ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఓటీటీ ట్రెండ్ నడుస్తోంది. సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు థియేటర్లలో సందడి చేయగా.. ఆ తర్వాత చిన్న సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. ఇక ఫిబ్రవరి మొదటి వారంలోనే పలు సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ వారం సినీ ప్రేక్షకులకు కనువిందు చేయనున్న సినిమాలపై ఓ లుక్కేద్దాం. థియేటర్లతో పాటు ఓటీటీలో రిలీజ్‌కు సిద్ధమైన సినిమాలేవో ఓసారి చూసేద్దాం.
సందీప్ కిషన్- మైఖేల్
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం మైఖేల్. రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా నటించింది. విజయ్ సేతుపతి ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఫిబ్రవరి3న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సుహాస్- రైటర్ పద్మభూషణ్
కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రైటర్ పద్మభూషణ్. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో టీనా శిల్పరాజ్ హీరోయిన్‌గా నటిస్తుంది.చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా పోస్టర్లు, టీజర్ ఇప్పటికే పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేస్తున్నాయి. ఫిబ్రవరి 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
జయప్రద- సువర్ణ సుందరి
సీనియర్ నటి జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘సువర్ణసుందరి’. సురేంద్ర మాదారపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ చిత్రాన్ని ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించారు. డాక్టర్ ఎమ్‌వీకే రెడ్డి సమర్పణలో ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై తెరకెక్కించారు. కరోనా ప్రభావంతో వాయిదా పడిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 3న భారీ స్థాయిలో విడుదల కానుంది.
ప్రేమదేశం
త్రిగుణ్, మేఘా ఆకాష్ జంటగా నటించిన చిత్రం ‘ప్రేమదేశం’. శ్రీకాంత్ సిద్ధమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మధుబాల ప్రత్యేక పాత్రలో నటించారు. శిరీష సిద్ధమ్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 3న రిలీజ్ కానుంది.
బుట్టబొమ్మ
చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో అవార్డులు అందుకున్న అనిఖా సురేంద్రన్ తెలుగులో హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం బుట్టబొమ్మ. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్.. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అర్జున్ దాస్, సూర్య వశిష్ట ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 4న థియేటర్లలో సందడి చేయనుంది.
ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు
నెట్‌ఫ్లిక్స్
- పమీలా (హాలీవుడ్) జనవరి 31
- గంతర్స్ మిలియన్స్ (వెబ్‌సిరీస్) ఫిబ్రవరి 1
- క్లాస్ (వెబ్‌సిరీస్- సీజన్-1) ఫిబ్రవరి 3
- ట్రూ స్పిరిట్ ఫిబ్రవరి 3
- ఇన్‌ఫయీస్టో (హాలీవుడ్) ఫిబ్రవరి 3
- స్ట్రామ్ బాయిల్ ఫిబ్రవరి 3
- వైకింగ్ ఊల్ఫ్ ఫిబ్రవరి 3
డిస్నీ+హాట్‌స్టార్
- బ్లాక్ పాంథర్ వాఖండా ఫరెవర్ (హాలీవుడ్) ఫిబ్రవరి 1
- సెంబి (తమిళ్) ఫిబ్రవరి 3
ఆహా
- అన్‌స్టాపబుల్ సీజన్-2 విత్ ఎన్‌బీకే- ఫిబ్రవరి 3
- ముఖచిత్రం(తెలుగు)- ఫిబ్రవరి 3
- కపుల్ ఆన్ బ్యాక్‌ట్రాక్( కొరియన్ మూవీ ఇన్ తెలుగు)- ఫిబ్రవరి 4
- కామెడీ స్టాక్ ఎక్సేంజ్- ఫినాలే ఎపిసోడ్- ఫిబ్రవరి 4
సోనీలివ్
- జహనాబాద్ ఆఫ్ లవ్ అండ్ వార్ (హిందీ) ఫిబ్రవరి 3
Comments
Please login to add a commentAdd a comment