మంచి సినిమాలకు ఎప్పుడూ ఆదరణే | Reception is always good movies : Sandeep Kishan | Sakshi
Sakshi News home page

మంచి సినిమాలకు ఎప్పుడూ ఆదరణే

Published Wed, Jul 9 2014 12:16 AM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM

మంచి సినిమాలకు ఎప్పుడూ ఆదరణే - Sakshi

మంచి సినిమాలకు ఎప్పుడూ ఆదరణే

 తిరుపతి కల్చరల్: యువతతో పాటు కుటుంబ సమేతంగా చూడదగ్గ మంచి కథా చిత్రాలకు ప్రజాదరణ ఎప్పుడూ ఉంటుందని ‘రారా కృష్ణయ్య’ హీరో సందీప్ కిషన్, డెరైక్టర్ మహేష్‌బాబు తెలిపారు. రారా కృష్ణయ్య చిత్రం విజయవంతమైన నేపథ్యంలో ఆ చిత్రం యూనిట్ విజయయోత్సవ ర్యాలీ చేపట్టింది. ఇందులో భాగంగా మంగళవారం తిరుపతికి విచ్చేసింది. ఈ సందర్భంగా భూమా సినీ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ తిరుమల వేంకటేశ్వరస్వామి అంటే భక్తి అని ఆయన పేరుతో వచ్చిన తన మొదటి చిత్రం వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ప్రజాదరణ పొందిందన్నారు. తన రెండో చిత్రం రారా కృష్ణయ్య విడుదలై నేడు రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శించబడుతోందన్నారు. రారా కృష్ణయ్యను ఆదరిస్తున్న అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement