సడన్‌గా ఓటీటీ మారిన హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | Dhanush-Nithya Menen 2022 Hit To Now Stream On Amazon Prime Video | Sakshi
Sakshi News home page

Thiruchitrambalam: ఏడాది తర్వాత మారిన ఓటీటీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Published Sat, Oct 7 2023 7:51 AM | Last Updated on Sat, Oct 7 2023 8:54 AM

Dhanush-Nithya Menen 2022 Hit To Now Stream On Amazon Prime Video - Sakshi

ధనుష్, నిత్యా మీనన్ జంటగా నటించన రొమాంటిక్ కామెడీ మూవీ 'తిరుచిత్రం బలం'( తెలుగులో తిరు). 2022లో విడుదలైన ఈ చిత్రం హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకి మిత్రన్ జవహర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రాశి ఖన్నా, ప్రియా భవానీ శంకర్ కూడా హీరోయిన్లుగా నటించారు. ప్రకాష్ రాజ్, భారతీరాజా కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి అనిరుధ్ రవిచందర్ సంగీతమందించగా.. గతేడాది ఆగస్ట్ 18న థియేటర్లలో విడుదలైంది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే సన్‌ నెక్ట్స్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తాజాగా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. 

(ఇది చదవండి: స్టార్ హీరో సినిమాలో ఏలియన్.. టీజర్ అదిరిపోయింది!)

సన్ నెక్ట్స్‌తో నిర్మాతలకు విభేదాలు

తిరుచిత్రంబలం మూవీ స్ట్రీమింగ్ హక్కులపై నిర్మాతలు, సన్‌ నెక్ట్స్‌ యాజమాన్యానికి అంతర్గతంగా విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో ఈ మూవీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో మార్చారు. అక్టోబర్ 6వ తేదీ నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల కోసం  తమిళం, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం  భాషలలో అందుబాటులో ఉంది. అయితే ఈ నిర్ణయంపై ధనుశ్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement