నాకు ఆ అమ్మాయి గుర్తొచ్చింది! | I remember that girl ! | Sakshi
Sakshi News home page

నాకు ఆ అమ్మాయి గుర్తొచ్చింది!

Published Sat, May 31 2014 11:02 PM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM

నాకు ఆ అమ్మాయి గుర్తొచ్చింది! - Sakshi

నాకు ఆ అమ్మాయి గుర్తొచ్చింది!

‘‘చదువుకునే రోజుల్లో నేనొక అమ్మాయిని ప్రేమించాను. అయితే... నేను చేసిన ఓ చిన్న తప్పు వల్ల మేమిద్దరం విడిపోయాం. ఈ సినిమా చేస్తున్నప్పుడు మళ్లీ నాకు ఆ అమ్మాయి గుర్తొచ్చింది. ఈ సినిమా చూసే ప్రేక్షకులకు కూడా అలాంటి అనుభూతే కలుగుతుంది’’ అని హీరో సందీప్ కిషన్ అన్నారు. నూతన దర్శకుడు మహేశ్ బాబు. పి దర్శకత్వంలో సందీప్ కిషన్, రెజీనా జంటగా రూపొందుతోన్న చిత్రం ‘రారా కృష్ణయ్య’. వంశీకృష్ణ శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు ఓ ముఖ్య భూమిక పోషిస్తున్నారు. అచ్చు స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా సందీప్ మరికొన్ని విషయాలు చెబుతూ -‘‘వినోదంతో కూడిన ప్రేమకథ ఇది. నిర్మాత రాజీ పడకుండా సినిమాకు ఖర్చు పెట్టారు.
 
 దర్శకుడు తను అనుకున్నట్లు సినిమాను తీర్చిదిద్దారు. జగపతిబాబుగారితో పనిచేస్తుంటే ఎంతో సాధించిన అనుభూతి కలుగుతోంది’’ అన్నారు. ‘‘హీరోకు ఉండాల్సిన అన్ని అర్హతలూ ఉన్న వ్యక్తి సందీప్‌కిషన్. అలాగే రెజీనా వృత్తి పట్ల నిబద్ధత ఉన్న నటి. నటన పట్ల వీరిద్దరి తపన నాకు బాగా నచ్చింది. దర్శకుడు ఈ చిత్రాన్ని బాగా మలిచాడు’’ అని జగపతిబాబు వ్యాఖ్యానించారు. ‘‘సందీప్‌కిషన్‌కీ, దర్శకుడు మహేశ్‌కీ స్టార్‌డమ్ తెచ్చిపెట్టే సినిమా ఇది. ఈ నెలలో సినిమాను విడుదల చేస్తాం’’ అని నిర్మాత చెప్పారు. ఓ జంట ప్రేమ ప్రయాణంలో వారు పొందిన మధురానుభూతులే ఈ చిత్ర ప్రధానాంశమని దర్శకుడు చెప్పారు. ఆడియో సీడీని హరీశ్‌శంకర్ ఆవిష్కరించి మంచు లక్ష్మికి అందించారు. అల్లరి నరేశ్, ఆది కలిసి ప్రచార చిత్రాలను విడుదల చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement