అన్నదమ్ములుగా...
‘రొటీన్ లవ్‌స్టోరి’ జంట సందీప్‌కిషన్, రెజీనా కాంబినేషన్లో నూతన దర్శకుడు మహేష్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రారా కృష్ణయ్య’. వంశీకృష్ణ శ్రీనివాస్ నిర్మాత. సందీప్ కిషన్‌కి అన్నయ్యగా జగపతిబాబు ఇందులో కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ విజయంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. జగపతిబాబుది ఇందులో కీలకమైన పాత్ర. బాలకృష్ణ ‘లెజెండ్’లో ఆయన విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత జగపతిబాబు సైన్ చేసిన సినిమా ఇదే. ఆయన పాత్ర ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. నిరవధికంగా హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. మా సంస్థ ప్రతిష్టను పెంచే సినిమా అవుతుంది’’ అని చెప్పారు. జగపతిబాబు, సందీప్‌కిషన్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని దర్శకుడు చెప్పారు.