
కీర్తీ సురేష్, విశాల్
‘కత్తిని చూసి భయపడటానికి పొట్టేల్ని కాదురా.. పులివెందుల బిడ్డని’, ‘జాతరలో పులివేషాలు వేయొచ్చు..కానీ, పులిముందే వేషాలు వేయకూడదు’... ‘పందెంకోడి 2’ చిత్రంలోని ఇలాంటి డైలాగులు విశాల్ అభిమానుల్ని అలరిస్తున్నాయి. విశాల్, కీర్తీ సురేష్ జంటగా, వరలక్ష్మీ శరత్‌కుమార్, రాజ్‌కిరణ్ ముఖ్య పాత్రల్లో ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పందెంకోడి 2’. ‘ఠాగూర్’ మధు సమర్పణలో విశాల్, దవళ్ జయంతిలాల్ గడా, అక్షయ్ జయంతిలాల్ గడా నిర్మించిన ఈ సినిమా దసరా కానుకగా ఈనెల 18న విడుదలవుతోంది. ‘ఠాగూర్’ మధు మాట్లాడుతూ–‘‘ఇటీవల విడుదలైన ‘పందెంకోడి 2’ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. రేపు(ఆదివారం) హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహిస్తున్నాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment