పవన్ సినిమాల ఆధారంగా ఆల్బం | pawan kalyan movies audio album prepared by ramarao | Sakshi
Sakshi News home page

పవన్ సినిమాల ఆధారంగా ఆల్బం

Published Sat, Jun 17 2017 6:52 AM | Last Updated on Fri, Jul 12 2019 4:40 PM

పవన్ సినిమాల ఆధారంగా ఆల్బం - Sakshi

పవన్ సినిమాల ఆధారంగా ఆల్బం

హైదరాబాద్: టాలీవుడ్ అగ్ర హీరో పవన్ కల్యాణ్ నటించిన 22 సినిమాలు ఆధారంగా గీత రచయిత రామారావు ఒక ఆడియో ఆల్బమ్ రూపొందించారు. రాజ్‌కిరణ్ సంగీత దర్శకత్వంలో ఎస్.ఎన్.ఆర్ట్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో రూపొందిన ఈ ఆల్బమ్‌ను లైక్ అండ్ షేర్ స్టూడియోలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ (ఆర్కే గౌడ్) ఆవిష్కరించారు.

ఆల్బమ్‌ను ఆవిష్కరణ అనంతరం ఆర్కే మీడియాతో మాట్లాడుతూ.. రామారావు రాసిన అద్భుతమైన సాహిత్యానికి రాజ్‌కిరణ్ సూపర్ ట్యూన్స్ ఇచ్చారని కొనియాడారు. పవన్ కల్యాణ్ అభిమానిగా ఈ ఆల్బమ్ రూపొందించానని, అందరికీ ఈ ఆల్బమ్ నచ్చుతుందని రాజ్‌కిరణ్ అన్నారు. ఈ కార్యక్రమానికి పవన్ అభిమానులు, రాజ్‌కిరణ్ సన్నిహితులు హాజరయ్యారు. రామారావు చేసిన ప్రయత్నాన్ని అందరూ మెచ్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement