కల్యాణ వెంకన్నకు వెండి బిందెలు
తిరుపతి: కల్యాణ వెంకన్నకు 1100 గ్రాముల వెండితో తయారు చేసిన రెండు వెండి బిందెలను భక్తులు సమర్పించుకున్నారు. తిరుపతి గాయత్రి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ వెంకటేష్, లక్ష్మీ దంపతులు శనివారం కల్యాణ వెంకన్నను దర్శించుకొని రూ. 42 వేల విలువైన రెండు వెండి బిందెలను స్వామివారికి కానుకగా సమర్పించుకున్నారు.