
రాజ్‌కిరణ్, రేవతి, ప్రసన్న, చాయాసింగ్ నటించిన పవర్ పాండి చిత్రం ద్వారా ధనుష్ దర్శకుడి అవతారం ఎత్తారు. తర్వాత నాగార్జున, శరత్‌కుమార్, శ్రీకాంత్, అతిథిరావు వంటి తారలతో ఒక చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ధనుష్ గొప్ప నటుడనే విషయం అందరికీ తెలిసిందే. అదే సమయంలో ఇతను పరమ శివభక్తుడు అనే విషయం చాలా మందికి తెలియదు.
‘మగధీర’ తరహాలో ధనుష్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కూడా చారిత్రాత్మకమైనదే. తెలుగులో అనేక మంది ప్రముఖ దర్శకుల దర్శకత్వంలో చాలా చిత్రాల్లో నటించిన నాగార్జున.. ధనుష్ ఒకే రోజున అనేక సన్నివేశాలను అతి వేగంగా డైరెక్ట్ చేస్తున్న ప్రతిభకు ముగ్ధుడై మనసారా అభినందించారు. ఈ చిత్రం ప్రధానాంశం శివునిపై భక్తి ప్రపత్తులతో కూడింది కావడంతో ప్రతిరోజూ పూజలు, పునస్కారాలను ధనుష్ ఇంట్లోనే ముగించి షూటింగ్ స్పాట్‌కు వస్తున్నట్లు సమాచారం.