సందీప్ ప్లాన్ సూపర్
యంగ్ హీరోలు నటనతో పాటు బిజినెస్ రంగం మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోలు అందరూ ఏదో ఒక బిజినెస్లో అడుగుపెడుతున్నారు. అదే బాటలో యువ కథానాయకుడు సందీప్ కిషన్ కూడా రెస్టారెంట్ బిజినెస్ను స్టార్ట్ చేశాడు. హైదరాబాద్, జూబ్లీహిల్స్లో వివాహభోజనంబు పేరుతో ఓ కాస్ట్లీ రెస్టారెంట్ను స్టార్ట్ చేశాడు.
టాలీవుడ్లో మంచి కాంటాక్ట్స్ ఉన్న సందీప్ కిషన్, రెస్టారెంట్ ఓపెనింగ్కు మాత్రం ఒక్క రెజీనానే హాజరు కావటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే సందీప్ ప్లానింగ్ మాత్రం మరోలా ఉంది. ఒక్క రోజే అందరూ సెలబ్రిటీలను ఆహ్వానించకుండా రోజుకో స్టార్కు ఆతిథ్యమిస్తూ తన రెస్టారెంట్ ఎప్పుడూ వార్తల్లో ఉండేలా చూసుకుంటున్నాడు.
ఓపెనింగ్ రోజు రెజీనా సందడి చేయగా ఆ తరువాత నితిన్, రకుల్ ప్రీత్ సింగ్లు సందీప్ ఆతిథ్యం స్వీకరించారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబ సభ్యులు కూడా వివాహభోజనంబులో భోజనం చేశారు. అంతేకాదు మహేష్ భార్య నమ్రత, అక్క మంజులలు సందీప్తో కలిసి ఫోటోకు ఫోజ్ ఇచ్చి ప్రమోషన్కు తమ వంతు సాయం చేశారు.