'గల్లీరౌడీ'గా హీరో సందీప్‌ కిషన్‌.. | Sundeep Kishans Gully Rowdy Movie Theatrical Release On August | Sakshi
Sakshi News home page

రౌడీ రెడీ సెన్సార్‌ పూర్తి.. త్వరలోనే రిలీజ్‌

Published Tue, Jul 27 2021 9:43 AM | Last Updated on Tue, Jul 27 2021 9:57 AM

Sundeep Kishans Gully Rowdy Movie Theatrical Release On August - Sakshi

‘గల్లీ రౌడీ’ ఆగస్ట్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. సందీప్‌ కిషన్‌ టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రం ‘గల్లీరౌడీ’. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించారు. నేహా శెట్టి హీరోయిన్‌. కోన వెంకట్‌ సమర్పణలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మించారు. ఈ సినిమా సెన్సార్‌ పూర్తయింది. ఆగస్ట్‌లో సినిమాను విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. ‘‘హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘గల్లీ రౌడీ’. టీజర్‌కి మంచి ప్రశంసలు వచ్చాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సహ నిర్మాత: జి.వి, సంగీతం: చౌరస్తా రామ్, సాయికార్తీక్‌. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement