
సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ జంటగా వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. ఈ చిత్రం కోసం సంగీతదర్శకుడు శేఖర్ చంద్ర స్వరపరచగా, సిధ్ శ్రీరామ్‌పాడిన ‘నిజమే నే చెబుతున్నా..’పాట మార్చిలో విడుదలైంది. ‘‘ఈపాట లిరికల్ వీడియోకు శ్రోతల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. యూట్యూబ్‌లో ఈ పాట భారీ హిట్ సాధించింది. ఇప్పటికే సుమారు 30 మిలియన్ల వ్యూస్ క్రాస్ అయింది.
ఈపాట ఇప్పటికే 3 కోట్ల వ్యూస్ సాధించింది. ‘బాగుంటుంది నువ్వు నవ్వితే’, ‘ప్రియతమా ప్రియతమా, ‘మనసు దారి తప్పెనే’... వంటిపాటల తర్వాత సిధ్ శ్రీరామ్, నా కాంబినేషన్‌లో వచ్చిన ఈపాట హిట్ కావడం హ్యాపీగా ఉంది. సందీప్ కిషన్, వీఐ ఆనంద్, గీత రచయిత శ్రీమణిలకు థ్యాంక్స్’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment