సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 28న తిరుమలకు వెళ్లనున్నారు. 27వ తేదీ శుక్రవారం రాత్రికి ఆయన తిరుమల చేరుకుని.. మరుసటి రోజు (శనివారం) ఉదయం స్వామివారిని దర్శించుకోనున్నారు.
మరోవైపు, తిరుమల పవిత్రతకు చంద్రబాబు భంగం కలిగించారని.. ఆయన చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ‘‘రాజకీయ దుర్భిద్ధితోనే చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారని.. కల్తీ జరగకుండానే జరిగిందని చెబుతున్నారంటూ ఎక్స్(ట్విటర్) వేదికగా వైఎస్ జగన్ నిలదీశారు. వైఎస్సార్‌సీపీ నేతలంతా పూజల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
స్వార్థ రాజకీయాల కోసం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి మహా ప్రసాదం లడ్డూపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యల వల్ల కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీశారు. ఈ వ్యవహారంలో నిజానిజాలు నిగ్గుతేల్చి.. టీటీడీ ఔన్నత్యాన్ని, భక్తుల విశ్వాసాలను పునరుద్ధరించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరుతూ వైఎస్ జగన్ లేఖ కూడా రాశారు.
ఇదీ చదవండి: శ్రీవారి లడ్డూపై పుట్టెడు అబద్ధాలు
Comments
Please login to add a commentAdd a comment