
షూటింగ్ పూర్తి చేసుకున్న ధనుష్ తొలి సినిమా
హీరోగా ఎన్నో విజయాలను అందుకున్న కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇటీవల నిర్మాతగానే సత్తా చాటుతున్నాడు. అదే జోరులో
హీరోగా ఎన్నో విజయాలను అందుకున్న కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇటీవల నిర్మాతగానే సత్తా చాటుతున్నాడు. అదే జోరులో తనలో ఓ దర్శకుడు కూడా ఉన్నాడంటూ ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతున్నాడు. ధనుష్ దర్శకుడిగా మారి తెరకెక్కించిన పవర్ పాండి షూటింగ్ పూర్తయ్యింది. ఒక పక్క నటుడిగా బిజీగా ఉంటూనే దర్శకుడిగా తన తొలి చిత్రాన్ని అనుకున్న సమయానికి పూర్తి చేశాడు ధనుష్.
ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన ధనుష్, సినిమాను పూర్తి చేయడంలో తనుకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశాడు. ధనుష్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రాజకిరణ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా గౌతమ్ మీనన్, ధనుష్ లు అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. మార్చి 9న ఆడియోనే.. ఏప్రిల్ 14న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
And that's a wrap for #powerpaandi .. so thankful and happy to be able to live my dream. Thank u all for all d encouragement. Spread love. 🙏
— Dhanush (@dhanushkraja) 27 February 2017