
శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు ఉపేంద్ర
తిరుమల, న్యూస్‌లైన్: సినీ నటుడు ఉపేంద్ర శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో సతీమణి ప్రియాంకతో కలిసి తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.
గతంలో తాను హీరోగా నటించిన ‘ఉపేంద్ర’ చిత్రాన్ని ఆంధ్రా ప్రేక్షకులు ఎంతగానో ఆదరించి హిట్ చేశారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దీనికి సీక్వెల్‌గా ‘ఉపేంద్ర 2’ చిత్రాన్ని నిర్మిస్తున్నామన్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోందని, త్వరలోనే అభిమానుల ముందుకు వస్తుందన్నారు.
ప్రస్తుతం తాను హీరోగా నటించిన ‘స్విస్ బ్యాంక్‌కు దారేది’ చిత్రం విడుదలైందన్నారు. ఈ నేపథ్యంలో స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చినట్లు చెప్పారు. ఆలయం వెలుపల ఉపేంద్రను చూడటానికి అభిమానులు ఉత్సాహం చూపారు. ఆయనతో కలిసి ఫొటోలు, ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు.