
సాక్షి, విశాఖపట్నం: టీటీడీ ఆధ్వర్యంలో విశాఖలో నిర్మిస్తున్న వెంకటేశ్వర స్వామి దేవాలయ పనులను టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ శుక్రవారం పరిశీలించారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. అంగరంగ వైభవంగా నిర్మించే వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణం త్వరలోనే పూర్తి అవుతుందని తెలిపారు. పది ఎకరాల స్థలంలో దేవాలయం నిర్మాణం జరుగుతోందని వివరించారు. ఆలయ నిర్మాణ పనులు పూర్తయిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. పరిపాలన రాజధాని కంటే ముందే ఆలయ నిర్మాణం చేయడం విశేషమన్నారు. గత ప్రభుత్వం వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి రూ. 17 కోట్లు మాత్రమే కేటాయించి, ఆలయ నిర్మాణంలో నిర్లక్ష్యం వహించిదన్నారు. కానీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆలయ నిర్మాణానికి రూ. 28 కోట్లు కేటాయించిదని పేర్కొన్నారు. త్వరలో విశాఖ ఆధ్యాత్మిక నగరంగా ప్రసిద్ధి చెందుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment