ra ra krishnayya
-
ప్రేమ, యాక్షన్లతో పక్కా కమర్షియల్..
నటుడు సందీప్ కిషన్, రెజీనా జంటగా నటించిన తెలుగు చిత్రం రారా కృష్ణయ్య ఇప్పుడు తమిళంలో రానుంది. మానగరం చిత్రంతో హిట్ జంటగా గుర్తింపు పొందిన సందీప్‌కిషన్, రెజీనా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి తమిళంలో మహేంద్ర అనే టైటిల్‌ను నిర్ణయించారు. జగపతిబాబు, తణికెళ్ల భరణి, కావేరి, రవిబాబు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రానికి మహేశ్‌బాబు దర్శకుడు. సాయిరామ్ ఛాయాగ్రహణం, అనురాజామణి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని తమిళంలోకి హైమావతి జాంబమూర్తి సమర్పణలో వీవీఎస్.క్రియేషన్స్ పతాకంపై ఎన్.రాయ్రామ్ అనువదిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్.రాజేశ్, రాజశ్రీ, మణికంఠన్, ఎస్.రాయ్రామ్లు సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ.. ఒక దుష్ట కుటుంబంలో పుట్టిన యువకుడు చిన్నతనం నుంచి మంచివాడిగా పెరుగుతాడని అన్నారు. తమ బాటలోకి తీసుకురావడానికి ఆ కుటుంబం ప్రయత్నిస్తోంది. వారిని మంచి మార్గంలో పయనింపజేయడానికి ఆ యువకుడు ప్రయత్నాం చేస్తాడని తెలిపారు. వారిలో ఎవరి ప్రయత్నం ఫలించింది ? అన్న ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం మహేంద్ర అని తెలిపారు. ప్రేమ, యాక్షన్ సన్నివేశాలతో పక్కా కమర్షియల్ అంశాలతో జనరంజకంగా సినిమా ఉంటుందని చెప్పారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. -
మంచి సినిమాలకు ఎప్పుడూ ఆదరణే
తిరుపతి కల్చరల్: యువతతో పాటు కుటుంబ సమేతంగా చూడదగ్గ మంచి కథా చిత్రాలకు ప్రజాదరణ ఎప్పుడూ ఉంటుందని ‘రారా కృష్ణయ్య’ హీరో సందీప్ కిషన్, డెరైక్టర్ మహేష్‌బాబు తెలిపారు. రారా కృష్ణయ్య చిత్రం విజయవంతమైన నేపథ్యంలో ఆ చిత్రం యూనిట్ విజయయోత్సవ ర్యాలీ చేపట్టింది. ఇందులో భాగంగా మంగళవారం తిరుపతికి విచ్చేసింది. ఈ సందర్భంగా భూమా సినీ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ తిరుమల వేంకటేశ్వరస్వామి అంటే భక్తి అని ఆయన పేరుతో వచ్చిన తన మొదటి చిత్రం వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ప్రజాదరణ పొందిందన్నారు. తన రెండో చిత్రం రారా కృష్ణయ్య విడుదలై నేడు రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శించబడుతోందన్నారు. రారా కృష్ణయ్యను ఆదరిస్తున్న అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
ఆ చిత్రమే దీనికి స్ఫూర్తి
‘‘చిన్నప్పట్నుంచీ నాకు సినిమాలంటే ఇష్టం. కానీ, పెద్దయిన తర్వాత ఏం చేయాలనే విషయం మీద మాత్రం ఓ స్పష్టమైన అవగాహన ఉండేది కాదు. ఓ శుభముహూర్తాన సినిమా డెరైక్టర్ కావాలని నిర్ణయించుకున్నా’’ అని పి. మహేశ్‌బాబు చెప్పారు. జగపతిబాబు ముఖ్య పాత్రలో సందీప్ కిషన్, రెజీనా జంటగా రూపొందిన ‘రా రా కృష్ణయ్య’ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమయ్యారాయన. మహేశ్ పుట్టింది భీమవరంలో.. చదువుకున్నది వైజాగ్‌లో. బీటెక్ పూర్తి చేయగానే ఓ మూడు లఘు చిత్రాలు రూపొందించారు. అవన్నీ సామాజిక స్పృహ ఉన్నవే. ఇక, దర్శకునిగా అనుభవం సంపాదించడం కోసం కృష్ణవంశీ దగ్గర అసోసియేట్‌గా చేరారు. కృష్ణవంశీ దగ్గర కొంత అనుభవం సంపాదించుకున్న తర్వాత దర్శకునిగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ‘రా రా కృష్ణయ్య’ సినిమాకి అవకాశం అడిగే ముందు, ఐదు నిమిషాల కథను చిత్రీకరించారట. ‘‘ఆ సీడీని పలువురు నిర్మాతలకు చూపించాను. కానీ, నిర్మాత వంశీకృష్ణగారు చూసిన వెంటనే ఒప్పుకున్నారు. ఈ సంస్థలో వచ్చిన ‘సోలో’కి దర్శకత్వ శాఖలో చేశాను. సందీప్‌తో మంచి అనుబంధం ఉంది. ఇక, వంద సినిమాలు చేసిన జగపతిబాబుతో సినిమా చేయడం నా అదృష్టం’’ అన్నారు. ‘తేరే నాల్ లవ్ హో గయా’, ‘చెన్నయ్ ఎక్స్‌ప్రెస్’ చిత్రాల తరహాలో ‘రా రా కృష్ణయ్య’ ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారనీ, కానీ, తాను మాత్రం కొన్నేళ్ల క్రితం ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేం డానీ బోయిలే దర్శకత్వం వహించిన ‘ఏ లైఫ్‌లెస్ ఆర్డినరీ’ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమా చేశానని మహేశ్ చెప్పారు. సినిమాకి పాజిటివ్ టాక్ రావడం ఆనందంగా ఉందన్నారు. సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం కాకపోయినా, పరిశ్రమలో తనకు పరిచయమైన అందరూ ప్రోత్సహిస్తున్నారని, అది తన లక్ అని అన్నారు మహేశ్. -
రారా కృష్ణయ్య మూవీ న్యూ పోస్టర్స్
-
ప్రేమజంట మధురానుభూతులు
ప్రేమ ప్రయాణంలో ఓ జంట పొందిన మధురానుభూతులే ప్రధాన ఇతివృత్తంగా రూపొందిన చిత్రం ‘రారా కృష్ణయ్య’. సందీప్‌కిషన్, రెజీనా జంటగా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్ర పోషించారు. మహేశ్‌బాబు.పి దర్శకుడు. వంశీకృష్ణ శ్రీనివాస్ నిర్మాత. ఈ నెల 4న విడుదల కానున్న ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ -‘‘నవ్యమైన కథాంశంతో రూపొందిన పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ తర హాలో సందీప్ కిషన్ కెరీర్లో నిలిచిపోయే సినిమా అవుతుంది. సందీప్ అన్నయ్య పాత్రను జగపతిబాబు పోషించారు. ఆయన పాత్ర ఈ సినిమాకే హైలైట్. అచ్చు స్వరాలందించిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభిస్తోంది’’ అని చెప్పారు. ఈ అందమైన ప్రేమకథలోని కుటుంబ భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని దర్శకుడు చెప్పారు. కల్యాణి, తనికెళ్ల భరణి, చలపతిరావు, రవిబాబు, బ్రహ్మాజీ, సత్యం రాజేశ్, తాగుబోతు రమేశ్ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: శ్రీరామ్, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేశ్. -
మలుపులు తిరిగిన ప్రణయం
ఆ జంట ప్రేమ ప్రయాణం ఆహ్లాదకరంగా సాగుతుంటుంది. ఆ ప్రయాణం అలానే సాగితే ఇద్దరూ పెళ్లి పీటల మీద కూర్చునేవారు. కానీ, అనుకోకుండా ఆ ప్రేమకథ ఓ మలుపు తీసుకుంటుంది? ఆ మలుపు ఎలాంటిది? ఆ ప్రేమికులు.. దంపతులు కావడానికి ఏం చేశారు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘రారా కృష్ణయ్య’. సందీప్ కిషన్, రెజీనా జంటగా యస్వీకే సినిమా పతాకంపై వంశీకృష్ణ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జగపతిబాబు కీలక పాత్ర చేస్తున్న ఈ చిత్రం ద్వారా మహేశ్‌బాబు. పి దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘అచ్చు స్వరపరచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ‘లెజెండ్’ తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చే పాత్రను జగపతిబాబు చేశారు. ఓ సరికొత్త కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. ప్రేమ, వినోదం మేళవించిన కథ ఇది. వాణిజ్య అంశాలు మెండుగా ఉన్న చిత్రం కావడంతో ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. -
'రారా కృష్ణయ్య' న్యూ స్టిల్స్
-
మధురానుభూతుల సమ్మేళనం...
సందీప్ కిషన్, రెజీనా జంటగా రూపొందిన చిత్రం ‘రారా కృష్ణయ్య’. వంశీకృష్ణ శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం ద్వారా మహేశ్‌బాబు.పి దర్శకునిగా పరిచయమవుతున్నారు. జగపతిబాబు ఇందులో ప్రత్యేక పాత్రధారి. ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ -‘‘కొత్తదనం కూడిన కథ, కథనాలతో ఈ చిత్రం రూపొందింది. సందీప్, రెజీనా జోడీ యువతరం మెచ్చేలా ఉంటుంది. ‘లెజెండ్’ తర్వాత మళ్లీ ఆ స్థాయి పాత్రను ఇందులో జగపతిబాబు పోషించారు. అచ్చు స్వరాలందించిన పాటలను ఇటీవలే విడుదల చేశాం. మంచి స్పందన లభిస్తోంది. ఈ నెలలోనే సినిమా విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ప్రేమలో ఓ జంట పొందిన మధురానుభూతుల సమ్మేళనమే ఈ సినిమా అని, ప్రతి సన్నివేశం హృదయాలకు హత్తుకునేలా ఉంటుందని దర్శకుడు చెప్పారు. కల్యాణి, తనికెళ్ల భరణి, రవిబాబు, బ్రహ్మాజీ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: శ్రీరామ్, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేశ్. -
నాకు ఆ అమ్మాయి గుర్తొచ్చింది!
‘‘చదువుకునే రోజుల్లో నేనొక అమ్మాయిని ప్రేమించాను. అయితే... నేను చేసిన ఓ చిన్న తప్పు వల్ల మేమిద్దరం విడిపోయాం. ఈ సినిమా చేస్తున్నప్పుడు మళ్లీ నాకు ఆ అమ్మాయి గుర్తొచ్చింది. ఈ సినిమా చూసే ప్రేక్షకులకు కూడా అలాంటి అనుభూతే కలుగుతుంది’’ అని హీరో సందీప్ కిషన్ అన్నారు. నూతన దర్శకుడు మహేశ్ బాబు. పి దర్శకత్వంలో సందీప్ కిషన్, రెజీనా జంటగా రూపొందుతోన్న చిత్రం ‘రారా కృష్ణయ్య’. వంశీకృష్ణ శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు ఓ ముఖ్య భూమిక పోషిస్తున్నారు. అచ్చు స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా సందీప్ మరికొన్ని విషయాలు చెబుతూ -‘‘వినోదంతో కూడిన ప్రేమకథ ఇది. నిర్మాత రాజీ పడకుండా సినిమాకు ఖర్చు పెట్టారు. దర్శకుడు తను అనుకున్నట్లు సినిమాను తీర్చిదిద్దారు. జగపతిబాబుగారితో పనిచేస్తుంటే ఎంతో సాధించిన అనుభూతి కలుగుతోంది’’ అన్నారు. ‘‘హీరోకు ఉండాల్సిన అన్ని అర్హతలూ ఉన్న వ్యక్తి సందీప్‌కిషన్. అలాగే రెజీనా వృత్తి పట్ల నిబద్ధత ఉన్న నటి. నటన పట్ల వీరిద్దరి తపన నాకు బాగా నచ్చింది. దర్శకుడు ఈ చిత్రాన్ని బాగా మలిచాడు’’ అని జగపతిబాబు వ్యాఖ్యానించారు. ‘‘సందీప్కిషన్కీ, దర్శకుడు మహేశ్‌కీ స్టార్డమ్ తెచ్చిపెట్టే సినిమా ఇది. ఈ నెలలో సినిమాను విడుదల చేస్తాం’’ అని నిర్మాత చెప్పారు. ఓ జంట ప్రేమ ప్రయాణంలో వారు పొందిన మధురానుభూతులే ఈ చిత్ర ప్రధానాంశమని దర్శకుడు చెప్పారు. ఆడియో సీడీని హరీశ్‌శంకర్ ఆవిష్కరించి మంచు లక్ష్మికి అందించారు. అల్లరి నరేశ్, ఆది కలిసి ప్రచార చిత్రాలను విడుదల చేశారు. -
రారా..కృష్ణయ్య ట్రయలర్
-
ప్రేమ ప్రయాణం
సందీప్, రెజీనా జంటగా జగపతిబాబు కీలక పాత్రలో యస్వీకే సినిమా పతాకంపై వంశీకృష్ణ శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం ‘రారా కృష్ణయ్య’. మహేష్‌బాబు .పి దర్శకుడు. బుధవారం జగపతిబాబు పుట్టినరోజు సందర్భంగా పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘సందీప్ అన్నయ్యగా జగపతిబాబు చేస్తున్న పాత్ర సినిమాకి ప్రధాన అకర్షణ అవుతుంది. పాటలు, క్లయిమాక్స్ మినహా పూర్తయ్యాయి. అచ్చు స్వరపరచిన పాటలను ఈ నెలాఖరున, వచ్చే నెల సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. సందీప్ మాట్లాడుతూ -‘‘జగపతిబాబుగారి తమ్ముడిగా నటించడం నా అదృష్టం. కొత్త నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథా చిత్రం ఇది’’ అన్నారు. ‘‘ఓ యువతీ యువకుడి ప్రేమ ప్రయాణం, వారు పొందిన మధురానుభూతుల సమాహారమే ఈ సినిమా’’ అని దర్శకుడు తెలిపారు. ‘రొటీన్ లవ్‌స్టోరీ’ తర్వాత సందీప్‌తో నటించడం ఆనందంగా ఉందని రెజీనా చెప్పారు. -
అన్నదమ్ములుగా...
‘రొటీన్ లవ్‌స్టోరి’ జంట సందీప్‌కిషన్, రెజీనా కాంబినేషన్లో నూతన దర్శకుడు మహేష్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రారా కృష్ణయ్య’. వంశీకృష్ణ శ్రీనివాస్ నిర్మాత. సందీప్ కిషన్‌కి అన్నయ్యగా జగపతిబాబు ఇందులో కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ విజయంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. జగపతిబాబుది ఇందులో కీలకమైన పాత్ర. బాలకృష్ణ ‘లెజెండ్’లో ఆయన విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత జగపతిబాబు సైన్ చేసిన సినిమా ఇదే. ఆయన పాత్ర ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. నిరవధికంగా హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. మా సంస్థ ప్రతిష్టను పెంచే సినిమా అవుతుంది’’ అని చెప్పారు. జగపతిబాబు, సందీప్కిషన్ల మధ్య వచ్చే సన్నివేశాలు ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని దర్శకుడు చెప్పారు.