![Venkateswara Swamy Kalyanotsavam In Malaysia - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/26/Venkateswara_Swamy_0.jpg.webp?itok=9MalvXeH)
సాక్షి హైదరాబాద్: మలేసియా లోని బాగాన్ డత్తోలో శ్రీ వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నెల 23నుంచి 25వ తేదీ వరకు కన్నుల పండువగా సంప్రోక్షణ, స్వామి వారి కళ్యాణ ఉత్సవం జరిగాయి.
మలేసియాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సుమారు 5000 మంది తెలుగు వారు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మలేసియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాలకు స్థానిక ఎమ్మెల్యే దత్తో ఖైరుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మలేసియా తెలుగు సంఘం గౌరవ సలహాదారు దత్తో డాక్టర్ అచ్చయ్యకుమార్ రావు, అధ్యక్షులు డాక్టర్ వెంకట ప్రతాప్, ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ సత్యసుధాకర్, వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు. మరిన్ని ఫొటోలకు ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment