
జాతీయ అవార్డు సాధించిన షో సినిమాతో నటిగా పరిచయం అయిన సూపర్ స్టార్ కృష్ణ వారసురాలు మంజుల తరువాత నిర్మాతగా కూడా తన మార్క్ చూపించారు. త్వరలో దర్శకురాలిగా ప్రేక్షకులను ముందుకు వచ్చేందకు రెడీ అవుతున్నారు. సందీప్ కిషన్, అమైరా దస్తర్ హీరో హీరోయిన్లుగా స్వీయ నిర్మాణంలో మనసుకు నచ్చింది సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.
ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ట్రైలర్ ను మంగళవారం సాయంత్ర సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే టీజర్, ప్రోమో సాంగ్స్ తో ఆకట్టుకున్న మనసుకునచ్చింది టీం, ఈ రోజు సాయంత్రం థియెట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేయనుంది. రధన్ సంగీతం అందించిన ఈ సినిమా రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న రిలీజ్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment