Raj Kiran
-
రూ.కోటి అందుకున్న తొలి హీరో! మీరు అస్సలు ఊహించి ఉండరు!
కోలీవుడ్‌లో రజనీకాంత్, కమల్ హాసన్ టాప్ నటులుగా ఉన్న సమయంలో కూడా వారి కంటే ముందుగా ఒక సినిమాకు కోటి రూపాయలు రెమ్యునరేషన్ అందుకున్న టాప్ నటుడి గురించి తెలుసా..? తమిళ చిత్ర పరిశ్రమలో అగ్రనటులుగా ఉన్న విజయ్, అజిత్, రజనీ, కమల్.. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.100 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. గత 10 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలోని హీరో, హీరోయిన్ల రెమ్యునరేషన్ విపరీతంగా పెరిగింది. ఇప్పుడంటే సరే... సుమారు 20 ఏళ్ల క్రితం కోటి రెమ్యునరేషన్ తీసుకునే నటీనటులకే ఎక్కువ ఇమేజ్ అని ఉండేది. ఆ విధంగా తమిళ సినిమా చరిత్రలో తొలిసారిగా రూ.కోటి రెమ్యునరేషన్ అందుకున్న తొలి నటుడు 'మొహిదీన్ అబ్దుల్ ఖాదర్' ఆయన స్క్రీన్ నేమ్ రాజ్‌కిరణ్. కోలీవుడ్‌లో ఒక సినిమాకు కోటి రూపాయలు అందుకున్న తొలి నటుడిగా ఆయన రికార్డుకెక్కారు. రాజ్‌కిరణ్ 16 ఏళ్ల వయసులో చెన్నైకి వచ్చి దినసరి కూలీగా జీవనం సాగించాడు. అప్పుడు అతని జీతం కేవలం రూ. 5 మాత్రమే. అప్పుడు రాజ్‌కిరణ్ శ్రమ, అతని నిజాయితీకి ముగ్ధుడైన యజమాని గుమాస్తాగా పదోన్నతి కల్పించాడు. అప్పటి వరకు నెలకు రూ. 150 జీతం తీసుకుంటున్న రాజ్‌కిరణ్ ప్రమోషన్ తర్వాత రూ. 170 జీతం తీసుకున్నాడు. ఇదంతా 1988వ సంవత్సరంలో జరిగిన కథ. రాజ్‌కరణ్ సినిమాలపై ఆసక్తితో సొంతంగా డిస్ట్రిబ్యూషన్ కంపెనీని ప్రారంభించి, క్రమంగా సినిమా రంగంలో ఎదగడం ప్రారంభించాడు, ఆ తర్వాత అతను దర్శకత్వంతో పాటుగా పలు సినిమాల్లో నటించడం ప్రారంభించాడు. అతని సినిమాలు భారీ హిట్‌గా మారడంతో, హీరోగా నటించమని వివిధ నిర్మాణ సంస్థల నుంచి పిలుపు రావడం జరిగింది. అలాంటి సమయంలో ఒక నిర్మాణ సంస్థ నుంచి రూ. కోటి పది లక్షలు ఇస్తామని ఆయనకు ఆఫర్ వచ్చింది. రాజ్‌కిరణ్ తన కష్టానికి గుర్తింపుగా దీన్ని అంగీకరించాడు. రూ.లక్ష జీతం తీసుకున్నప్పుడు కూడా అదే ఫీలింగ్ కలిగిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. రూ.1 కోటి పారితోషికంతో తమిళ్లో 'మాణిక్కం' అనే సినిమా తీశారు. 1996లో విడుదలైన ఈ చిత్రానికి కెవి పాండియన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రాజ్‌కిరణ్ సరసన నటుడు విజయకుమార్ కూతురు, బిగ్ బాస్ స్టార్ వనిత జతకట్టింది. అమ్మ క్రియేషన్స్ పతాకంపై డి.శివ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ద్వారా రూ.కోటి రెమ్యునరేషన్ అందుకున్న తొలి తమిళ హీరోగా రాజ్‌కిరణ్ నిలిచాడు. ఆయన తర్వాతే రజనీకాంత్, కమల్ హాసన్, విజయకాంత్, విజయ్, అజిత్ ఆ స్థాయికి చేరుకోవడం గమనార్హం. టాలీవుడ్లో చిరంజీవి టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి ఆయనకంటే ముందుగానే ఒక సినిమాకు రూ. 1.25 కోట్ల రెమ్యునరేషన్ అందుకొని రికార్డ్ క్రియేట్ చేశారు. అత్యధిక పారితోషికం అందుకున్న తొలి భారతీయ నటుడిగా 1992లోనే మెగాస్టార్ వార్తల్లో నిలిచారు. ఆపద్బాంధవుడు సినిమాకు గాను ఆయన ఈ భారీ మొత్తాన్ని తీసుకున్నారు. 1992లో వచ్చిన ది వీక్ మ్యాగజైన్ ఫస్ట్ పేజీలో చిరు గురించి ప్రత్యేకంగా పెద్ద ఆర్టికల్ రాశారు. ఆ మ్యాగజైన్ ముందు పేజీలో “బిగ్గర్ దెన్ బచ్చన్” అనే శీర్షికతో చిరు ఫోటోను ప్రచురించారు. -
తండ్రిని కాదని బుల్లితెర నటుడితో పెళ్లి.. చివరికి ఏమైందంటే?
సినీ ఇండస్ట్రీలో పెళ్లి, విడాకులు వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రేమ పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత కొన్నేళ్లకే విడిపోవడం ఈ రోజుల్లో ఫ్యాషన్‌గా మారిపోయింది. తాజాగా మరో సినీ నటుడికి అతని భార్య విడాకులిచ్చింది. గతంలో పారిపోయి బుల్లితెర నటుడు మునీశ్ రాజాను ప్రేమ పెళ్లి చేసుకున్న ఆమె.. విడిపోయినట్లు ఓ వీడియోను రిలీజ్ చేసింది. అంతే కాకుండా తన దత్త తండ్రి, నటుడు రాజ్ కిరణ్‌కు క్షమాపణలు చెప్పింది. జీనత్ ప్రియ వీడియోలో మాట్లాడుతూ.. 'అందరికీ నమస్కారం. నేను జీనత్ ప్రియ. రాజ్‌కిరణ్ సార్ దత్తపుత్రికను. 2022లో నటుడు మునీష్ రాజాను ప్రేమ వివాహం చేసుకున్నా. కానీ ప్రస్తుతం మేమిద్దరం విడిపోయాం. మేం విడిపోయి కొన్ని నెలలైంది. మా పెళ్లికి ఎలాంటి చట్టబద్ధత లేదు. ఈ విషయాన్ని నేను మీతో పంచుకుంటున్నా. నా పెళ్లితో నాన్నను చాలా బాధపెట్టాను. అయినప్పటికీ.. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు అండగా నిలిచారు. నాకు సహాయం చేశారు. ఈ విషయంలో నన్ను క్షమించు నాన్న' అంటూ రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మునీష్ రాజాతో జీనత్ ప్రియ వివాహం సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ప్రియా, మునీష్ మొదట స్నేహితులుగా ఉన్నారు. ఆ తర్వాత పరిచయం ప్రేమగా మారింది. ప్రియా, మునీష్ రాజా కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్నారు. అయితే వీరి పెళ్లికి మునీష్ రాజా కుటుంబం ఓకే చెప్పింది. కానీ రాజ్‌కిరణ్ మాత్రం పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించారు. మునీష్ రాజాకు తన కూతురిని పెళ్లి చేసుకునే అర్హత లేదని రాజ్‌కుమార్ అన్నారు. దీంతో రాజ్‌కుమార్ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో చివరికి పారిపోయి మరీ పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత జీనత్ ప్రియ తన దత్త తండ్రి రాజ్‌కిరణ్‌పై పలు ఆరోపణలు చేసింది. తాజాగా భర్తతో విడాకులు తీసుకున్నట్లు వీడియో రిలీజ్ చేసి అందరికీ షాకిచ్చింది. స్పందించిన రాజ్ కిరణ్ అయితే ఈ విషయంపై నటుడు రాజ్ కిరణ్ స్పందించారు. జీనత్ ప్రియ తన దత్తపుత్రిక అని వెల్లడించారు. ప్రస్తుతం ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మునీష్ రాజా డబ్బు కోసం ఏదైనా చేస్తాడని రాజ్‌కిరణ్ ఆరోపించారు. తన పేరును వాడుకుని సినిమాల్లో అవకాశాల కోసం యత్నించాడని ఆయన ఆరోపించారు. -
లూపస్ వ్యాధి చాలా డేంజర్.... తొందరగా గుర్తిస్తే నయం చేయవచ్చు
-
Raj Kiran: ‘ఆ అమ్మాయి నా కూతురే కాదు’
సీనియర్ నటుడు రాజ్‌కిరణ్ కూతురు బుల్లితెర నటుడు మునీష్రాజ్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే వారి పెళ్లి ఇప్పుడు చర్చకు దారి తీసింది. బుల్లితెర నటుడు మునీష్రాజ్ పెళ్లి చేసుకున్న అమ్మాయి తన కూతురే కాదని నటుడు రాజ్‌కిరణ్ గురువారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అందులో తన కూతురు ఒక టీవీ నటుడిని పెళ్లి చేసుకుందనే తప్పుడు ప్రచారం తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయంలో నిజాన్ని చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. తనకు టిప్పుసుల్తాన్ అనే ఒక కొడుకు మాత్రమే ఉన్నాడని.. తాను హిందూ మతానికి చెందిన ప్రియ అనే అమ్మాయిని దత్తత తీసుకున్నట్లు చెప్పారు. అయితే ఆమెను సంతోష పెట్టడానికి దత్తత పిల్ల అని బయట ఎవరికీ చెప్పలేదని, సొంత కూతురుగానే పెంచుకున్నామన్నారు. చదవండి: (Keerthy Suresh: సొంత ఊరు వెళ్లలేక.. ఉదయనిధితో ఓనం) అలాంటిది ఒక బుల్లితెర నటుడు ఫేస్బుక్ ద్వారా ప్రియతో పరిచయం పెంచుకుని మాయమాట చెప్పి పెళ్లి చేసుకునేంత వరకు తీసుకొచ్చాడన్నారు. ఈ విషయం తన చెవిన పడడంతో అతని గురించి విచారించగా చాలా మోసగాడని, డబ్బు కోసం ఏమైనా చేస్తాడని తెలిసిందన్నారు. అతను ప్రియను పెళ్లి చేసుకుని జీవితాన్ని గడపాలని కాకుండా తన పేరు వాడుకుని సినీ అవకాశాలను పొందాలని, తన నుంచి డబ్బులు కాజేయాలన్న దుర్మార్గపు ఆలోచనలతో ఆమెను ప్రేమించినట్లు తెలిసిందన్నారు. ఈ విషయాన్ని ప్రియకు వివరించి మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేస్తామని తాను తన భర్య నచ్చచెప్పామన్నారు. తాను కూడా అతను వద్దని, మీ ఇష్ట ప్రకారమే మీరు చూసిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని చెప్పిందన్నారు. అలాంటిది కొన్ని రోజుల తరువాత తన భార్య స్నేహితురాలు పార్వతి ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి బయటకు వెళ్లిందన్నారు. నాలుగు నెలలైనా ఇంటికి తిరిగి రాలేదన్నారు. ఇప్పుడు ఆ టీవీ నటుడిని పెళ్లి చేసు కుని ఇంటి నుంచి బయటకు రావడానికి కారణం తన భార్యనేనని ఆ అమ్మాయి నిందలు వేస్తోందని అన్నారు. ఈ తప్పుడు ప్రచారంతో తాను దిగ్భ్రాంతికి గురయ్యానని నటుడు రాజ్‌కిరణ్ పేర్కొన్నారు. -
స్వగ్రామానికి రాజ్ కిరణ్ మృతదేహం.. సీఎం స్టాలిన్ రూ. పది లక్షల సాయం
సాక్షి, చెన్నై : శ్రీలంక సేనల వీరంగానికి బలైన జాలరి రాజ్ కిరణ్ మృతదేహం శనివారం పుదుకోట్టై జిల్లా కోటై పట్నానికి చేరింది. బాధిత కుటుంబానికి సీఎం ఎంకే స్టాలిన్ రూ. పది లక్షలు సాయం ప్రకటించారు. తమిళ జాలర్లపై సముద్రంలో శ్రీలంక సేనల వీరంగం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత వారం పుదుకోట్టై జిల్లా కోటై పట్నంకు చెందిన జాలర్ల పడవపై శ్రీలంక నావికాదళం తమ ప్రతాపం చూపించింది. తమ నౌకతో ఆ పడవను ఢీకొట్టి మరీ.. సముద్రంలో ముంచేశారు. ఇందులోని రాజ్ కిరణ్ గల్లంతయ్యాడు. సుగందన్, సేవియర్‌ను రక్షించి తమ దేశ చెరలో బంధించారు. రాజ్‌కిరణ్ మృతదేహం కోసం శ్రీలంక సేనులు, భారత కోస్టు గార్డు తీవ్రంగానే గాలించింది. ఎట్టకేలకు నెడుం దీవుల్లో ఆ మృతదేహం తేలింది. ఈ మృత దేహానికి శ్రీలంకలో పోస్టుమార్టం నిర్వహించారు. అక్కడి భారత రాయబార కార్యాలయ అధికారులకు అప్పగించారు. దీంతో ఉదయాన్నే శ్రీలంకకు చెందిన నౌకలో ఆ మృతదేహాన్ని భారత సరిహద్దుల వరకు తీసుకొచ్చారు. భారత కోస్టుగార్డు వర్గాలకు అప్పగించారు. అక్కడ నుంచి కోటైపట్నంకు తరలించారు. చదవండి: (సిటీ బస్సులో సీఎం స్టాలిన్.. కాన్వాయ్ ఆపి మరీ..) మృతదేహం గ్రామానికి చేరుకోవడంతో జాలర్లు, అతడి కుటుంబీకులు కన్నీటి సంద్రంలో మునిగారు. శ్రీలంక చెరలో ఉన్న తమ వాళ్లను విడిపించే వరకు వేటకు వెళ్లమని జాలర్ల ప్రకటించారు. ఇక, రాజ్‌కిరణ్ మరణ సమాచారంతో దిగ్బ్రాంతిని , సంతాపాన్ని వ్యక్తం చేసిన సీఎం ఎంకే స్టాలిన్, అతడి కుటుంబానికి రూ. 10 లక్షలు సాయంప్రకటించారు. -
వెస్టియన్‌కు పీఈఆర్‌పీ అవార్డు
సాక్షి, హైదరాబాద్: చికాగో ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న నివాస, వాణిజ్య, రిటైల్ రంగాల్లో వర్క్‌ప్లేస్ సొల్యూషన్ కంపెనీ వెస్టియన్‌కు కస్టమర్ వాల్యూ లీడర్షిప్ అవార్డు దక్కింది. ముంబైలో జరిగిన 5వ ఫ్రోస్ట్ అండ్ సులివన్ ప్రాజెక్ట్ ఎవాల్యుయేషన్ అండ్ రికగ్నిషన్ ప్రోగ్రాం (పీఈఆర్‌పీ) అవార్డు–2018 కార్యక్రమంలో వెస్టియన్ వైస్ ప్రెసిడెంట్ రాజ్‌కిరణ్ నాయక్ ఈ అవార్డును అందుకున్నారు. వెస్టియన్‌కు ఈ అవార్డు రావటం వరుసగా నాల్గోసారి. -
పులిముందు వేషాలా?
‘కత్తిని చూసి భయపడటానికి పొట్టేల్ని కాదురా.. పులివెందుల బిడ్డని’, ‘జాతరలో పులివేషాలు వేయొచ్చు..కానీ, పులిముందే వేషాలు వేయకూడదు’... ‘పందెంకోడి 2’ చిత్రంలోని ఇలాంటి డైలాగులు విశాల్ అభిమానుల్ని అలరిస్తున్నాయి. విశాల్, కీర్తీ సురేష్ జంటగా, వరలక్ష్మీ శరత్‌కుమార్, రాజ్‌కిరణ్ ముఖ్య పాత్రల్లో ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘పందెంకోడి 2’. ‘ఠాగూర్’ మధు సమర్పణలో విశాల్, దవళ్ జయంతిలాల్ గడా, అక్షయ్ జయంతిలాల్ గడా నిర్మించిన ఈ సినిమా దసరా కానుకగా ఈనెల 18న విడుదలవుతోంది. ‘ఠాగూర్’ మధు మాట్లాడుతూ–‘‘ఇటీవల విడుదలైన ‘పందెంకోడి 2’ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. రేపు(ఆదివారం) హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహిస్తున్నాం’’ అన్నారు. -
పండగకి పందెం
విశాల్, మీరాజాస్మిన్ జంటగా లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన ‘పందెంకోడి’ సినిమా ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 2005లో విడుదలైన ఈ సినిమా విశాల్ కెరీర్‌కి టర్నింగ్ పాయింట్‌తో పాటు తెలుగులో మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను తీసుకొచ్చింది. ఈ చిత్రం విడుదలైన 12ఏళ్ల తర్వాత సీక్వెల్‌గా విశాల్–లింగుస్వామి కాంబినేషన్లో ‘పందెంకోడి 2’ తెరకెక్కుతోంది. ఠాగూర్ మధు సమర్పణలో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ పతాకాలపై తెరకెక్కుతోన్న ‘పందెం కోడి 2’ చిత్రం ట్రైలర్‌ని రేపు (శనివారం) విడుదల చేస్తున్నారు. ‘ఠాగూర్’ మధు మాట్లాడుతూ– ‘‘మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రమిది. విజయదశమి కానుకగా అక్టోబర్ 18న సినిమాని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. కీర్తీ సురేశ్, వరలక్ష్మీ శరత్‌కుమార్, రాజ్‌కిరణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్‌రాజా, కెమెరా: కె.ఎ.శక్తివేల్, నిర్మాతలు: విశాల్, దవళ్ జయంతిలాల్ గడా, అక్షయ్ జయంతిలాల్ గడా. -
వాస్తవ సంఘటనలతో...
సోమవారం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా రాజకిరణ్ సినిమా పతాకంపై ‘విశ్వామిత్ర’ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు చిత్ర యూనిట్. సినిమాకు మాధవి అద్దంకి, రజనీకాంత్ యస్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ‘గీతాంజలి, త్రిపుర’ చిత్రాల దర్శకుడు రాజకిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శక–నిర్మాత తేజ ఎన్టీఆర్ చిత్ర పటానికి నమస్కరించి, చిత్ర పటంపై క్లాప్‌నిచ్చి సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజకిరణ్ మాట్లాడుతూ–‘‘ఈ సినిమా స్విట్జర్లాండ్, అమెరికాలలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నాం. సినిమా మొదటి ఫ్రేమ్ నుంచి ఎంటర్టైన్మెంట్తో పాటు క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. నా గత చిత్రాలైన ‘గీతాంజలి, త్రిపుర’ కథలలో ఎన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఈ సినిమాలో కూడా అదే థ్రిల్ మెయింటేన్ చేస్తుంది. జూన్ మూడవ వారం నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. మంచి నాయకా,నాయికలు దొరికారు. అతి త్వరలో మిగతా విషయాలు తెలియజేస్తాం’’ అన్నారాయన. ఈ కథ నచ్చి ‘జక్కన్న’ చిత్ర దర్శకుడైన ఆకెళ్ల వంశీకృష్ణ ఈ చిత్రానికి మాటలు రాస్తుండటం విశేషం. ఈ చిత్రానికి కెమెరా: అనిల్ భండారి, మాటలు: ఆకెళ్ల వంశీకృష్ణ, ఎడిటర్:ఉపేంద్ర, ఆర్ట్:చిన్నా. నిర్మాతలు: మాధవి అద్దంకి, కథ–స్క్రీన్‌ప్లే–దర్శకత్వం: రాజకిరణ్ -
పవన్ సినిమాల ఆధారంగా ఆల్బం
హైదరాబాద్: టాలీవుడ్ అగ్ర హీరో పవన్ కల్యాణ్ నటించిన 22 సినిమాలు ఆధారంగా గీత రచయిత రామారావు ఒక ఆడియో ఆల్బమ్ రూపొందించారు. రాజ్‌కిరణ్ సంగీత దర్శకత్వంలో ఎస్.ఎన్.ఆర్ట్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో రూపొందిన ఈ ఆల్బమ్‌ను లైక్ అండ్ షేర్ స్టూడియోలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ (ఆర్కే గౌడ్) ఆవిష్కరించారు. ఆల్బమ్‌ను ఆవిష్కరణ అనంతరం ఆర్కే మీడియాతో మాట్లాడుతూ.. రామారావు రాసిన అద్భుతమైన సాహిత్యానికి రాజ్‌కిరణ్ సూపర్ ట్యూన్స్ ఇచ్చారని కొనియాడారు. పవన్ కల్యాణ్ అభిమానిగా ఈ ఆల్బమ్ రూపొందించానని, అందరికీ ఈ ఆల్బమ్ నచ్చుతుందని రాజ్‌కిరణ్ అన్నారు. ఈ కార్యక్రమానికి పవన్ అభిమానులు, రాజ్‌కిరణ్ సన్నిహితులు హాజరయ్యారు. రామారావు చేసిన ప్రయత్నాన్ని అందరూ మెచ్చుకున్నారు. -
ధనుష్ సినిమా రీమేక్‌లో మోహన్ బాబు..?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తొలిసారిగా దర్శకత్వం వహించిన సినిమా పవర్ పాండి. సీనియర్ నటులు రాజ్ కిరణ్, రేవతి ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాలో ధనుష్ అతిథి పాత్రలో అలరించాడు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్న ధనుష్‌ను విశ్లేకులతో పాటు పలువురు సినీ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. ఈ సినిమా టాలీవుడ్లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ధనుష్ ఫ్యామిలీకి అత్యంత ఆప్తుడైన మోహన్ బాబు తెలుగులో పవర్ పాండీ సినిమాను రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. తన సొంతం బ్యానర్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో రాజ్ కిరణ్ పాత్రలో తానే నటించాలని భావిస్తున్నాడట. అయితే ధనుష్ కనిపించిన అతిథి పాత్రలో మంచు హీరోలే కనిపిస్తారా.. లేక మరో హీరోతో చేయిస్తారా అన్న విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
ధనుష్‌కు ఆ విషయం తెలుసు
ఒక దర్శకుడికి ఉండాల్సిన ప్రధాన లక్షణం ధనుష్‌లో మెండుగా ఉందని సీనియర్ నటుడు, దర్శకుడు, నిర్మాత రాజ్‌కిరణ్ అన్నారు. ఏ నటుడితో ఎలా మాట్లాడి తనకు కావలసిన నటనను రాబట్టుకోవాలో తెలిసిన దర్శకుడు ధనుష్. ఒక దర్శకుడికి కావలసిన ప్రధాన లక్షణం అదే అన్నారు. ఇంతకు ముందు కథా నాయకుడిగా నటించిన రాజ్‌కిరణ్ ఇప్పుడు కథకు పాముఖ్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ తనదైన నటనతో ప్రేక్షకుల ఆదరణను అందుకుంటున్నారు. తాజాగా పవర్ పాండి అనే చిత్రంలో నాయకుడిగా నటించారు. విశేషం ఏమిటంటే ఈ చిత్రం ద్వారా ప్రముఖ యువ నటుడు ధనుష్ దర్శకుడిగా మెగాఫోన్ పట్టి తన వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై నిర్మించడం. సీనియర్ నటి రేవతి మరో ప్రధాన పాత్రను పోషించిన ఇందులో ప్రసన్న, ఛాయాసింగ్, విద్యులేఖ రామన్, రిన్సన్, దీనా, ఆడుగళం నరేన్, భాస్కర్, మాస్టర్ ఎంపీ.రాఘవన్, బేబీ సవిశర్మ, సెండ్రాయన్, అతిథి పాత్రలో మడోనా సెబాస్టియన్, గౌరవ పాత్రల్లో దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్, బాలాజీ మోహన్, రోబోశంకర్, దివ్యదర్శిని నటించారు. వేల్రాజ్ ఛాయాగ్రహణం, సాన్ రోల్డన్ సంగీతం అందించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ యూ సర్టిఫికెట్తో ఈ నెల 14న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా నటుడు రాజ్‌కిరణ్ పవర్‌పాండి చిత్ర అనుభవాలను శినివారం పాత్రికేయులతో పంచుకున్నారు. అవేమిటో ఆయన మాటల్లోనే చూద్దాం. ‘నేను సాధారణంగా కథ నచ్చక పోతే నటించడానికి అంగీకరించను. అందుకే 27 ఏళ్ల సినీ జీవితంలో ఇప్పటికీ 25 చిత్రాలే చేశాను. ఈ పవర్ పాండి విషయానికి వస్తే తొలుత దర్శకుడు సుబ్రమణ్యం శివ తనను కలిసి ఒక చిత్రం చేయాలనీ, కథ సింగిల్ లైన్ చెప్పారు. అది నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. వెంటనే చేద్దాం, దర్శక నిర్మాతలతో మాట్లాడదాం అని అన్నారు. అప్పుడు ఈ చిత్రానికి దర్శక నిర్మాత ధనుష్ అని చెప్పారు. ఆ తరువాత ధనుష్ కలిసి కథ చెప్పమంటారా అని అడిగారు. అప్పుడు నేను షూటింగ్‌కు వెళదాం అన్నాను. ఎందుకంటే ఆయన తమిళం, తెలుగు, హిందీ భాషల్లో మంచి మార్కెట్ ఉన్న నటుడు. ఆయన అడిగితే రజనీకాంత్ కూడా నటించడానికి రెడీ అం టా రు. అలాంటిది నన్ను ఈ చిత్రంలో కాథానాయకుడిగా ఎంచుకున్నారు. అందుకే నేను వెంటనే ఓకే అన్నాను. అలా పవర్ పాండి చిత్రం ప్రారంభం అయ్యింది. ధనుష్ ఎంచుకున్న కథలో చాలా మంచి సందేశం ఉంది. ప్రతి ఇంటా ఇలాంటి తాత కావాలని కోరుకుంటారు తాను తవమాయ్ తవమిరిందు చిత్రంలో నటించడానికి ముందు హీరోగా చూసేవాళ్లు. ఆ చిత్రం తరువాత అందరు తండ్రి స్థానంలో గౌరవం చూపేవాళ్లు. ఈ పవర్ పాండి చిత్రం చూసిన తరువాత ప్రతి కుటుంబంలో ఇలాంటి తాత ఉండాలని కోరుకుంటారు. అంత ఉన్నతమైన పాత్రను పవర్‌పాండిలో చేశాను. ఇందులో నేను మినహా అందరూ యువతే పని చేశారు. అయితే ఆ భావనే లేకుండా ఒక కుటుంబ సభ్యులతో కలిసి పనిచేసిన అనుభూతి కలిగింది. ఈ విషయంలో ధనుష్‌ను అభినందించాలి. నటీనటులను చాలా గౌరవంగా, ఎవరికీ అసౌకర్యం కలగకుండా చూసుకున్నారు. ఇందులో నాకు రెండు పోరాట దృశ్యాలు కూడా ఉన్నాయి. ఈ వయసులోనూ ఫైట్స్ దృశ్యాల్లో ఎలా నటించగలుగుతున్నారని అడుగుతున్నారు. నేను ముందుగా నా పాత్రను పూర్తిగా అర్థం చేసుకుంటాను. ఇక అందులోకి పరకాయ ప్రవేశం చేస్తాను. అది ఫైట్ అయినా సరే. పవర్ పాండి చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంటికెళ్లిన తరువాత ఓహో మనకి ఈ విషయం గురించి చెప్పారా? అన్న ఆలోచన వస్తుంది. అంతగా ప్రభావితం చేసే చిత్రంగా పవర్ పాండి ఉంటుంది’ అన్నారు. సంగీతదర్శకుడు సాన్ రోల్డన్ మాట్లాడుతూ ధనుష్‌కు సంగీతం పరిజ్ఞానం మెండన్నారు. తనకు ఏమి కావాలో తెలిసిన దర్శకుడని అన్నారు. అయినా తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారనీ పేర్కొన్నారు.« దనుష్ దర్శకత్వం వహించిన చిత్రానికి పనిచేయడం సంతోషంగా ఉందని ఛాయాగ్రాహకుడు వేల్రాజ్ పేర్కొన్నారు. మనిషి వృద్ధాప్య జీవితం గురించి సగటు మనిషికి ఉద్యోగపరంగా 60 ఏళ్లకు పదవీ విరమణ ప్రకటిస్తున్నారు. ఆ వ్యక్తి చదువు పూర్తి చేసి, ఆ తరువాత ఉద్యోగం, పెళ్లి, పిల్లలు వారి పెంపకం, చదువులు ఇలా బాధ్యతలను పూర్తి చేసేసరికి పదవీ విరమణ స్థాయి చేరుకుంటాడు. ఇక వృద్ధాప్యంలో తనకంటూ ఏమీ ఉండదు. ఇక గౌరవం ఉండదు.అప్పడు ఆ వ్యక్తి వేదన వర్ణనాతీతం. అలా కాకూడదు, తన వృద్ధాప్యం గురించి ముందుగానే ఆలోచించి తన సంపాదనలో కొంత భాగాన్ని వెనకేసుకోవాలన్న సందేశంతో కూడిన చిత్రం పవర్ పాండి. -
షూటింగ్ పూర్తి చేసుకున్న ధనుష్ తొలి సినిమా
హీరోగా ఎన్నో విజయాలను అందుకున్న కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇటీవల నిర్మాతగానే సత్తా చాటుతున్నాడు. అదే జోరులో తనలో ఓ దర్శకుడు కూడా ఉన్నాడంటూ ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతున్నాడు. ధనుష్ దర్శకుడిగా మారి తెరకెక్కించిన పవర్ పాండి షూటింగ్ పూర్తయ్యింది. ఒక పక్క నటుడిగా బిజీగా ఉంటూనే దర్శకుడిగా తన తొలి చిత్రాన్ని అనుకున్న సమయానికి పూర్తి చేశాడు ధనుష్. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన ధనుష్, సినిమాను పూర్తి చేయడంలో తనుకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశాడు. ధనుష్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రాజకిరణ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా గౌతమ్ మీనన్, ధనుష్ లు అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. మార్చి 9న ఆడియోనే.. ఏప్రిల్ 14న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. And that's a wrap for #powerpaandi .. so thankful and happy to be able to live my dream. Thank u all for all d encouragement. Spread love. 🙏 — Dhanush (@dhanushkraja) 27 February 2017 -
త్వరలో విడుదలకు పవర్‌పాండి
పవర్‌పాండి చిత్రం విడుదల తేదీ ఫిక్స్ అయ్యింది. స్టార్ నటుడు ధనుష్ తొలిసారిగా మోగాఫోన్ పట్టిన చిత్రం పవర్‌పాండి. దీన్ని తన వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై నిర్మిస్తూ, ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు ధనుష్. సినీయర్ నటుడు రాజ్‌కిరణ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో నటి మరోనా సెబాస్టియన్, చాయాసింగ్, ప్రసన్న ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు గౌతమ్‌మీనన్, విజయ్ టీవీ దైవదర్శిని ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. పవర్‌పాండి చిత్రానికి షాన్ రోనాల్డ్ సంగీతం, వేల్రాజ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. చిత్ర షూటింగ్‌ను సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసిన ధనుష్ అదే విధంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేరుకుందని తెలిసింది. ఇది ఒక స్టంట్ కళాకారుడి ఇతివృత్తంతో తెరకెక్కుతున్న చిత్రం అని సమాచారం. పవర్‌పాండి చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. ధనుష్ మరో పక్క గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో తాను హీరోగా నటిస్తున్న ఎన్నై నోక్కి పాయుమ్ తోట్టా చిత్రం షూటింగ్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుందని కోలీవుడ్ వర్గాల సమాచారం. -
సండైకోళి-2 నాయకి ఈ బ్యూటీనేనా?
సండైకోళి చాలా మందికి లైఫ్ ఇచ్చిన చిత్రం ఇది. పక్కా కమర్షియల్ అంశాలతో కూడిన మాస్ ఎంటర్టైనర్ చిత్రం. దర్శకుడు లింగుసామి స్టామినా పెంచిన చిత్రం సండైకోళి. విశాల్‌ను మాస్ హీరోగా నిలబెట్టిన చిత్రం ఇదే. నటి మీరాజాస్మిన్‌కు క్రేజ్ తెచ్చిపెట్టిన చిత్రం సండైకోళి. నటుడు రాజ్‌కిరణ్‌కు రీ-ఎంట్రీ ఇచ్చినచిత్రం. ఇలా చాలా మందికి నూతనోత్సాహాన్నిచ్చిన సండైకోళికి సీక్వెల్ సన్నాహాలు జరుగుతున్నాయి. విశాల్ హీరోగా నటిస్తూ తన సొంత బ్యానర్లో నిర్మించనున్న ఈ చిత్రానికి లింగుసామినే దర్శకత్వం వహించనున్నారు. అదే విధంగా రాజ్‌కిరణ్ ముఖ్య పాత్రను పోషించనున్నారు. ఇకపోతే హీరోయిన్ ఎవరన్నదే ఆసక్తిగా మారింది. ఎందుకంటే సండైకోళి చిత్ర నాయకి మీరాజాస్మిన్‌కు ఇప్పుడు మార్కెట్ లేదు. అయితే సండైకోళి-2లో ఈ భామ ఉంటుందట. నాయకిగా మాత్రం కాదని సమాచారం. ఇలాంటి పరిస్థితిలో తాజాగా ఈ చిత్రానికి నాయకి నిర్ణయం జరిగిందనే ప్రచారం జరుగుతోంది. అదెవోరో కాదు. చిత్ర చిత్రానికి తన స్థాయిని పెంచుకుంటున్న స్మైల్ నటి కీర్తీసురేశ్‌నే ఆ అవకాశం వరించినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. కీర్తీ ప్రస్తుతం ఇళయదళపతి విజయ్‌తో భైరవా చిత్రంలో నటిస్తున్నారు. బాబీసింహకు జంటగా నటించిన పాంబుసట్టై చిత్రం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా త్వరలో మరో స్టార్ హీరో సూర్యతో రొమాన్స్‌కు రెడీ అవుతున్నారు. తానాసేర్న్‌ద కూటం పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి నయనతార ప్రియుడిగా ప్రచారంలో ఉన్న విఘ్నేష్ శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మించనుంది. కాగా తాజాగా సండైకోళి-2 చిత్రంలో విశాల్‌తో డ్యూయెట్స్ పాడటానికి సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. ఇకపోతే వచ్చే ఏడాది లింగుసామి దర్శకత్వంలో అల్లుఅర్జున్ హీరోగా నటించనున్న చిత్రంలోనూ కీర్తీసురేశ్‌నే హీరోయిన్ అని ప్రచారం జరుగుతోంది. -
ధనుష్ ’పవర్ పాండి’ ఫస్ట్ లుక్
చెన్నై : హీరో ధనుష్ మరో కొత్త అవతారం ఎత్తాడు. నటుడు, గాయకుడు, గీత రచయితగా, నిర్మాతగా మంచి మార్కులు కొట్టేసిన ఈ హీరో తాజాగా మెగాఫోన్ పట్టాడు. ప్రముఖ నటుడు రాజ్ కిరణ్ ప్రధాన పాత్రలో 'పవర్ పాండి' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ విషయాన్ని ధనుష్ అధికారికంగా ధ్రువీకరించాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. దర్శకుడిగా ఈ సినిమా ధనుష్‌కి తొలి చిత్రం కాగా దీనిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజ్ కిరణ్‌తో పాటు ఈ చిత్రంలో ప్రసన్న, చాయసింగ్ నటిస్తున్నారు. కాగా కబాలి చిత్రానికి సంగీతం అందించిన షాన్ రోల్డాన్ ... ఈ చిత్రానికి కూడా మ్యూజిక్ అందించనున్నారు.అలాగే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులను త్వరలో ప్రకటించనున్నారు. అయితే ఈ చిత్రంలో ధనుష్ నటిస్తాడా? లేదా?అన్నది మాత్రం సస్పెన్స్. ప్రస్తుతం ధనుష్ గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో ’ఎన్నై నోక్కి పాయుమ్ తూట్టా’ చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే ధనుష్ త్వరలో తన సొంత బ్యానర్‌పై రజనీకాంత్‌తో ఓ చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నాడు. ఈ చిత్రానికి పా.రంజిత్ దర్శకత్వం వహించనున్నాడు. #powerpaandi #wunderbarfilms #rajkiran #prasanna #DD1 a Sean roldan musical pic.twitter.com/8WSRAOW1e8 — Dhanush (@dhanushkraja) 7 September 2016 -
మలుపు తిప్పిన గీతాంజలి....
ఫొటోగ్రాఫర్ నుంచి సినీ దర్శకుడిగా... సత్తాచాటుతున్న రాజ్‌కిరణ్ కైకలూరు : కృషి పట్టుదల ఉంటే ఎంతటి అసాధ్యమైన పనినైన సుసాధ్యం చేయవచ్చని నిరూపిస్తున్నాడు ఓ యువ దర్శకుడు. భుజంపై కెమేరాను వేలాడదీసుకుని పొట్టకూటి కోసం పరుగులెత్తిన ఆ ఫోటోగ్రాఫర్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ డెరైక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. గతమెంతో గాయాలైన తన లక్ష్యాన్ని అందిపుచ్చుకున్నాడు. మరోపది మందికి ఉపాధి చూపిస్తున్నాడు. అతనే కైకలూరుకు చెందిన ఫొటోగ్రాఫర్ రాజ్‌కిరణ్. ఆయన తెరకెక్కిం చిన హర్రర్, థ్రిల్లర్ మూవీ త్రిపుర నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. కైకలూరులో కాళ్లకు చెప్పులు లేకుండా తిరిగిన రాజ్‌కిరణ్ అసలు పేరు పిల్లి బాలాజీ. తండ్రి సాధారణ ఇంజన్ మెకానిక్. రాజ్‌కు ఓ తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు. తండ్రి ఆదరణ కరువైంది. దీంతో కుటుంబ భారం రాజ్‌కిరణ్‌పై పడటంతో ఫోటోగ్రాఫర్‌గా జీవితాన్ని ఆరంభిం చాడు. ఈ పని చేస్తూనే బాలాజీ మ్యూజికల్ నైట్ ను ఏర్పాటు చేసి తమ్ముడితో కలసి కచేరీలు చేశా డు. తనప్రతిభకు సరైన గుర్తింపు లేదని కుటుంబం తో కలసి హైదరాబాదు వెళ్లి సినీరంగంలో అడుగిడాడు. దివంగత హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణ వద్దన్నా అక్కడే ఉండి వీఆర్.ప్రతాప్, రాజా వన్నంరెడ్డి, రవిరాజా పినిశెట్టి వంటి దర్శకుల వద్ద మెళుకువలు నేర్చుకున్నాడు. మలుపు తిప్పిన గీతాంజలి.... అంజలీ కథానాయకిగా గత ఏడాది విడుదలైన గీతాంజలి సినిమా రాజ్కిరణ్లో ప్రతిభకు అద్దంపట్టింది. ఆ సినిమాకు కథా రచయిత, దర్శకత్వ బాధ్యతలను సమర్థవంతంగా రాజ్‌కిరణ్ పోషిం చారు. సినిమా ఆద్యంతం అందరినీ ఎంతో ఆకట్టుకుంది. ఆ తరువాత కలర్స్ స్వాతితో కథానాయికగా అందాల రక్షాసి ప్రేం నవీన్ చంద్ర ప్రత్యేక పాత్రలో త్రిపుర పేరుతో సినిమాను తెరకెక్కించాడు. దాదాపు 600 సినిమా థియేటర్లలో ఈ సినిమా రిలేజ్ కానుంది. రాజ్‌కిరణ్ దర్శకునిగా గుర్తింపు పొందడం తమకు ఎంతో గర్వంగా ఉందని కైకలూరులోని ఆయన స్నేహితులు చెబుతున్నారు. అవకాశాలను అందిపుచ్చుకోవాలి! జీవితంలో మనం కోరుకున్నది సాధించాలంటే కష్టపడాలి. ఆ దారిలో ముళ్లు కంపలు ఉన్నాయని వెను తిరగకూడదు. ప్రస్తుత జీవనయానంలో సినిమా ట్రెండ్ మారింది. ప్రేక్షకుడు సినిమా నచ్చకపోతే టిక్కెట్టు ఎంత పెట్టికొన్నాం.. అని ఆలోచించడం లేదు. థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోతున్నాడు. వంద రూపాయిలతో సినిమాకు వస్తున్న ప్రేక్షకుడిని అలా నిరాశపర్చకూడదు. అందుకే మంచి కథను ఎంచుకుంటున్నాను. క్రేజీ మీడియాపై తెరకెక్కించిన త్రిపుర సినిమా అందరిని ఆకట్టుకుంటుంది. - రాజ్‌కిరణ్, త్రిపుర చిత్ర దర్శకుడు -
‘గీతాంజలి’ని మించి...
‘కలర్స్’ స్వాతి ఇక నుంచి ‘త్రిపుర’గా మారనున్నారు. అదేంటి అనుకుంటున్నారా...! ఆమె ప్రధాన పాత్రలో నటించనున్న చిత్రం ‘త్రిపుర’. ‘అందాల రాక్షసి’ ఫేం నవీన్ చంద్ర ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. క్రేజీ మీడియా పతాకంపై ఎ. చినబాబు, ఎం. రాజశే ఖర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రాజ్ కిరణ్ దర్శకుడు. సోమవారం హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. దర్శకుడు బోయపాటి శ్రీను, అలీ, కోనవెంకట్ కలిసి ఈ సినిమా స్క్రిప్ట్‌ను రాజ్‌కిరణ్‌కు అందించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘మళ్లీ కోనవెంకట్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ‘గీతాంజలి’ ని మించిన చిత్రం అవుతుంది ’’ అని చెప్పారు. కథ వినగానే బాగా ఎగ్జైట్ అయ్యానని, రాజ్ కిరణ్ ప్రతిభ మీద పూర్తి నమ్మకం ఉందని కోనవెంకట్ తెలిపారు. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తామని, ఈ నెల 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే : కోనవెంకట్, కెమెరా: రవికుమార్, సంగీతం: కామ్రాన్. -
శ్మశానంలో కూర్చుని ఆ కథ రాశా...
దర్శకుడు కావాలని పదిహేనేళ్లు తపస్సు చేశాడు రాజ్‌కిరణ్. అసిస్టెంట్ మేనేజర్‌గా, సహాయ దర్శకునిగా, అసోసియేట్ డెరైక్టర్‌గా అంచెలంచెలుగా ఎదుగుతూ ఎట్టకేలకు ‘గీతాంజలి’తో దర్శకుడయ్యారు. ఆయనతో జరిపిన మాటామంతీ. కైకలూరులో ఫొటోస్టూడియో నడిపా: మాది కృష్ణాజిల్లా కైకలూరు. నేను ఫొటోగ్రాఫర్‌ని. ఫోటో స్టూడియో కూడా రన్ చేశాను. సినిమాలంటే చిన్నప్పట్నుంచీ పిచ్చి. నూతనప్రసాద్ మా ఊరు నుంచే వెళ్లి పెద్ద స్టార్ అయ్యారు. ఆయనలా నేనూ స్టార్ అవ్వాలని కలలు కనేవాణ్ణి. నిర్మాత మాగంటి బాబుగారి ద్వారా హైదరాబాద్‌లో అడుగుపెట్టాను. అప్పటికే నాకు పెళ్లయ్యింది. పిల్లలు కూడా. జీవనోపాధినిచ్చే స్టూడియోకి తాళం వేసి హైదరాబాద్‌లో అవకాశాల కోసం వేట మొదలుపెట్టా. సినీ ప్రయాణం అలా మొదలైంది: రవిరాజా పినిశెట్టిగారి ‘అల్లుడుగారొచ్చారు’ చిత్రానికి అసిస్టెంట్ మేనేజర్‌గా చేరాను. సీన్ పేపర్లు జిరాక్స్ తీసుకురమ్మని పంపిస్తే... రెండు సెట్లు తీయించి, ఒక సెట్ నా దగ్గర ఉంచుకునేవాణ్ణి. వన్ లైన్ ఆర్డర్ అంటే ఏమిటి? సన్నివేశాలు ఎలా రాయాలి? అనేది వాటిని చూసి నేర్చుకునేవాణ్ణి. తర్వాత ‘చూసొద్దాం రండి’, ‘9 నెలలు’ చిత్రాలకు సహాయ దర్శకునిగా పనిచేశాను. ఎన్టీఆర్ ‘నిన్ను చూడాలని’ చిత్రంతో అసోసియేట్ డెరైక్టర్‌గా ప్రమోటయ్యా. ఆ తర్వాత కథలు తయారు చేసుకుని, దర్శకత్వం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టా. సునీల్‌తో చేద్దామన్నారు: ఓ శ్మశానంలో కూర్చొని ‘గీతాంజలి’ కథ రాసుకున్నా. ఈ కథకు నేను పెట్టిన పేరు ‘టూ లెట్’. తర్వాత అది ‘బాలాత్రిపుర సుందరి’గా మారింది. ఈ కథ విని నిర్మాత బెల్లంకొండ సురేశ్ ఓకే చేశారు. అయితే... సునీల్‌తో చేద్దామన్నారు. అప్పటికే శ్రీనివాసరెడ్డికి మాటిచ్చి ఉన్నాను. అందుకే ఒప్పులేకపోయాను. తర్వాత ఎన్నో చేతులు మారి చివరకు కోన వెంకట్‌గారి వద్దకు చేరిందీ కథ. ఆయన నిర్మాత ఎంవీవీ సత్యనారాయణగార్ని రంగంలోకి దించడంతో ఇక కథ ఎక్కడా ఆగలేదు. కోన వెంకట్‌గారు ఈ ప్రాజెక్ట్‌లో ఇన్వాల్వ్ అవ్వడంతో సినిమాకు మరింత హైప్ వచ్చింది. బ్రహ్మానందంగారి సైతాన్‌రాజ్ పాత్ర, షకలక శంకర్ పాత్ర ఆయన క్రియేషనే. త్వరలో ఓ యువ హీరోతో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థలో సినిమా చేయబోతు న్నాను. -
అదేరా ప్రేమంటే...
నాగబాబు శక్తిమంతమైన పోలీస్ అధికారిగా నటించిన చిత్రం ‘అదేరా ప్రేమంటే’. శివరామ్ ఆయంచ, దీప్సిక జంటగా బాబు.ఎస్ దర్శకత్వంలో శ్రీనివాస్ అనంతనేని నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఇదొక క్రైమ్ థ్రిల్లర్. ప్రేమలోని విభిన్న కోణాన్ని ఇందులో ఆవిష్కరించాం. తాగుబోతు రమేష్‌పై తీసిన పాట ఈ సినిమాకే హైలైట్’’ అని చెప్పారు. ఈ నెలాఖరున పాటల్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ ప్రకాష్ తవ్వా, కెమెరా: వైకే ప్రసాద్, సమర్పణ: దేవరకొండ ఆంజనేయులు.