
సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ ప్రధాన పాత్రధారులుగా జయకిశోర్ బండి దర్శకత్వంలో రాజేష్, సృజన్ నిర్మించిన చిత్రం ‘మధుర వైన్స్’. ఈ సినిమా అక్టోబరు 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో అతిథిగా యంగ్ హీరో సందీప్ కిషన్ హాజరయ్యాడు.
సందీప్ మాట్లాడుతూ – ‘‘హీరోగా నాకు లైఫ్ ఇచ్చింది షార్ట్‌ఫిల్మ్స్ తీసిన దర్శకులే. ఈ సినిమా వారు కూడా షార్ట్ ఫిల్మ్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వస్తున్నవారే. వారి మాటలు వింటుంటే ఈ సినిమా హిట్ అవుతుందనే నమ్మకం కలుగుతోంది’’ అన్నారు. ‘‘షార్ట్ ఫిలింసే తీస్తున్నానని కొందరు నన్ను నిరుత్సాహపరిస్తే నా తల్లిదండ్రులు ప్రోత్సహించారు. నేను హీరోగా పరిచయమవుతున్న తొలి సినిమా ఇది’’ అన్నారు సన్నీ. ‘‘మా సినిమా రిలీజ్ వెనక చాలా కారణాలు ఉన్నాయి. వాటితో ఓ వెబ్‌సిరీస్ తీయొచ్చు’’ అన్నారు జయకిశోర్.
Comments
Please login to add a commentAdd a comment