ఆయనెవరో ఊహించండి! | Sundeep Kishan unveils pre-look poster of Vivaha Bhojanambu | Sakshi
Sakshi News home page

ఆయనెవరో ఊహించండి!

Published Tue, Aug 18 2020 1:50 AM | Last Updated on Tue, Aug 18 2020 1:50 AM

Sundeep Kishan unveils pre-look poster of Vivaha Bhojanambu - Sakshi

నటుడిగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న సందీప్‌ కిషన్‌  నిర్మాతగానూ అభిరుచి గల సినిమాలు నిర్మిస్తున్నారు. వెంకటాద్రి టాకీస్‌ నిర్మాణ సంస్థను స్థాపించి తొలి ప్రయత్నంగా ‘నిను వీడని నీడను నేనే’ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం హీరోగా నటిస్తున్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’లో నిర్మాణ భాగస్వామిగానూ ఉన్నారు సందీప్‌. తాజాగా ‘వివాహ భోజనంబు’ అనే సినిమా నిర్మించనున్నట్లు ప్రకటించారాయన. ఈ చిత్రానికి రామ్‌ అబ్బరాజు దర్శకుడు.

ఆనంది ఆర్ట్స్‌ క్రియేష¯Œ ్స పతాకంపై నిర్మాత పి. కిరణ్‌ సమర్పణలో వెంకటాద్రి టాకీస్, సోల్జర్స్‌ ఫ్యాక్టరీ పతాకాలపై సందీప్‌ కిషన్‌ , శినీష్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘ఓ ప్రముఖ సహాయ నటుడు ఈ చిత్రంలో లీడ్‌ రోల్‌ చేయబోతున్నారు. ఆయనెవరో ఊహించండి?’’ అంటూ ఈ సినిమా ప్రీ–లుక్‌ని సోమవారం విడుదల చేశారు. త్వరలో ఫస్ట్‌ లుక్‌తో పాటు హీరో, హీరోయిన్‌ , ఇతర నటీనటుల వివరాలను వెల్లడించనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: మణికందన్‌ , ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలు: శివా చెర్రీ, సీతారామ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement