
ఈ లాక్‌డౌన్ సమయంలో హీరో సందీప్ కిషన్ దాదాపు 12 కేజీల బరువు తగ్గారు. కారణం తన తాజా చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ కోసమే. సందీప్ కిషన్ హీరోగా డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ఇది. ఇందులో హాకీ ప్లేయర్‌గా కనిపించనున్నారు సందీప్ కిషన్. లావణ్యా త్రిపాఠి హీరోయిన్. హ్యాకీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కే ఈ చిత్రంలో హాకీ ప్లేయర్‌గా స్క్రీన్‌పై ఫిట్‌గా కనిపించేందుకు సందీప్ 15 కేజీల బరువు తగ్గాలని టార్గెట్ పెట్టుకున్నారట. ప్రస్తుతానికి 12 కేజీల బరువు తగ్గారు. మిగతా 3 కిలోలు తగ్గే పనిలో ఉన్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ఆరంభం కానుంది. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, దయా పన్నెం, సందీప్ కిషన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహనిర్మాతగా ఉన్న ఈ సినిమాకు హిప్ హాప్ తమిళ సంగీతదర్శకుడు.
Comments
Please login to add a commentAdd a comment