పాట ‘సింగిల్‌ కింగులం..’ని యూ ట్యూబ్‌లో రిలీజ్‌ చేశారు.

రాహుల్‌ సిప్లిగంజ్‌ పాడిన ఈ పాటకి శేఖర్‌ మాస్టర్‌ నృత్యాలు సమకూర్చారు. ‘‘న్యూ ఏజ్‌ స్పోర్ట్స్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రమిది. సందీప్‌ కిషన్, లావణ్య త్రిపాఠి కలసి ఆడి పాడిన ‘సింగిల్‌ కింగులం..’ పాట ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: కవిన్‌ రాజ్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: శివ చెర్రీ, సీతారాం, దివ్య విజయ్, మయాంక్‌ సింఘానియా, సహనిర్మాత: వివేక్‌ కూచిభొట్ల.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement