సందీప్‌ కిషన్‌ చిత్రంలో విజయ్‌ సేతుపతి, గౌతమ్‌ మీనన్‌ | Vijay Sethupathi In Sundeep Kishan Michael Movie And Gautham Vasudev Menon A Villain | Sakshi
Sakshi News home page

సందీప్‌ కిషన్‌ చిత్రంలో విజయ్‌ సేతుపతి, గౌతమ్‌ మీనన్‌

Published Tue, Nov 23 2021 8:40 AM | Last Updated on Tue, Nov 23 2021 8:46 AM

Vijay Sethupathi In Sundeep Kishan Michael Movie And Gautham Vasudev Menon A Villain - Sakshi

యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ తాజా చిత్రం మైకేల్‌. ఈ మూవీలో విజయ్‌ సేతుపతి ముఖ్య పాత్రలో నటించనున్నారు. మరో ప్రత్యేకత ఏంటంటే ఇందులో ప్రతినాయకుడిగా దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ నటిస్తున్నారు. ఈ  మల్టీస్టారర్‌ చిత్రాన్ని నారాయణ దాస్‌ కె నరంగ్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌బి, కరన్‌.సీ ప్రొడక్షన్స్‌ ఎల్‌ఎల్‌బి సంస్థల అధినేతలు భరత్‌ చౌదరి, పుష్కర్‌ రామ్మోహన్‌ రావు నిర్మిస్తున్నారు.

చదవండి: పునీత్‌ స్టైల్లో ‘నాటు నాటు’ సాంగ్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ టీం ఫిదా

తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ తదితర భాషలో పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రానికి రంజిత్‌ జయకొడి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు వెల్లడించారు. సోమవారం చిత్ర పోస్టర్‌ను విడుదల చేయగా మంచి ఆదరణ వచ్చిందన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement