Raj Kiran Clarifies About His Daughters Marriage Issue - Sakshi
Sakshi News home page

Raj Kiran: ‘ఆ అమ్మాయి నా కూతురే కాదు’ 

Published Sat, Sep 10 2022 7:05 AM | Last Updated on Sat, Sep 10 2022 8:25 AM

Raj Kiran Clarifies about his Daughters Marriage Issue - Sakshi

దత్త పుత్రికతో రాజ్‌కిరణ్‌ కుటుంబం

సీనియర్‌ నటుడు రాజ్‌కిరణ్‌ కూతురు బుల్లితెర నటుడు మునీష్‌రాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే వారి పెళ్లి ఇప్పుడు చర్చకు దారి తీసింది. బుల్లితెర నటుడు మునీష్‌రాజ్‌ పెళ్లి చేసుకున్న అమ్మాయి తన కూతురే కాదని నటుడు రాజ్‌కిరణ్‌ గురువారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

అందులో తన కూతురు ఒక టీవీ నటుడిని పెళ్లి చేసుకుందనే తప్పుడు ప్రచారం తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయంలో నిజాన్ని చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. తనకు టిప్పుసుల్తాన్‌ అనే ఒక కొడుకు మాత్రమే ఉన్నాడని.. తాను హిందూ మతానికి చెందిన ప్రియ అనే అమ్మాయిని దత్తత తీసుకున్నట్లు చెప్పారు. అయితే ఆమెను సంతోష పెట్టడానికి దత్తత పిల్ల అని బయట ఎవరికీ చెప్పలేదని, సొంత కూతురుగానే పెంచుకున్నామన్నారు.

చదవండి: (Keerthy Suresh: సొంత ఊరు వెళ్లలేక.. ఉదయనిధితో ఓనం) 

అలాంటిది ఒక బుల్లితెర నటుడు ఫేస్‌బుక్‌ ద్వారా ప్రియతో పరిచయం పెంచుకుని మాయమాట చెప్పి పెళ్లి చేసుకునేంత వరకు తీసుకొచ్చాడన్నారు. ఈ విషయం తన చెవిన పడడంతో అతని గురించి విచారించగా చాలా మోసగాడని, డబ్బు కోసం ఏమైనా చేస్తాడని తెలిసిందన్నారు. అతను ప్రియను పెళ్లి చేసుకుని జీవితాన్ని గడపాలని కాకుండా తన పేరు వాడుకుని సినీ అవకాశాలను పొందాలని, తన నుంచి డబ్బులు కాజేయాలన్న దుర్మార్గపు ఆలోచనలతో ఆమెను ప్రేమించినట్లు తెలిసిందన్నారు. ఈ విషయాన్ని ప్రియకు వివరించి మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేస్తామని తాను తన భర్య నచ్చచెప్పామన్నారు.

తాను కూడా అతను వద్దని, మీ ఇష్ట ప్రకారమే మీరు చూసిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని చెప్పిందన్నారు. అలాంటిది కొన్ని రోజుల తరువాత తన భార్య స్నేహితురాలు పార్వతి ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి బయటకు వెళ్లిందన్నారు. నాలుగు నెలలైనా ఇంటికి తిరిగి రాలేదన్నారు. ఇప్పుడు ఆ టీవీ నటుడిని పెళ్లి చేసు కుని ఇంటి నుంచి బయటకు రావడానికి కారణం తన భార్యనేనని ఆ అమ్మాయి నిందలు వేస్తోందని అన్నారు. ఈ తప్పుడు ప్రచారంతో తాను దిగ్భ్రాంతికి గురయ్యానని నటుడు రాజ్‌కిరణ్‌ పేర్కొన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement