Vivaha bhojanambu
-
వివాహ భోజనంబు మూవీ టీం ఇంటర్వ్యూ
-
నటుడిగా 12ఏళ్లుగా కష్టపడుతున్నా: సందీప్ కిషన్
‘‘కొన్ని సినిమాలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదలవుతున్నాయి. దానివల్ల డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ఇబ్బంది పడుతున్నారు. నిర్మాతగా అర్థం చేసుకోగలను. కానీ ‘వివాహ భోజనంబు’ను లాక్డౌన్ టైమ్‌లోనే ఓటీటీలో విడుదల చేయడానికి ఒప్పందాలు పూర్తయ్యాయి. అయితే నేను హీరోగా నటించిన ‘గల్లీ రౌడీ’ సినిమా మాత్రం థియేటర్స్‌లోనే వస్తుంది’’ అన్నారు సందీప్ కిషన్. సత్య, ఆర్జావీ రాజ్ జంటగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రామ్ ఆనంది ఆర్ట్స్, సోల్జర్స్ ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్ సమర్పణలో కేఎస్ శినీష్, సందీప్ కిషన్ నిర్మించిన ‘వివాహ భోజనంబు’ సినిమా ఈ నెల 27 నుంచి సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ – ‘‘కోవిడ్ టైమ్‌లో పెళ్లి చేసుకున్న ఓ పిసినారి యువకుడి ఇంట్లో అతని బంధువులు 16 మంది లాక్డౌన్ వల్ల ఉండిపోవాల్సి వస్తుంది. వారిని పోషించేందుకు ఆ పిసినారి యువకుడు ఎలాంటి పనులు చేశాడనే అంశాలను ఆసక్తికరంగా తెరకెక్కించాడు దర్శకుడు. ఈ చిత్రంలో నేను అంబులెన్స్ డ్రైవర్ పాత్ర చేశాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘నటుడిగా 12 ఏళ్లుగా కష్టపడుతున్నాను. ఆ కష్టానికి తగ్గ ఫలితం ఇప్పుడు వస్తోంది. మంచి ప్రాజెక్ట్స్ కుదురుతున్నాయి. ‘ది ఫ్యామిలీమ్యాన్ 3’ సిరీస్‌లో, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్‌లో ఓ సినిమా, మరో మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి’’ అన్నారు. చదవండి: 'కథ చెప్పడానికి ఫోన్ చేస్తే..మేనేజర్లకు చెప్పమన్నారు' మహేశ్ బాబు బ్యాక్ టూ హైదరాబాద్ -
బ్యాక్ టు వర్క్
కరోనా వల్ల ఇండస్ట్రీలో ఆరు నెలలుగా పని మొత్తం స్తంభించిపోయింది. మెల్లిగా చిత్రీకరణలు ప్రారంభం అవుతున్నాయి. నేటి నుంచి నటుడు, నిర్మాత సందీప్ కిషన్ కూడా పని ప్రారంభించనున్నారు. ప్రస్తుతం హీరోగా నటిస్తున్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ చిత్రీకరణలో పాల్గొననున్నారు. ఇందులో సందీప్ కిషన్ హాకీ క్రీడాకారుడిగా నటించనున్నారు. అలాగే ఆయన నిర్మిస్తున్న ‘వివాహ భోజనంబు’ చిత్రం షూటింగ్ కూడా ప్రారంభం అవుతోంది. ఈ చిత్రం ముహూర్తం నిన్న హైదరాబాద్‌లో జరిగింది. ప్రభుత్వం చెప్పిన గైడ్‌లైన్స్ అన్నీ పాటిస్తూ ఈ సినిమాల చిత్రీకరణలను జరపనున్నారు. -
ఆయనెవరో ఊహించండి!
నటుడిగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న సందీప్ కిషన్ నిర్మాతగానూ అభిరుచి గల సినిమాలు నిర్మిస్తున్నారు. వెంకటాద్రి టాకీస్ నిర్మాణ సంస్థను స్థాపించి తొలి ప్రయత్నంగా ‘నిను వీడని నీడను నేనే’ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం హీరోగా నటిస్తున్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’లో నిర్మాణ భాగస్వామిగానూ ఉన్నారు సందీప్. తాజాగా ‘వివాహ భోజనంబు’ అనే సినిమా నిర్మించనున్నట్లు ప్రకటించారాయన. ఈ చిత్రానికి రామ్ అబ్బరాజు దర్శకుడు. ఆనంది ఆర్ట్స్ క్రియేష¯Œ ్స పతాకంపై నిర్మాత పి. కిరణ్ సమర్పణలో వెంకటాద్రి టాకీస్, సోల్జర్స్ ఫ్యాక్టరీ పతాకాలపై సందీప్ కిషన్ , శినీష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘ఓ ప్రముఖ సహాయ నటుడు ఈ చిత్రంలో లీడ్ రోల్ చేయబోతున్నారు. ఆయనెవరో ఊహించండి?’’ అంటూ ఈ సినిమా ప్రీ–లుక్‌ని సోమవారం విడుదల చేశారు. త్వరలో ఫస్ట్ లుక్‌తో పాటు హీరో, హీరోయిన్ , ఇతర నటీనటుల వివరాలను వెల్లడించనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: మణికందన్ , ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: శివా చెర్రీ, సీతారామ్. -
సందీప్ ప్లాన్ సూపర్
యంగ్ హీరోలు నటనతో పాటు బిజినెస్ రంగం మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోలు అందరూ ఏదో ఒక బిజినెస్‌లో అడుగుపెడుతున్నారు. అదే బాటలో యువ కథానాయకుడు సందీప్ కిషన్ కూడా రెస్టారెంట్ బిజినెస్‌ను స్టార్ట్ చేశాడు. హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లో వివాహభోజనంబు పేరుతో ఓ కాస్ట్లీ రెస్టారెంట్‌ను స్టార్ట్ చేశాడు. టాలీవుడ్లో మంచి కాంటాక్ట్స్ ఉన్న సందీప్ కిషన్, రెస్టారెంట్ ఓపెనింగ్‌కు మాత్రం ఒక్క రెజీనానే హాజరు కావటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే సందీప్ ప్లానింగ్ మాత్రం మరోలా ఉంది. ఒక్క రోజే అందరూ సెలబ్రిటీలను ఆహ్వానించకుండా రోజుకో స్టార్‌కు ఆతిథ్యమిస్తూ తన రెస్టారెంట్ ఎప్పుడూ వార్తల్లో ఉండేలా చూసుకుంటున్నాడు. ఓపెనింగ్ రోజు రెజీనా సందడి చేయగా ఆ తరువాత నితిన్, రకుల్ ప్రీత్ సింగ్‌లు సందీప్ ఆతిథ్యం స్వీకరించారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబ సభ్యులు కూడా వివాహభోజనంబులో భోజనం చేశారు. అంతేకాదు మహేష్ భార్య నమ్రత, అక్క మంజులలు సందీప్‌తో కలిసి ఫోటోకు ఫోజ్ ఇచ్చి ప్రమోషన్‌కు తమ వంతు సాయం చేశారు.