ధనుష్ సినిమా రీమేక్లో మోహన్ బాబు..? | Manchu mohan babu for power paandi telugu remake | Sakshi
Sakshi News home page

ధనుష్ సినిమా రీమేక్లో మోహన్ బాబు..?

Published Sat, Apr 15 2017 10:28 AM | Last Updated on Tue, Sep 5 2017 8:51 AM

ధనుష్ సినిమా రీమేక్లో మోహన్ బాబు..?

ధనుష్ సినిమా రీమేక్లో మోహన్ బాబు..?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తొలిసారిగా దర్శకత్వం వహించిన సినిమా పవర్ పాండి. సీనియర్ నటులు రాజ్ కిరణ్, రేవతి

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తొలిసారిగా దర్శకత్వం వహించిన సినిమా పవర్ పాండి. సీనియర్ నటులు రాజ్ కిరణ్, రేవతి ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాలో ధనుష్ అతిథి పాత్రలో అలరించాడు.  ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్న ధనుష్ను విశ్లేకులతో పాటు పలువురు సినీ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు.

ఈ సినిమా టాలీవుడ్లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ధనుష్ ఫ్యామిలీకి అత్యంత ఆప్తుడైన మోహన్ బాబు తెలుగులో పవర్ పాండీ సినిమాను రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. తన సొంతం బ్యానర్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో రాజ్ కిరణ్ పాత్రలో తానే నటించాలని భావిస్తున్నాడట. అయితే ధనుష్ కనిపించిన అతిథి పాత్రలో మంచు హీరోలే కనిపిస్తారా.. లేక మరో హీరోతో చేయిస్తారా అన్న విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement