శ్రీవారి ఆశీస్సులతోనే ‘మా’టీం గెలిచింది | MAA President Rajendra Prasad visit in tirupati | Sakshi
Sakshi News home page

శ్రీవారి ఆశీస్సులతోనే ‘మా’టీం గెలిచింది

Published Wed, May 13 2015 1:42 AM | Last Updated on Sun, Sep 3 2017 1:54 AM

శ్రీవారి ఆశీస్సులతోనే ‘మా’టీం గెలిచింది

శ్రీవారి ఆశీస్సులతోనే ‘మా’టీం గెలిచింది

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతోనే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో గెలిచామని ఆ సంఘం నూతన అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. మంగళవారం సహచర నటులు శివాజీరాజా, కాదంబరి కిరణ్, శ్రీరామ్, ఇతర సభ్యులతో కలసి ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మా ఎన్నికల్లో మార్పు కోసం నూతన కార్యవర్గానికి అధికారం కట్టబెట్టారని, కలసికట్టుగా పనిచేస్తూ వారి నమ్మకాన్ని నిలబెడుతామని చెప్పారు. టీటీడీ ధర్మకర్తల మండలిలో దర్శకుడు రాఘవేంద్రరావుకు అవకాశం లభించడం సంతోషదాయకమన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రాజేంద్రప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement