
ధనుష్
ఈ ఏడాది నటుడిగా హాలీవుడ్ చిత్రం ‘ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్’, నిర్మాతగా మామ రజనీకాంత్‌తో ‘కాలా’ చిత్రాలు చేశారు ధనుష్. ఇప్పుడు డైరెక్టర్‌గా తన సెకండ్ మూవీని స్టార్ట్ చేశారట ఈ మల్టీటాలెంటెడ్ హీరో. ‘పవర్ పాండి’ చిత్రం ద్వారా ధనుష్ దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ధనుష్ ఓ కీలక పాత్ర చేశారు. దర్శకుడిగా తన మలి చిత్రంలో కూడా కీలక పాత్రతో సరిపెట్టాలనుకుంటున్నారట ధనుష్. ఎందుకంటే డైరెక్టర్ ఈజ్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ కదా. లీడ్ రోల్ కూడా చేస్తే డైరెక్షన్ డైవర్ట్ అయ్యే అవకాశం ఉందని ధనుష్ అనుకుంటున్నారట. నటుడిగా ధనుష్ చేసిన ‘ఎౖన్నై నోక్కి పాయుమ్ తోటా, మారి 2 , వడ చెన్నై’ ఈ ఏడాది చివర్లో రిలీజ్ కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment