అనంతపురం: అనంతపురం జిల్లాలోని రాయదుర్గం వెంకటేశ్వరస్వామి రథోత్సవంలో బుధవారం అపశ్రుతి చోటుచేసుకుంది. రథోత్సవం జరుగుతున్న సమయంలో విద్యుత్ తీగలు అడ్డురావడంతో వాటిని తొలగించేందుకు ఓ వ్యక్తి విద్యుత్ స్తంభం ఎక్కాడు. ఈ నేపథ్యంలో స్తంభం పైనుంచి అతడు ప్రమాదవాశాత్తూ జారిపడ్డాడు. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.
అతన్ని వెంటనే బళ్లారి ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. విద్యుత్‌కు సంబంధించి మరమ్మతులు ప్రైవేట్ వ్యక్తితో చేయిస్తున్న ట్రాన్స్‌కో అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్వామివారి రథోత్సవంలో అపశ్రుతి
Published Wed, May 25 2016 5:28 PM | Last Updated on Mon, Sep 4 2017 12:55 AM
Advertisement
Advertisement