మధురానుభూతుల సమ్మేళనం... | Jagapathi Babu Special role ra ra krishnayya | Sakshi
Sakshi News home page

మధురానుభూతుల సమ్మేళనం...

Published Tue, Jun 10 2014 11:05 PM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM

మధురానుభూతుల   సమ్మేళనం... - Sakshi

మధురానుభూతుల సమ్మేళనం...

సందీప్ కిషన్, రెజీనా జంటగా రూపొందిన చిత్రం ‘రారా కృష్ణయ్య’. వంశీకృష్ణ శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం ద్వారా మహేశ్‌బాబు.పి దర్శకునిగా పరిచయమవుతున్నారు. జగపతిబాబు ఇందులో ప్రత్యేక పాత్రధారి. ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ -‘‘కొత్తదనం కూడిన కథ, కథనాలతో ఈ చిత్రం రూపొందింది. సందీప్, రెజీనా జోడీ యువతరం మెచ్చేలా ఉంటుంది. ‘లెజెండ్’ తర్వాత మళ్లీ ఆ స్థాయి పాత్రను ఇందులో జగపతిబాబు పోషించారు. అచ్చు స్వరాలందించిన పాటలను ఇటీవలే  విడుదల చేశాం. మంచి స్పందన లభిస్తోంది. ఈ నెలలోనే సినిమా విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ప్రేమలో ఓ జంట పొందిన మధురానుభూతుల సమ్మేళనమే ఈ సినిమా అని, ప్రతి సన్నివేశం హృదయాలకు హత్తుకునేలా ఉంటుందని దర్శకుడు చెప్పారు. కల్యాణి, తనికెళ్ల భరణి, రవిబాబు, బ్రహ్మాజీ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: శ్రీరామ్, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేశ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement