pandem kodi 2
-
ఇప్పుడు నా టైమ్ మొదలైంది
‘‘ఇన్ని రోజులు తెలుగు సినిమాలు చేయకపోవడానికి కారణం తమిళం, కన్నడం, మలయాళ సినిమాల మీద ఎక్కువ దృష్టి పెట్టడమే. ప్రతిదానికి ఓ టైమ్ రావాలంటాం కదా. ఇప్పుడిలా డబ్బింగ్ సినిమాల ద్వారా ఆ టైమ్ వచ్చింది. రేపు స్ట్రయిట్ సినిమాలకూ వస్తుందేమో’’ అన్నారు వరలక్ష్మీ శరత్ కుమార్. విజయ్, కీర్తీ సురేశ్ జంటగా మురుగదాస్ తెరకెక్కించిన ‘సర్కార్’ లో వరలక్ష్మీ కీలక పాత్ర చేశారు. ఈ చిత్రం నవంబర్ 6న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా తొలిసారి తెలుగు మీడియాతో ముచ్చటించారు వరలక్ష్మీ. ∙ఆర్టిస్ట్ అన్నాక అన్ని రకాల పాత్రలు చేయాలి. అందుకే హీరోయిన్, సెకండ్ హీరోయిన్, విలన్, గెస్ట్ రోల్స్ అనే తేడా చూడను. బహుశా అందుకేనేమో ఈ ఏడాది ఆల్రెడీ 4 సినిమాలు రిలీజయ్యాయి. మరో మూడు రిలీజ్ కాబోతున్నాయి. ∙విజయ్, మురుగదాస్ కాంబినేషన్ అంటే ఎవరైనా ఎగై్జట్ అవుతారు. నేనూ అంతే. సినిమాలో మంచి పాత్ర చేశాను. పాజిటీవా? నెగటీవా? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ∙పందెం కోడి 2, సర్కార్ సినిమాలకు తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నాను. పాత్ర తాలూకు ఎమోషన్స్ నటీనటులకే ఎక్కువ తెలుస్తాయి కాబట్టి మనది మనమే చెప్పుకుంటే ఇంకా పాత్రకు డెప్త్ వస్తుందని నమ్మకం. అందుకే కొంచెం కష్టమైనా డబ్బింగ్ చెప్పుకున్నాను. ∙నా ఫస్ట్ సినిమా ‘పోడా పోడి’ (2012) తర్వాత ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలు తక్కువ. ఆ మాటకొస్తే గతేడాది నుంచే ఎక్కువ సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు నా టైమ్ మొదలైంది. ∙మా నాన్నగారి (శరత్ కుమార్) పేరు వాడటం ఇష్టం ఉండదు. సొంతంగా ఎదగాలనే ఫిలాసఫీ నాది. ఇప్పుడందరూ వరలక్ష్మీ వాళ్ల నాన్నగారు శరత్ కుమార్ అంటుంటే కూతురిగా నాకు గర్వంగా ఉంది. ప్రస్తుతం నాన్నతో కలసి ‘పాంబన్’ అనే సినిమా చేస్తున్నా. ∙లైంగికంగా వేధిస్తే బయటకు చెప్పాలి. సెలబ్రిటీలుగా మేం చెబితే బయట వాళ్లకు ఓ ధైర్యం వస్తుందని దాదాపు ఏడాదిన్నర క్రితమే నాకు జరిగిన ఓ చేదు అనుభవం గురించి బయటకు చెప్పాను. ‘మీటూ’ ఉద్యమం స్టార్ట్ అవ్వకముందే క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడాను. ‘మీటూ’ ఉద్యమం ముఖ్య ఉద్దేశం ‘నేమ్ అండ్ షేమ్’. అంటే.. స్త్రీల పట్ల తప్పుగా ప్రవర్తించిన వారి పేరు బయటపెట్టి, పరువు తీయడం. అలా చేస్తే భవిష్యత్తులో మరొకరు ఆ తప్పు చేయడానికి భయపడతారు. పాత తరం హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో కామన్ అని పాపం తలవొంచి ఉండొచ్చు. అందర్నీ అనడంలేదు. కానీ ఇప్పుడు మేం మార్పు తీసుకొస్తే, భవిష్యత్తు తరం వాళ్లు హాయిగా పని చేసుకునే వాతావరణం ఉంటుంది. బ్యాగ్రౌండ్ ఉన్నవాళ్లు.. లేనివాళ్లు అని ఉండదు. పవర్‌ని తప్పుగా వాడుకోవాలనుకున్నవాళ్లు ఎవర్నీ వదలరు. ప్రశ్నించే అలవాటు, అనిపించింది బయటకు చెప్పే స్వభావం నాకు చిన్నప్పటి నుంచే అలవడింది. తప్పు ఎవరిదైతే వాళ్ల వైపు వేలు ఎత్తి చూపించడానికి భయపడను. అది మా నాన్నగారు అయినా సరే. ∙మరో ఐదేళ్లలో మిమ్మల్ని ఎక్కడ ఊహించుకుంటున్నారు అని అడగ్గా – ‘‘రాజకీయాల్లో. తప్పకుండా రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం ఉంది. జయలలితగారి వారసురాలు అనిపించుకోవాలనుంది. జయలలితగారు రాష్ట్రాన్ని పాలించిన తీరు, విధానం, ఆమె జర్నీ కచ్చితంగా స్ఫూర్తినిస్తుంది. ఆవిడ మనల్ని వదిలి వెళ్లాక తమిళనాడు రాజకీయాల్లో ఒక శూన్యం ఏర్పడింది. దాన్ని నింపేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. చూద్దాం ఏమౌతుందో. కమల్ హాసన్‌గారు, రజనీకాంత్గారిలో ఎవరు గెలుస్తారు? అని ప్రశ్నించగా నవ్వి ఊరుకున్నారు. ∙విశాల్‌తో నేను డేటింగ్ చేయడం లేదు. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. ఒకవేళ విశాల్‌కి పెళ్లి అయినా కూడా మేం ఇప్పటిలానే బెస్ట్ ఫ్రెండ్స్‌లా ఉంటాం. తను నన్ను సోల్‌మేట్ అనడానికి కారణం మేం అంత మంచి ఫ్రెండ్స్ కావ డమే. -
వరలక్ష్మీ నా సోల్‌మేట్ : విశాల్
‘‘సాధారణంగా సీక్వెల్ అనగానే మొదటి సినిమాకు మించి ఉండాలని ప్రేక్షకుడు కోరుకుంటాడు. అది ఇచ్చామనే అనుకుంటున్నాం. సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఏ హీరో అయినా బీ, సీ సెంటర్స్‌లో ఫాలోయింగ్ క్రియేట్ చేయాలని అనుకుంటాడు. ‘పందెం కోడి’ సిరీస్ నాకు ఆ మార్కెట్‌ని ఏర్పరిచింది’’ అని విశాల్ అన్నారు. లింగుస్వామి దర్శకత్వంలో విశాల్, కీర్తీ సురేశ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘పందెం కోడి 2’. తెలుగులో ‘ఠాగూర్’ మధు రిలీజ్ చేశారు. దసరా సందర్భంగా విడుదలైన ఈ సినిమా విజయం పట్ల హీరో విశాల్ ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా పలు విశేషాలు పంచుకున్నారు. ► తెలుగు, తమిళం ఆడియన్స్‌కు నేటివిటీ ఒక్కటే తేడా. సినిమా బావుంటే ఆదరిస్తారు. ‘పందెంకోడి 3’ పార్ట్ కూడా ఉంటుంది. ఇదివరకటిలా పదమూడేళ్లంటే కష్టం. మాకు వయసు అయిపోతుంది. త్వరగా మూడో పార్ట్ వర్కౌట్ చేయమని లింగుస్వామికి చెప్పాను (నవ్వుతూ). ► ప్రస్తుతం టెలివిజన్ యాంకర్‌గా ‘నామ్ ఒరువర్’ అనే కార్యక్రమం చేస్తున్నాను. సహాయం కావాలనుకునేవాళ్లకు, సహాయం చేయాలనుకునేవాళ్లకు ఈ షో ద్వారా ఓ ప్లాట్‌ఫారమ్ క్రియేట్ చేశాం అనిపిస్తోంది. ► నా నెక్ట్స్ ప్రాజెక్ట్స్ అన్నీ సీక్వెల్సే ఉన్నాయి. ‘డిటెక్టీవ్, అభిమన్యుడు, పందెం కోడి’.. ఏది ఫస్ట్ స్టార్ట్ అవుతుందో చెప్పలేను. ప్రస్తుతం ‘టెంపర్’ రీమేక్ చేస్తున్నాను. ఇది వరకూ చాలా రీమేక్ ఆఫర్స్ వచ్చాయి. ‘మిర్చి, అత్తారింటికి దారేది’ ఇలా చాలా సినిమాలు ఉన్నాయి. కానీ ‘టెంపర్’ ఇప్పుడు చెప్పాల్సిన కథ. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న పరిస్థితులకు బావుంటుంది అని ఎంచుకున్నాను. రీమేక్ చేస్తే తెలుగు మార్కెట్ ఉండదనే భయం లేదు. నా అదృష్టం ఏంటంటే నా దర్శకులందరూ అద్భుతమైన నటులు. వాళ్లు చెప్పింది చేసుకుంటూ వెళ్లిపోతా. ► ప్రస్తుతం ‘మీటూ’ ఉద్యమం జరుగుతోంది. దానికి సంబంధించి ఇండస్ట్రీ పరంగా తగిన చర్యలు తీసుకుంటున్నాం. కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం. కొత్తవాళ్లకు గైడెన్స్, కౌన్సిలింగ్ ఇవ్వనున్నాం. నేరం జరిగినప్పుడు మాట్లాడకపోవడం కూడా నేరమే. ఓసారి అమలాపాల్‌కు ఇలాంటి సమస్యే ఎదురైతే వెంటనే నాకు చెప్పింది. మేం స్పందించి ఆ వ్యక్తిని అరెస్ట్ చేయించాం. వేధింపులకు గురైన అమ్మాయిలు ధైర్యంగా ముందుకు రావాలి. అయితే ‘మీటూ’ని పక్కదోవ పట్టించకూడదు. ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలు కూడా ఉంటే మంచిది. ఎందుకంటే అప్పుడు ‘మీటూ’ దుర్వినియోగం అయ్యే అవకాశం ఉండదు. ► గవర్నమెంట్ తలుచుకుంటే పైరసీని ఆపగలదు. కానీ ఆ ఒక్క అడుగు వేయకుండా ఏం ఆపుతుందో అర్థం కావడం లేదు. ఇది వరకు బెదిరింపులకు కంగారు పడే వాళ్లు. ఇప్పుడు వాళ్లకు ఆ బెదిరింపులు కూడా అలవాటు అయిపోయాయి. ► రాబోయే ఎన్నికల గురించి అడగ్గా – ‘‘డబ్బులు తీసుకోకుండా ఓటు వేయడానికి రెడీ అవుతున్నాను (నవ్వుతూ). ఒకసారి ఎన్నికల్లో నిలబడితే నామినేషన్ క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత బై ఎలక్షనే క్యాన్సిల్ చేసేశారు. యువత కూడా రాజకీయాల్లోకి రావాలి. రాజకీయ నాయకులు సరిగ్గా పనిచేయడం లేదు అనిపించినప్పుడు మేం రాజకీయాల్లోకి రావాలి అనుకుంటాం. ఇంట్లో కూర్చొని విమర్శిస్తే పనులు జరగవు. బయటకొచ్చి నిలబడితేనే మార్పు కనిపిస్తుంది. ► నటుడిగా, నిర్మాతగా, నడిగర్ సంఘం ప్రెసిడెంట్‌గా బాధ్యతలు ఎక్కువ అయ్యాయి. నిద్ర తక్కువైంది. బిల్డింగ్ కట్టిన తర్వాతే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. అది నా కల. అది కళ్లారా చూసుకున్నాకే పెళ్లి. వరలక్ష్మీ నా బెస్ట్ ఫ్రెండ్, సోల్‌మేట్. లవ్ మ్యారేజే చేసుకుంటాను.. అయితే ఎప్పుడో చెప్పలేను. కరుణానిధిగారి జ్ఞాపకార్థం ఫిబ్రవరిలో ఓ షో చేసి, దానితో ఓ గొప్ప నివాళి ప్లాన్ చేశాం. -
వరూ... వచ్చేసింది!
బెంగళూరులో పుట్టి చెన్నైలో పెరిగిన వరలక్ష్మి మైక్రోబయాలజీ, బిజినెస్మేనేజ్మెంట్ చదువుకుంది. తమిళంలో తన తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించిన వరలక్ష్మి హీరో శరత్‌కుమార్ ముద్దుల తనయ. విశాల్ ‘పందెంకోడి–2’తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన వరలక్ష్మి శరత్‌కుమార్ గురించి కొన్ని ముచ్చట్లు... లాటిన్ అమెరికా డ్యాన్సర్ నటన మీద ఎప్పటి నుంచో ఆసక్తి ఉంది. ముంబైలోని ‘అనుపమ్ఖేర్స్ యాక్టింగ్ స్కూల్’లో నటనలో మెళకువలు నేర్చుకున్న వరలక్ష్మికి డ్యాన్స్‌లో మాంచి టాలెంట్ ఉంది. తొలి సినిమా ‘పోడా, పొడి’లో శింబుతో పోటీ పడి డ్యాన్స్ చేసింది. శింబు హిప్ హప్లో టాప్ అయితే, వరూ లాటిన్ అమెరికన్ డ్యాన్స్‌లో టాప్. సామాజికంగా... సెంటిమెంట్లు, విధిరాత మీద వరలక్ష్మికి పెద్దగా నమ్మకం లేదు. సామాజిక విషయాలపై స్పందించడంలో ముందుండటానికి ఇష్టపడుతుంది. తానేదో తన ప్రపంచమేదో అన్నట్లు కాకుండా సమాజంలో జరుగుతున్న పరిణామాలను పట్టించుకోవడంతో పాటు ఉద్యమాలతో మమేకమవుతుంటుంది. ‘మీ టూ’ ఉద్యమానికి ఆమె పూర్తి మద్దతుగా నిలిచింది. పురుషాధిక్యభావజాలాన్ని వ్యతిరేకిస్తుంది. కాస్త భిన్నంగా... కొత్త భాషలను నేర్చుకోవడంలో వరూ మంచి నేర్పరి. తెలుగు, తమిళ, మలయాళి, ఫ్రెంచ్ భాషలలో ప్రవేశం ఉంది. గ్లామర్ పాత్రలు మాత్రమే చేయాలనుకోవడం లేదు. నెగటివ్ రోల్ అయినా సరే, మూసపోసిన పాత్రల్లో కాకుండా భిన్నమైన, సవాలుగా నిలిచే పాత్రల్లో నటించాలనుకుంటుంది వరలక్ష్మి. తెగ నచ్చేసింది కొందరు నటిస్తే వాళ్లు మాత్రమే కనిపిస్తారు. కొందరు నటిస్తే పాత్ర మాత్రమే కనిపించి ‘శబ్భాష్’ అనిపించుకుంటారు. వరలక్ష్మికి కూడా ఇలాంటి ప్రశంస దక్కింది. ‘పందెంకోడి–2’లో ఆమె నటన డైరెక్టర్ లింగుస్వామికి తెగనచ్చేసిందట. ‘నేను అనుకున్నదానికంటే చాలా గొప్పగా నటించావు’ అని ప్రశంసించి నూటికి నూరు మార్కులు వేశాడు. అవును... ఏదో ఒకరోజు ఎప్పటికైనా డైరెక్టర్ కావాలనేది వరలక్ష్మి కల. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో తప్పనిసరిగా డైరెక్షన్ చేస్తాను అంటుంది. హార్డ్‌కోర్ థ్రిల్లర్స్, గ్యాంగ్‌స్టర్ సినిమాలు చేయడం అంటే ఇష్టమట. ఇప్పటికే ఆమె దగ్గర కొన్ని ఐడియాలు రెడీగా ఉన్నాయి. వరూ మెగాఫోన్ పట్టడమే ఆలస్యం అవి వెండితెర మీదికి వస్తాయన్నమాట. అమ్మ అంటే ఉక్కుమహిళ జయలలిత బయోపిక్‌లో శశికళ పాత్రను తిరస్కరించడం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు... ‘ఒకవేళ సినిమా చేయాల్సివస్తే అమ్మ పాత్రే చేస్తాను. మహిళాలోకానికి ఆమె స్ఫూర్తి. జ్ఞానం, ధైర్యం, తెలివితేటలు ఆమెను ఉక్కుమహిళగా నిలిపాయి’ అంటుంది వరూ. ఏదో సినిమా కార్యక్రమంలో వరూ చేసిన డ్యాన్స్ అమ్మ జయకు నచ్చేసి మెచ్చుకుందట. ఇదొక మధురజ్ఞాపకం అంటుంది వరూ. కవర్ ఫొటో: శివ మల్లాల -
పెళ్లి విషయంలో విశాల్‌కి వరలక్ష్మి సలహా..!
త్వరగా పెళ్లి చేసుకో... కాలం గడిచిపోతే ఆ తరువాత ఎవరూ పిల్లనివ్వరు. ఈ మాట ఎవరు అన్నారో తెలుసా? కోలీవుడ్‌లో ప్రేమ వదంతులను ఎదుర్కొంటున్న వారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో నటుడు విశాల్, నటి వరలక్ష్మీశరత్కుమార్ల జంట ఒకరు. వీరిద్దరి గురించి ఇంతకు ముందు చాలా వదంతులు హల్చల్ చేశాయి. ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని, ఆ తరువాత మనస్పర్థల కారణంగా విడిపోయారని లాంటి చాలా వదంతులు వైరల్ అయ్యాయి. అయితే అవి నిజంగా వదంతులేనని విశాల్, వరలక్ష్మి నిరూపిస్తున్నారు. వాస్తవానికి విశాల్, వరలక్ష్మి మంచి ఫ్రెండ్స్. ఈ విషయాన్ని నటి వరలక్ష్మి మరోసారి స్పష్టం చేసింది. విశాల్ కథానాయకుడిగా నటించి సొంతంగా నిర్మించిన తాజా చిత్రం సండైకోళి–2(తెలుగులో పందెం కోడి 2). ఇందులో ఆయనకు జంటగా కీర్తీసురేశ్ నటించగా ప్రతినాయకిగా నటి వరలక్ష్మి నటించారు. ఈ చిత్రం గురువారం తెరపైకి వచ్చింది. కాగా వరలక్ష్మి ఒక టీవీచానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటుడు విశాల్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అన్న ప్రశ్నకు బదులిస్తూ ఈ ప్రశ్నను తానూ ఆయన్ను పలుమార్లు అడిగినట్లు చెప్పింది. ఇలాకాలం గడిచిపోతే ఆ తరువాత పెళ్లి చేసుకుందామన్నా ఎవరూ పిల్లను ఇవ్వరు అని కూడా చెప్పానని అంది. విశాల్ మాత్రం తాను నడిగర్‌సంఘం భవన నిర్మాణం తరువాతనే పెళ్లి చేసుకుంటాననే విషయంలో దృఢంగా ఉన్నారని చెప్పింది. తన విషయానికి వస్తే తాను విశాల్‌కు సినిమాలో ఎప్పుడూ ప్రతినాయకినేనని, నిజజీవితంలో మంచి స్నేహితురాలినని చెప్పుకొచ్చింది. మరి ఇకపై కూడా ఈ జంట స్నేహితులుగానే కొనసాగుతారా, సడన్‌గా పెళ్లికి సిద్ధం అయ్యామనే షాకింగ్ ప్రకటన చేస్తారా? అన్నది చూద్దాం. ప్రస్తుతానికి మాత్రం నటి వరలక్ష్మి చేతి నిండా చిత్రాలతో ఎడాపెడా నటించేస్తోంది. ఈ అమ్మడు మరోసారి నటుడు విజయ్‌తో విలనీయం ప్రదర్శిస్తున్న సర్కార్ చిత్రం దీపావళికి సందడి చేయడానికి ముస్తాబవుతోంది. -
పండగ పందెం
-
కోర్టుకు హాజరైన విశాల్
నటుడు విశాల్ బుధవారం చెన్నై, ఎగ్మూర్ కోర్టుకు హాజరయ్యారు. సేవా పన్ను శాఖ ఆధికారులు నటుడు విశాల్ కోటి రూపాయల వరకూ సేవా పన్ను చెల్లించని కారణంగా 2016 ఆయనకు సమన్లు పంపారు. ఈ విషయమై విశాల్‌ను నేరుగా సేవా పన్ను శాఖ కార్యాలయానికి హాజరు కావలసిందిగా ఆదేశించారు. విశాల్ హాజరు కాలేదు. ఆయన ఆడిటర్, న్యాయవాది మాత్రమే హాజరవుతున్నారు. దీంతో సేవా పన్ను శాఖాధికారులు చెన్నై, ఎగ్మూర్‌లోని ఆర్థికశాఖా విభాగం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు బుధవారం కోర్టులో విచారణకు రావడంతో నటుడు విశాల్ ప్రత్యక్షంగా హాజరయ్యారు. విశాల్ నటించి, నిర్మించిన సండైకోళి 2 (తెలుగులో పందెం కోడి 2) చిత్రం గురువారం తెరపైకి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో విశాల్ కోర్టుకు హాజరవడం ఆయన అభిమానుల్ని కలవరపెట్టింది. అయితే ఈ కేసు విషయంలో విశాల్ తరఫు న్యాయవాదులు ఏ.చార్లెస్ డావిన్, ఎస్.ప్రవీణ్‌కుమార్ ఒక ప్రకటనలో పేర్కొంటూ బుధవారం నటుడు విశాల్ చెన్నై, ఎగ్మూర్ కోర్టుకు హాజరయ్యారని, అయితే అది ఫార్మాలిటీ కోసమేనని చెప్పారు. నిజానికి విశాల్ గత 12నే కోర్టుకు వచ్చి వివరణ ఇచ్చారన్నారు. సేవా పన్ను విషయంలో ఏమైనా చెల్లించాల్సి ఉంటే ఈ నెల 26న చెల్లిస్తామని కోర్టుకు చెప్పినట్లు విశాల్ తరపు న్యాయవాదులు తెలిపారు. -
‘పందెం కోడి 2’ మూవీ రివ్యూ
టైటిల్ : పందెం కోడి 2 జానర్ : యాక్షన్ డ్రామా తారాగణం : విశాల్, కీర్తి సురేష్, రాజ్ కిరణ్, వరలక్ష్మీ శరత్‌కుమార్ సంగీతం : యువన్ శంకర్ రాజా దర్శకత్వం : లింగుసామి నిర్మాత : విశాల్ కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ సొంతం చేసుకున్న విశాల్, ఈ సారి ఓ సీక్వెల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 2005లో రిలీజ్ అయి తెలుగులో కూడా మంచి విజయం సాధించిన పందెంకోడి సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన పందెం కోడి 2తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. 13 ఏళ్ల తరువాత తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ సీక్వెల్ తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది..? విశాల్ నటిస్తూ నిర్మించిన పందెంకోడి 2తో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడా..? కథ ; రాజా రెడ్డి (రాజ్ కిరణ్) కడప జిల్లాలోని ఎన్నో గ్రామాలను తన కంటి చూపుతో శాసించే పెద్ద మనిషి. ఏడేళ్ల క్రితం వీరభద్ర స్వామి జాతరలో జరిగిన గొడవలో భవానీ(వరలక్ష్మీ శరత్ కుమార్) భర్త హత్యకు గురవుతాడు. తన భర్తను చంపిన వారి కుటుంబంలో అందరినీ చంపేసిన భవానీ మనుషులు రాజా రెడ్డి అడ్డుపడటంతో గోపి అనే కుర్రాన్ని మాత్రం చంపలేకపోతారు. అందుకే ఆ కుర్రాన్ని కూడా జాతరలోనే చంపి పగ తీర్చుకోవాలని ఎదురుచూస్తుంటుంది భవానీ. ఏడేళ్లుగా జాతర చేయకపొవటంతో ఊళ్లల్లో కరువు తాండవిస్తుంది. దీంతో ఈ సారి ఎలాగైనా జాతర చేయాలని అన్ని ఊళ్ల పెద్దలను ఒప్పించి జాతర పనులు మొదలు పెడతాడు రాజా రెడ్డి. ఏడేళ్లుగా ఈ గొడవలకు దూరంగా ఉన్న రాజా రెడ్డి కొడుకు.. బాలు(విశాల్) కూడా జాతర కోసం ఊరికి వస్తాడు. జాతర మొదలైన నాలుగో రోజు గోపిని కాపాడే ప్రయత్నాల్లో రాజారెడ్డి గాయపడతాడు. ఈ విషయం ఊరి ప్రజలకు తెలిస్తే ఒక్కరిని కూడా బతకనివ్వరని భయంతో ఊళ్లో జనాలకు రాజా రెడ్డి మీద దాడి జరిగిన విషయాన్ని చెప్పుకుండా దాచిపెట్టి జాతర ఆగకుండా జాగ్రత్త పడతాడు బాలు. జాతర పూర్తయ్యే వరకు బాలు అసలు విషయం ఊరి ప్రజలకు తెలియకుండా ఆపగలిగాడా..? రాజా రెడ్డి మాట ఇచ్చినట్టుగా బాలు, గోపి ప్రాణాన్ని కాపాడాడా..? అనుకున్నట్టుగా జాతర సజావుగా జరిగిందా..? చివరకు భవానీ కథ ఎలా ముగిసింది..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; విశాల్ మరోసారి తనదైన మాస్ యాక్షన్‌తో మెప్పించాడు. పందెం కోడి తొలి భాగంతో పోలిస్తే ఈ సినిమాలో విశాల్ నటన, యాక్షన్ అన్ని సూపర్బ్ అనిపిస్తాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్‌లో విశాల్ నటన ఆకట్టుకుంది. హీరోయిన్గా కీర్తి సురేష్‌కు మరో మంచి పాత్ర దక్కింది. తను గతంలో చేయని డిఫరెంట్ క్యారెక్టర్లో కీర్తి ఆకట్టుకుంది. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆడియన్స్‌ను అలరించింది. రాజా రెడ్డి పాత్రలో రాజ్‌కిరణ్ ఒదిగిపోయారు. ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్ ఆ పాత్రకు మరింత హుందాతనం తీసుకువచ్చాయి. నెగెటివ్ రోల్ వరలక్ష్మీ నటన సూపర్బ్. వరలక్ష్మీ లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ కూడా సినిమాకు ప్లస్ అయ్యాయి. ఇతర నటీనటులంతా తమిళ వారే కావటంతో తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ కావటం కాస్త కష్టమే. విశ్లేషణ : 2005లో పందెం కోడి సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న లింగుస్వామి సీక్వెల్ లో కాస్త తడబడ్డాడు. మరీ అవుట్ డేటెడ్ కథా కథనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. తెలుగులో ఈ తరహా ఫ్యాక్షన్ కథలు గతంలో చాలానే వచ్చాయి. అయితే విశాల్ ఇమేజ్, బాడీ లాంగ్వేజ్ సినిమాకు ప్లస్ అయ్యాయి. సినిమా అంతా కేవలం వారం రోజులు పాటు జరిగే ఓ జాతరకు సంబంధించిన కథ కావటంతో చాలా సన్నివేశాలు నెమ్మదిగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. విశాల్, కీర్తి సురేష్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ అలరిస్తాయి. యువన్ శంకర్ రాజా సంగీతం ఆశించిన స్థాయిలో లేకపోవటం నిరాశపరిచే అంశమే. కేఏ శక్తివేల్ సినిమాటోగ్రఫి సినిమాకు పెద్ద ఎసెట్. జాతర వాతావరణాన్ని, యాక్షన్ ఎపిసోడ్స్‌ను అద్భుతంగా తెరమీద చూపించారు. ఎడిటింగ్, ఆర్ట్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. విశాల్ నిర్మాతగానూ మంచి మార్కులు సాధించాడు. సినిమా అంతా జాతర వాతావరణంలో చిత్రీకరించటం అంటే మామూలు విషయం కాదు. ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. విశాల్ ఏ మాత్రం ఖర్చుకు వెనకాడకుండా భారీ బడ్జెట్‌తో సినిమాను రూపొందించాడు. ప్లస్ పాయింట్స్ ; విశాల్ నటన యాక్షన్ ఎపిసోడ్స్ నిర్మాణ విలువలు మైనస్ పాయింట్స్ ; రొటీన్ స్టోరి నేటివిటి సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ సంగీతం సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
అరవింద సమేత.. నాన్–బాహుబలి రికార్డు!
అరవింద ఆల్రెడీ మెప్పించింది.. పండగ మార్కులు కొట్టేసింది.ఈ రోజు మరో రెండు సినిమాలకు తోరణాలు రెడీ అయ్యాయి. అభిమానులకు ఇంతకు మించి పండగ ఏముంటుంది? మూడు సినిమాలు! ఒకటి హిట్టు, రెండు మంచి టాపిక్. ఎంజాయ్ ది సినిమా దసరా. కుటుంబ సమేతంగా... ‘కడప కోటిరెడ్డి సర్కిల్ నుండి పులివెందుల పూల అంగళ్ల దాక .. కర్నూల్ కొండారెడ్డి బురుజు నుండి అనంతపూర్ క్లాక్ టవర్ దాకా.. బళ్లారి గనుల నుండి బెలగావ్ గుహల దాకా తరుముకుంటూ వస్తా తల తీసి పారేస్తా’... పవర్ఫుల్ డైలాగ్.‘యుద్ధం చేసే సత్తా లేనివాడికి శాంతి గురించి మాట్లాడే హక్కు లేదు’.. అర్థవంతమైన డైలాగ్.. ‘పాలిచ్చి పెంచిన తల్లులకు పాలించడం ఓ లెక్కా’ ఆలోచింపజేసే డైలాగ్... ‘అరవింద సమేత వీర రాఘవ’లో ఈ డైలాగ్స్ చాలు.. ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలాంటిదో చెప్పేయడానికి. హీరో అంటే విలన్‌తో హోరాహోరీగా తలపడాలి. ఫర్ ఎ చేంజ్ ‘శాంతి’ మార్గం అంటే.. పైగా ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో ఆ మాట అంటే? సినిమా చప్పగా ఉంటుంది. కానీ హీరోతో ఆ మాట అనిపించి, అభిమానులకు కావాల్సిన యాక్షన్‌ని కూడా చూపించారు త్రివిక్రమ్. అందుకే ‘అరవింద సమేత వీర రాఘవ’ భారీ ఎత్తున కలెక్షన్లు రాబడుతోందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. దసరా పండగకి వారం ముందే ఈ సినిమా విడుదలై, ఎన్టీఆర్ అభిమానులకు పండగని ముందే తెచ్చింది. దాదాపు 85 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బయ్యర్లను ‘సేఫ్ జోన్’లో ఉంచుతుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఎన్టీఆర్ నటన, త్రివిక్రమ్ డైలాగ్స్, టేకింగ్.. అన్నీ కుదిరిన మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని చూస్తున్నారని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. గత గురువారం విడుదలైన ఈ సినిమా ఈ మంగళవారం సెకండ్ షో కలెక్షన్లు వరకూ ట్రేడ్ వర్గాలు చెప్పిన ప్రకారం ఈ విధంగా... – ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ కలెక్షన్స్ – 115 కోట్లు. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి వచ్చిన షేర్ 55 కోట్లు కాగా వరల్డ్ వైడ్ షేర్ 74 కోట్లు. ఓవర్సీస్ 12 కోట్లకు అమ్మితే మంగళవారం వరకు 11కోట్ల 30 లక్షలు రాబట్టింది. నైజాం హక్కులను ‘దిల్’ రాజు 18 కోట్లకు కొన్నారు. ఆయన ఫుల్ సేఫ్‌లో ఉన్నారట. ఇప్పటికే గుంటూరు, సీడెడ్, వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లంతా సేఫ్ అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇంకా వైజాగ్, కృష్ణా, ఈస్ట్ గోదావరి, నెల్లూరు, కర్ణాటక బయ్యర్లు ఈ శుక్రవారం నుండి లాభాల బాటలో ఉంటారని ట్రేడ్ వర్గాల అంచనా. ఇవే కాకుండా ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్‌ను, శాటిలైట్ రైట్స్‌ను దాదాపు 45 కోట్లకు అమ్మారట చిత్రనిర్మాతలు. మొత్తం మీద ‘అరవింద సమేత...’ చిత్రబృందానికి దసరా పండగే పండగ. ‘బాహుబలి’ తర్వాత! ‘అరవింద సమేత...’ ఓపెనింగ్ వీకెండ్ సేల్స్‌లో నాన్–బాహుబలి రికార్డును సాధించినట్లు బుక్ మై షో నిర్వాహకులు అధికారికంగా పేర్కొన్నారు. ‘‘బుక్ మై షోలో ‘అరవిందసమేత’.. చిత్రానికి 12 లక్షల టిక్కెట్స్ సేల్ అయ్యాయి. ఈ ప్లాట్ఫామ్లో ఓపెనింగ్ వీకెండ్ సేల్స్ విషయంలో ‘బాహుబలి–2’ తర్వాత ఈ ప్లేస్ ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రానిదే. తెలుగులో మంచి మంచి సినిమాలు వస్తున్నాయి’’ అని బుక్ మై షో ప్రతినిధి పేర్కొన్నారు. ఇద్దరు మగువల మధ్య... స్కూలైనా, కాలేజైనా, ఆఫీసైనా.. జాయినైన ఫస్ట్ డే అందరూ చేసే ఫస్ట్ పనేంటో తెలుసా... అబ్బాయిల్లో ఎవరు బాగున్నారా? అని అమ్మాయిలు. అమ్మాయిల్లో ఎవరు బాగున్నారా? అని అబ్బాయిలు ఏరుకోవడం. రామ్ లాంటి హుషారైన ఓ కుర్రాడు ఇలాంటి డైలాగ్ చెప్పాడంటే.. ఇంకా అతను ఎవర్నీ ఏరుకోనట్టే. అదేనండీ.. ప్రేమలో పడనట్టే. కానీ అతను అనుపమా పరమేశ్వరన్‌ని చూసి మనసు పారేసుకున్నాడు. ఇంకేముంది ఫాలోయింగ్ స్టార్ట్ చేశాడు రామ్. కానీ ఈజీగా పడితే వాళ్లు అమ్మాయిలు ఎందుకు అవుతారు? పైగా అది వాళ్ల హక్కాయే. ఈ లవ్‌ట్రాక్ అలా ఉండగానే... రామ్ లైఫ్‌లోకి మరో అమ్మాయి ప్రణీత వస్తుంది. ఈ ఇద్దరి అమ్మాయిల మధ్యలో రామ్‌కి ఓ మిడిల్ ఏజ్ వ్యక్తి ప్రకాశ్‌రాజ్ ఫ్రెండ్ అయ్యాడు. కట్ చేస్తే.. ఆ ఫ్రెండ్ రామ్‌కి మావయ్య అవుతాడట. ఆ మావయ్య కూతురే అనుపమ అట. అంటే.. విడిపోయిన కుటుంబాలను కలపడం కోసమే అనుపమాను రామ్ ప్రేమించాడా? ఏమో.. ఈ రోజు థియేటర్స్‌కి వెళ్లి ‘హలో గురు ప్రేమ కోసమే’ చూస్తే తెలుస్తుంది. ‘నేను లోకల్’ ఫేమ్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ‘దిల్’ రాజు ఈ చిత్రాన్ని దాదాపు 20 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారని విశ్వసనీయ వర్గాల సమాచారమ్. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 600 థియేటర్స్‌లో రిలీజ్ కానున్న ఈ చిత్రం ప్రీ–రిలీజ్ బిజినెస్ 28 కోట్లు అయిందని ఇండస్ట్రీ లెక్కలు చెబుతున్నాయి. ‘హలో..’ కొన్ని డైలాగ్స్ ‘‘పెళ్లయిన తర్వాత అమ్మాయి లైఫ్ అమ్మ అవ్వడం వల్ల బాగుంటుంది. పెళ్లికి ముందు అమ్మాయి లైఫ్ నాన్న ఉండటం వల్ల బాగుటుంది’’ – అనుపమ‘‘ఈ సోదంతా చెబితే వినడానికి బాగుంటుంది’’ – రామ్ ‘‘అబద్ధం చెప్పడానికి సిగ్గులేదా?’’ – ప్రకాశ్‌రాజ్‘‘అబద్ధం చెబితే అమ్మాయిలు పుడతారో లేదో తెలీదు కానీ అబద్ధాలు చెబితే మాత్రం అమ్మాయిలు కచ్చితంగా పడతారు’’ – రామ్ ‘‘గుర్తుంచుకోవాలి.. గుర్తుంచుకోవాలి అనే చదువు మాత్రం మర్చిపోతాం. కానీ మర్చిపోవాలి.. మర్చిపోవాలి అని అనుకునే అమ్మాయిని మాత్రం...చచ్చేదాకా మర్చిపోలేం’’ – రామ్ పొట్టేల్ని కాదురా... పులివెందుల బిడ్డని ‘‘నీకు దమ్ముంటే పగ తీర్చుకోవడానికి మళ్లీ మా ఊరికి రా.. చూసుకుందాం’’... విలన్‌కి గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు హీరో. విలన్ కూడా తక్కువోడేం కాదు. పవర్‌ఫుల్లే. మరి.. హీరో ఊరికి విలన్ వెళతాడా? పగ తీర్చుకుంటాడా? పందెంలో గెలిచేది ఎవరు? దసరా పండగకి తెలిసిపోతుంది. దసరా బాక్సాఫీస్ బరిలోకి పందెం కోడిలా దూసుకొచ్చారు విశాల్. కెరీర్ స్టార్టింగ్‌లో విశాల్ చేసిన మంచి మాస్ మాసాలా మూవీ ‘పందెం కోడి’. ఈ సినిమాకి సీక్వెల్ ‘పందెం కోడి–2’. పార్ట్ 2 గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ పార్ట్ కథని గుర్తు చేసుకుందాం.హీరో విశాల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి, వేరే ఊళ్లో ఉన్న తన ఫ్రెండ్ ఇంటికి వెళతాడు. ఆ ఫ్రెండ్ చెల్లెలు మీరా జాస్మిన్ అందచందాలకు, అల్లరికి పడిపోతాడు. ఇద్దరూ ప్రేమలో పడతారు. చుట్టపు చూపుగా వచ్చిన హీరో మళ్లీ తన ఊరికి ప్రయాణం అవుతాడు. కట్ చేస్తే.. సరిగ్గా బస్ ఎక్కుతున్న సమయంలో ఓ గూండా ఓ వ్యక్తిని చంపడానికి వెంటాడతాడు. అతన్నుంచి ఆ వ్యక్తిని కాపాడి, గూండాని రప్ఫాడిస్తాడు విశాల్. అతనెవరో కాదు.. పేరు మోసిన గూండా. ఊరుకుంటాడా? విశాల్ వివరాలన్నీ అతని స్నేహితుడి కుటుంబం ద్వారా తెలుసుకుని, అతని ఊరెళతాడు. అక్కడికెళ్లాక తెలుస్తుంది.. విశాల్ తండ్రి చాలా పవర్ఫుల్ అని. అయినా విశాల్ కుటుంబాన్ని అంతం చేయడానికి మంచి టైమ్ కోసం ఎదురు చూస్తాడు. గుడి ఉత్సవాల్లో ఆ పని పూర్తి చేయాలనుకుంటాడు. ఒకవైపు విలన్ ప్లాన్‌లో అతనుంటే మరోవైపు రెండు కుటుంబాలూ మాట్లాడుకుని విశాల్‌కి, మీరా జాస్మిన్‌కి పెళ్లి చేయాలనుకుంటారు. గుడి ఉత్సవాలు రానే వచ్చాయి. విలన్ ప్లాన్ ఫెయిలవుతుంది. అప్పుడు హీరో.. దమ్ముంటే మళ్లీ మా ఊరు రా అని విలన్‌తో పందెం కాస్తాడు. 13ఏళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘పందెం కోడి’ కథ ఇది. ఇప్పుడర్థమైంది కదా.. పార్ట్ 2 ఎలా ఉంటుందో? రెండు భాగాలకు లింగుస్వామియే దర్శకుడు. దసరా సందర్భంగా ఇవాళ సినిమా రిలీజవుతోంది. శాంపిల్‌గా రిలీజ్ చేసిన ట్రైలర్, టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ ఎలా ఉందంటే.. ‘కత్తిని చూసి భయపడ్డానికి పొట్టేల్ని కాదురా.. పులివెందుల బిడ్డన‘ఏసేస్తా ఏసేస్తా అని చెప్పడం కాదు.. ఏసెయ్యాలి’.‘రంకెలేస్తూ కుమ్మడానికి వచ్చే ఆంబోతులా ఎంత పొగరుగా ఉన్నాడో చూడండ్రా’, ‘మగాడు నరికితేనే కత్తి నరుకుద్దనుకుంటున్నావా? ఆడది నరికినా నరుకుద్ది రా’‘మా వంశంలోని చివరి రక్తపుబొట్టు ఉన్నంత వరకూ మేము ఉంటాం’.ఇదండీ ట్రైలర్. టీజర్లోనూ ఆకట్టుకునే డెలాగ్స్ ఉన్నాయి.‘‘పవర్ఫుల్ డైలాగ్స్‌తో, పవర్ఫుల్ యాక్షన్‌తో, కుటుంబం మొత్తం చూసే మంచి సెంటిమెంట్‌తో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఫెస్టివల్ ఫీస్ట్‌లా ఉంటుంది’’ అని చిత్రసమర్పకుడు ‘ఠాగూర్’ మధు తెలిపారు. విశాల్, కీర్తీ సురేష్, వరలక్ష్మి శరత్‌కుమార్ కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందింది. 40 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా దాదాపు 60 కోట్లకు అమ్ముడుపోయిందని టాక్.ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2500 థియేటర్లలో విడుదలవుతోందని ‘పందెం కోడి–2’ యూనిట్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. అప్పట్లో మీరా జాస్మిన్ చేసిన అల్లరి అమ్మాయి పాత్రను ‘మహానటి’ ఫేమ్ కీర్తీ సురేష్ చేయడం విశేషం. అలాగే వరలక్ష్మీ శరత్‌కుమార్ పాత్ర అందర్నీ ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుందట. -
నేనంటే హడల్!
చిత్రపరిశ్రమలోని వారు తనంటే భయపడుతున్నారు అంటోంది నటి వరలక్ష్మీశరత్‌కుమార్. ఈ అమ్మడిని సినీరంగంలో ఈ తరం డేరింగ్ లేడీ అని చెప్పవచ్చు. తన మనసుకు అనిపించింది ధైర్యంగా చెబుతూ భావ స్వేచ్ఛను బాగా వాడుకుంటున్న నటి వరలక్ష్మీశరత్‌కుమార్. నటిగా హీరోయిన్ పాత్రలనే చేస్తానని అలాంటి పాత్రల కోసం ఎదురుచూస్తూ కాలాన్ని వృథా చేసుకోకుండా ఎలాంటి పాత్రనైనా చాలెంజ్‌గా తీసుకుని ఆల్‌రౌండర్ నటిగా పేరు తెచ్చుకుంటోంది. ప్రస్తుతం వరలక్ష్మి నటిస్తున్న చిత్రాల్లో విలనిజం ప్రదర్శించే చిత్రాలు చోటుచేసుకున్నాయి. అలాంటి వాటిలో పందెంకోడి 2 ఒకటి. విశాల్ హీరోగా నటించి తన నిర్మాణ సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో కీర్తీసురేశ్ హీరోయిన్గా నటించగా వరలక్ష్మీశరత్‌కుమార్ ప్రతినాయకి పాత్రను పోషించింది. ఈ పాత్రను ఆమె అదరగొట్టిందంటున్నారు. ఈ చిత్రం ద్వారా ఈ సంచలన నటి టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. పందెంకోడి 2 చిత్రం తనకు చాలా ముఖ్యమైనదంటున్న వరలక్ష్మీశరత్‌కుమార్ తాజాగా దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న మీటూ గురించి స్పందిస్తూ దీని గురించి ఇప్పుడు జరుగుతున్న అవగాహన వంటి కార్యక్రమాన్ని తాను ఏడాది క్రితమే సేవ్ శక్తి పేరుతో ప్రారంభించానని చెప్పింది. తాను ఎవరికీ భయపడనంది. ఏ విషయం గురించి అయినా తన అభిప్రాయాన్ని ధైర్యంగా చెబుతానని అంది. అదే విధంగా తప్పు చేసిన వారు ఎవరైనా అందుకు తగిన శిక్ష అనుభవించాల్సిందేనని పేర్కొంది. అరబ్ దేశాల తరహాలో శిక్ష విధానాన్ని ఇక్కడ తీసుకొస్తే మహిళలపై జరిగే అత్యాచారాలు తగ్గుతాయని అంది. ఇకపోతే తన అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తం చేయడం, తన ధైర్యం వంటి చర్యల కారణంగా చిత్ర పరిశ్రమలో ప్రత్యేక మర్యాద, తనను చూస్తే భయం ఉందని భావిస్తున్నానని వరలక్ష్మి పేర్కొంది. ఇది తన నిజాయితీదక్కిన ఫలంగా భావిస్తానని ఈ జాణ అంటోంది. వరలక్ష్మి విలనిజం ప్రదర్శించిన పందెంకోడి 2 చిత్రం గురువారం విడుదల కానుంది.ఇక విజయ్‌తో ఢీ కొంటున్న సర్కార్ చిత్రం దీపావళి పండగకు పేలనుంది. ఇవి కాకుండా మరో అరడజను వరకూ చిత్రాలు వరలక్ష్మీ చేతిలో ఉన్నాయి. -
‘పందెంకోడి’ నా బర్త్‌డే గిఫ్ట్
ఈ పుట్టినరోజు నాకు చాలా ప్రత్యేకం అంటున్నారు కీర్తీసురేశ్. ‘మహానటి’ తో అందరి మనసులు దోచుకున్న కీర్తీసురేశ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ– ‘‘2018 నా జీవితంలో మరచిపోలేని సంవత్సరం. ఈ పుట్టినరోజు స్పెషల్ ఏంటంటే.. నా బర్త్‌డే తర్వాత రోజే నేను నటించిన చిత్రం ‘పందెంకోడి 2’ రిలీజ్ అవుతోంది. సో.. నాకు ఆల్రెడీ బర్త్‌డే గిఫ్ట్ ఓ రోజు ముందు లభించినట్లే అని తెగ ఆనంద పడిపోతున్నారామె. విశాల్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ‘పందెంకోడి 2’లో కీర్తీ సురేశ్ కథానాయిక. ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఠాగూర్’ మధు రేపు(గురువారం) విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా కీర్తీ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో అల్లరి అమ్మాయిగా నటిం చాను. సినిమాల్లోకి రాకముందు నా బర్త్‌డేని ఎప్పుడూ ఫ్రెండ్స్‌తోనే జరుపుకునేదాన్ని. ఇప్పుడు కూడా నేనేమీ మారలేదు. ఈ పుట్టినరోజు కూడా నా స్నేహితులతో కలిసి జరుపుకుంటున్నాను’’ అన్నారు. -
ఆ అర్హత విశాల్‌కి ఉంది
‘‘గొప్ప స్నేహితుడికి అర్థం విశాల్. తనకు నేను చాలా పెద్ద ఫ్యాన్‌ని. పొల్లాచ్చిలో ‘కృష్ణం వందే జగద్గురుమ్’ రెక్కీకి వెళ్లినప్పుడు నాకు రూమ్ లేకపోవడంతో విశాల్ తన రూమ్‌కి తీసుకెళ్లి, బెడ్ నాకు ఇచ్చి, నేలపై పడుకోవడానికి రెడీ అయ్యాడు. పురట్చి దళపతి (విప్లవ సేన నాయకుడు) అని విశాల్‌ను తమిళ ప్రేక్షకులు, అభిమానులు పిలుచుకుంటారు. ఆ పేరు పెట్టుకోవడానికి తనకు అర్హత ఉంది’’ అని డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ అన్నారు. విశాల్ హీరోగా, కీర్తీ సురేశ్, వరలక్ష్మి శరత్‌కుమార్ హీరోయిన్లుగా ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పందెంకోడి 2’. ‘ఠాగూర్’ మధు సమర్పణలో విశాల్, దవళ్ జయంతిలాల్ గడా, అక్షయ్ జయంతి లాల్ గడా నిర్మించిన ఈ సినిమా ఈనెల 18న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను నటి లక్ష్మీప్రసన్న, ఆడియో సీడీలను క్రిష్ విడుదల చేశారు. ఈ వేడుకలో కొంత మంది రైతులకు విశాల్ ఆర్థిక సాయం చేశారు. విశాల్ మాట్లాడుతూ– ‘‘నాన్న జి.కె.రెడ్డిగారు, అన్నయ్య విక్రమ్ కృష్ణగారి వల్లే ఓ నటుడిగా మీ ముందు గర్వంగా నిలబడి ఉన్నా. ‘పందెంకోడి’ ప్రారంభించే ముందు నేను 25 సినిమాలు చేస్తానని అనుకోలేదు. నేను మరో 25 సినిమాలు చేసేలా నా 25వ సినిమా ‘పందెంకోడి 2’ ఉంటుంది. ‘పందెంకోడి 3’ చేయడానికి మళ్లీ 13 ఏళ్లు కాకుండా పదమూడు నెలల్లో ప్రారంభం అవుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా సమర్పకులు ‘ఠాగూర్’ మధుగారు నా తర్వాతి సినిమా నిర్మాత. నా ప్రతి సినిమాకు టికెట్‌పై ఓ రూపాయి రైతులకే ఇచ్చేస్తాను. ఇప్పుడు ప్రతి ఏడాది వంద సినిమాలకు పైగానే రిలీజ్ అవుతున్నాయి. ప్రేక్షకుడు కొనే టికెట్లో ఒక రూపాయిని ప్రభుత్వమే తీసుకుని రైతులకు ఖర్చుపెడితే బావుంటుంది. రైతులు, నిర్మాతలు ఒకటే. నాకు థియేటర్ గుడి.. ప్రేక్షకులే దేవుళ్లు’’ అన్నారు. ‘‘విశాల్, నా కాంబినేషన్లో ‘పందెంకోడి 3’ కూడా చేయాలనుకుంటున్నాం’’ అన్నారు లింగుస్వామి. నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, ‘లగడపాటి’ శ్రీధర్, కె.ఎల్.దామోదర్ ప్రసాద్, రచయిత ఆకుల శివ, కథానాయికలు కీర్తీ సురేశ్, వరలక్ష్మి శరత్‌కుమార్ పాల్గొన్నారు. చిత్ర సమర్పకులు ‘ఠాగూర్’ మధు మాట్లాడుతూ– ‘‘పందెం కోడి’ చిత్రానికి ఇది పర్ఫెక్ట్ సీక్వెల్. ఎత్తుకు పై ఎత్తు వేసి విలన్స్‌ని హీరో ఎలా ఢీ కొన్నాడు అన్నదే కథ. జయాపజయాల నుంచి నేర్చుకోకపోతే ఇండస్ట్రీలో ఉండలేం. డిజిటల్ కంటెంట్‌తో థియేట్రికల్ రెవెన్యూ తగ్గినా డిజిటల్ మార్కెట్లో వచ్చే రెవెన్యూ దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. విశాల్‌తో తమిళంలో ‘టెంపర్’ రీమేక్ చేస్తున్నా. నిఖిల్‌తో చేస్తోన్న ‘ముద్ర’ షూటింగ్ పూర్తి కాబోతోంది’’ అన్నారు. -
‘పందెంకోడి 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్
-
పులిముందు వేషాలా?
‘కత్తిని చూసి భయపడటానికి పొట్టేల్ని కాదురా.. పులివెందుల బిడ్డని’, ‘జాతరలో పులివేషాలు వేయొచ్చు..కానీ, పులిముందే వేషాలు వేయకూడదు’... ‘పందెంకోడి 2’ చిత్రంలోని ఇలాంటి డైలాగులు విశాల్ అభిమానుల్ని అలరిస్తున్నాయి. విశాల్, కీర్తీ సురేష్ జంటగా, వరలక్ష్మీ శరత్‌కుమార్, రాజ్‌కిరణ్ ముఖ్య పాత్రల్లో ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘పందెంకోడి 2’. ‘ఠాగూర్’ మధు సమర్పణలో విశాల్, దవళ్ జయంతిలాల్ గడా, అక్షయ్ జయంతిలాల్ గడా నిర్మించిన ఈ సినిమా దసరా కానుకగా ఈనెల 18న విడుదలవుతోంది. ‘ఠాగూర్’ మధు మాట్లాడుతూ–‘‘ఇటీవల విడుదలైన ‘పందెంకోడి 2’ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. రేపు(ఆదివారం) హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహిస్తున్నాం’’ అన్నారు. -
గొంతు పోయింది!
ఇప్పటి హీరోయిన్లలో కొందరు తమ పాత్రకు తమ గొంతునే వినిపించుకోవాలని అనుకుంటున్నారు. అందుకోసమే కొంచెం కష్టమైనా శ్రద్ధగా పరభాషను నేర్చుకొని డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా ఈ లిస్ట్‌లోకి వరలక్ష్మీ శరత్‌కుమార్ కూడా జాయిన్ అయ్యారు. అంతే కాదు డబుల్ ధమాకా ఇవ్వనున్నారు. విజయ్ హీరోగా తెరకెక్కిన ‘సర్కార్’, విశాల్ ‘పందెం కోడి 2’లో కీలక పాత్రలు పోషిస్తున్నారు వరలక్ష్మీ. ఈ రెండు సినిమాలకు సొంతంగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకున్నారామె. ‘‘డబ్బింగ్ చెప్పీ చెప్పీ గొంతు పోయింది. కానీ దానికి తగ్గ ఫలితం ఉంటుందని అనుకుంటున్నాను. ‘పందెం కోడి 2’ ఈ నెల 18న రిలీజ్ కాబోతోంది. సూపర్‌గా ఉంటుంది’’ అని పేర్కొన్నారు వరలక్ష్మీ శరత్‌కుమార్. ‘సర్కార్’ నవంబర్‌లో రానుంది. -
‘పందెంకోడి 2’ మూవీ స్టిల్స్
-
ఆ చిత్రం కోసం వెయిటింగ్
సినిమా: ఆ బ్రహ్మాండ చిత్రం కోసం వెయిటింగ్ అంటోంది నటి కీర్తీసురేశ్. ఈ బ్యూటీ తొలిరోజుల్లోనే మహానటి సావిత్రి పాత్రకు జీవం పోసి శభాష్ అనిపించుకుంది. ఇకపై సామిత్రి పాత్రలో నటించాలంటే కీర్తీసురేశ్ మినహా మరో నటిని ఊహించుకోవడానికి కూడా సాహసించలేని విధంగా ఆమె పాత్రలో ఒదిగిపోయింది. ఇటీవల విక్రమ్‌కు జంటగా నటించిన సామి సేŠవ్క్ర్ చిత్రం కాస్త నిరాశ పరిచినా, విశాల్‌కు జంటగా నటించిన సండైకోళీ–2, విజయ్ సరసన నటించిన సర్కార్ చిత్రాలు కమర్షియల్‌గా కీర్తీసురేశ్ కేరీర్‌కు ఉపయోగపడతాయనే ఆశాభావంతో ఉంది. సండైకోళీ–2 చిత్రం ఈ నెల 18న తెరపైకి రావడానికి ముస్తాబుతోంది. ఇక సర్కార్ చిత్రం దీపావళికి సందడి చేయనుంది. తాజాగా కీర్తీసురేశ్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బయోపిక్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ జీవిత చరిత్ర అంటే నటి సావిత్రి పాత్ర కీలకంగా ఉంటుంది. ఆ పాత్ర నటి కీర్తీసురేశ్‌నే వరించింది. కాగా తమిళంలో నటుడు శశికుమార్‌కు జంటగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది గానీ, దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇకపోతే చాలా గ్యాప్ తరువాత ఈ బ్యూటీ మాతృభాషలో నటించడానికి రెడీ అవుతోంది. మోహన్‌లాల్ హీరోగా దర్శకుడు ప్రియదర్శిన్ మరక్కార్ పేరుతో ఒక చారిత్రక కథా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది 16వ శతాబ్దానికి చెందిన కురంజిలి మరక్కార్ అనే చరిత్రకారుడి ఇతి వృత్తంగా రూపొందుతున్న చిత్రం. ఇందులో కీర్తీసురేశ్ ఒక ముఖ్య పాత్రలో నటించనుందని తెలిసింది. ఇందులో తను చైనాకు చెందిన నటుడికి జంటగా నటించనున్నట్లు సమాచారం. ఇదిలాఉండగా ఈ ముద్దుగుమ్మ మరో భారీ చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. బాహుబలి సిరీస్ చిత్రాల ఫేమ్ రాజమౌళి తాజాగా జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించడడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఒక హీరోయిన్గా నటించే అవకాశం నటి కీర్తీసురేశ్‌ను వరించినట్లు సమాచారం. ఇప్పుడీ చిత్రంలో నటించడానికి ఈ భామ ఎదురు చూస్తోదంట. -
‘మహానటి’నీ వదలని శ్రీరెడ్డి
తమిళసినిమా : దక్షిణాది సినిమాలో ఒక ఫైర్‌బాంబ్‌గా పేరు తెచ్చుకున్న నటి శ్రీరెడ్డి. ఇప్పుడీమె పేరు ఎత్తితేనే చిత్ర పరిశ్రమలోని కొందరు బెంబేలెత్తిపోతున్నారనే చెప్పాలి. కాస్టింగ్ కౌచ్ అంటూ ముందు టాలీవుడ్లో కలకలం పుట్టించిన శ్రీరెడ్డి తాజాగా కోలీవుడ్‌ను టార్గెట్ చేసింది. ఇక్కడ దర్శకుడు ఏఆర్.మురుగదాస్, నటుడు లారెన్స్ లాంటి ప్రముఖులపై కూడా ఘాటుగా విమర్శలు చేసి ఫైర్ బాంబ్‌గా మారింది. టాలీవుడ్లో రక్షణ లేదు అంటూ చెన్నైలో మకాం పెట్టిన శ్రీరెడ్డి తాజాగా తెరకెక్కుతున్న తన జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న రెడ్డి డైరీ చిత్రంలో నటిస్తోంది. ఇటీవల నటుడు విశాల్ తాను నటించిన సండైకోళి–2 చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపై నటి శ్రీరెడ్డికి అవకాశం రావడం ఆహ్వానించదగ్గ విషయం అని పేర్కొన్నారు. అంతే కాదు ఇకపై ఆమెతో నటించేటప్పుడు అందరూ జాగ్రత్తగా ఉండాలని, ఆమె తన రక్షణ కోసం కెమెరా దగ్గరే ఉంచుకుంటారని అన్నారు. ఆ మాటలకు పక్కనే ఉన్న నటి కీర్తీసురేశ్ నవ్వేసింది. అదే శ్రీరెడ్డికి మండింది. విశాల్‌కు థ్యాంక్స్ చెబుతూ నటి శ్రీరెడ్డి ఇటీవల ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసింది. అందులో నటి కీర్తీసురేశ్ నవ్వడం గురించి పేర్కొంటూ మీ నవ్వు చాలా అసహ్యంగా ఉంది. ఏం చింతించకండి మేడమ్ మీరు ఎప్పుడూ అగ్రస్థానంలో ఉండలేరు. పోరాడేవారి బాధేంటో మీకూ ఒక రోజు తెలుస్తుంది. గుర్తుంచుకోండి. నేనూ మీ నవ్వును మరచిపోను. మీరిప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నట్టున్నారు అని పేర్కొంది. శ్రీరెడ్డి ట్వీట్‌పై కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. అయినా విశాల్ శ్రీరెడ్డి గురించి మాట్లాడినప్పుడు ఆ వేదికపై ఉన్న వారందరూ నవ్వారు. అందులో నటి కీర్తీసురేశ్‌నే శ్రీరెడ్డి టార్గెట్ చేయడం ఏమిటన్న వాదన వినిపిస్తోంది. మరి ఈ అమ్మడి ఫైర్‌పై నటి కీర్తీసురేశ్ ఎలా స్పందిస్తుందో చేడాలి. మొత్తం మీద కోలీవుడ్‌లో మరోసారి శ్రీరెడ్డి రచ్చ మొదలైంది. -
నిర్మాతలు సినిమాకి ఊపిరిలాంటోళ్లు
2005లో విడుదలైన సూపర్‌హిట్ చిత్రం ‘పందెం కోడి’తో అటు తమిళ్లోను ఇటు లె లుగులోను విశాల్ మాస్ హీరో ఇమేజ్ సంపాదించుకున్నారు. పదమూడేళ్ల తర్వాత మళ్లీ ఆ హిట్ ఫీట్‌ని సాధించటానికి రెడీ అయ్యారు చిత్రదర్శకుడు లింగుస్వామి, హీరో విశాల్. ‘పందెం కోడి’కి సీక్వెల్‌గా ఈ హిట్ కాంబినేష్న్లో రూపొందిన ‘పందెం కోడి 2’ అక్టోబర్ 18న తమిళ్, తెలుగులో రిలీజ్ కానుంది. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ పతాకాలపై ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో ప్రముఖ పంపిణీదారుడు నారాయణదాస్ నారంగ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాతో 25 సినిమాలు పూర్తయ్యాయి. నేనీ రోజు మీ (ప్రేక్షకులు) ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే అందుకు కారణం నా తల్లిదండ్రులు, మా అన్నయ్య విశాల్‌కృష్ణ. వారి ప్రోత్సాహంతోనే హీరోగా కెరీర్ ప్రారంభించాను. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులు నన్ను ఇప్పటికీ ఆదరిస్తూనే ఉన్నారు. నా 25 సినిమాల ప్రయాణంలో ప్రతి చిత్రం మంచి విజయాన్ని సాధించాలనే కష్టపడ్డాను. నిర్మాతలు సినిమాలకు ఊపిరిలాంటోళ్లు. ‘పందెం కోడి 2’ కథ విషయానికొస్తే... ఏడు రోజుల పాటు జరిగే జాతర నేపథ్యంలో ఈ సీక్వెల్ రూపొందింది. ‘మహానటి’తో జాతీయ అవార్డు గెలుచుకునే స్థాయిలో నటనను ప్రదర్శించిన కీర్తీ సురేశ్ మా సినిమాలో అద్భుతమైన పాత్రను పోషించింది. ‘పందెం కోడి’ పార్ట్ 3 చేస్తే అందులో కూడా కీర్తీనే హీరోయిన్. వరలక్ష్మీ పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది. రాజ్‌కిరణ్‌గారు చాలా హుందాగా నటించారు. తెలుగులో మా సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్న ‘ఠాగూర్’ మధు గారికి థ్యాంక్స్’’ అన్నారు. లింగుస్వామి మాట్లాడుతూ– ‘‘విశాల్‌లోని ఎన ర్జీ లెవెల్స్‌ను ‘పందెం కోడి’లో చూపించాను. ఈ సీక్వెల్లో కూడా అవి కంటిన్యూ అవుతాయి. ఈ సినిమా నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. సీక్వెల్‌కి ఇంత గ్యాప్ రావటానికి కారణం మీరా జాస్మిన్లా నటించే హీరోయిన్, లాల్లా విలనిజమ్ చూపించే నటులు కోసం వెయిట్ చేయడమే’’ అన్నారు. ‘‘మహానటి’ తర్వాత ఆ రేంజ్లో తృప్తినిచ్చిన చిత్రమిది. అక్టోబర్ 17 నా బర్త్‌డే, సినిమా 18న విడుదలవుతుంది. నా బర్త్‌డేకి పెద్ద గిఫ్ట్‌గా భావిస్తున్నాను’’ అన్నారు కీర్తీ సురేశ్. ‘‘ఇది నాకు స్పెషల్ మూవీ’’ అన్నారు వరలక్ష్మీ. ‘‘విశాల్ అసోసియేషన్‌లో చేస్తున్న తొలి సినిమా ఇది. మొదటి భాగం కంటే రెండో భాగం ఇంకా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు ‘ఠాగూర్’ మధు. నిర్మాతలు కేఎల్ దామోదర్ ప్రసాద్, అనిల్ సుంకర, బీవీయస్ఎన్ ప్రసాద్, సుధాకర్ రెడ్డి, టీయంసి సుమన్, వీరినాయుడు, ముత్యాల రామదాస్ తదితరులు పాల్గొన్నారు. -
‘పందెంకోడి 2’ ట్రైలర్ లాంచ్
-
‘పులి ముందే వేషాలేయకూడదు’
విశాల్, మీరాజాస్మిన్ జంటగా లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన ‘పందెంకోడి’ సినిమా ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. 2005లో విడుదలైన ఈ సినిమా విశాల్ కెరీర్‌కి టర్నింగ్ పాయింట్. ఈ సినిమాతోనే తెలుగులో విశాల్‌కి మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. ఈ చిత్రం విడుదలైన 12ఏళ్ల తర్వాత సీక్వెల్‌గా విశాల్–లింగుస్వామి కాంబినేషన్లో ‘పందెంకోడి 2’ తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైరల్ను రిలీజ్ చేశారు. మాస్ యాక్షన్ తో రూపొందించిన ఈ ట్రైలర్ సినిమా మీద అంచనాలను మరింత పెంచేస్తోంది. విశాల్ సరసన కీర్తీ సురేశ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్‌కుమార్, రాజ్‌కిరణ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
పండగకి పందెం
విశాల్, మీరాజాస్మిన్ జంటగా లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన ‘పందెంకోడి’ సినిమా ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 2005లో విడుదలైన ఈ సినిమా విశాల్ కెరీర్‌కి టర్నింగ్ పాయింట్‌తో పాటు తెలుగులో మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను తీసుకొచ్చింది. ఈ చిత్రం విడుదలైన 12ఏళ్ల తర్వాత సీక్వెల్‌గా విశాల్–లింగుస్వామి కాంబినేషన్లో ‘పందెంకోడి 2’ తెరకెక్కుతోంది. ఠాగూర్ మధు సమర్పణలో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ పతాకాలపై తెరకెక్కుతోన్న ‘పందెం కోడి 2’ చిత్రం ట్రైలర్‌ని రేపు (శనివారం) విడుదల చేస్తున్నారు. ‘ఠాగూర్’ మధు మాట్లాడుతూ– ‘‘మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రమిది. విజయదశమి కానుకగా అక్టోబర్ 18న సినిమాని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. కీర్తీ సురేశ్, వరలక్ష్మీ శరత్‌కుమార్, రాజ్‌కిరణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్‌రాజా, కెమెరా: కె.ఎ.శక్తివేల్, నిర్మాతలు: విశాల్, దవళ్ జయంతిలాల్ గడా, అక్షయ్ జయంతిలాల్ గడా. -
ఫుల్ ఫ్యామిలీ మూవీ: కీర్తి సురేశ్ ఆశ నెరవేరానా?
సాక్షి, తమిళసినిమా: మనిషి కలలు కనడం ఎంత సహజమో, ఆశపడటం అంతకంటే సహాజం. ఇంతకీ ఈ కహానీ ఎందుకంటారా? యువ నటి కీర్తీసురేశ్ అలాంటి అరుదైన కార్యం కోసం ఆశపడుతోంది. నటిగా ఈ బ్యూటీ కేరీర్ మహానటి చిత్రానికి ముందు ఆ తరువాత అన్నట్టుగా మారిపోయింది. అప్పటి వరకూ కమర్షియల్ చిత్రాలతో విజయపథంలో దూసుకుపోతున్న కీర్తి.. మహానటి చిత్రంతో అభినేత్రి అనేంతగా పేరు తెచ్చుకుంది. ఆ చిత్రంలో నటి సావిత్రి పాత్రలో అవలీలగా ఒదిగిపోయిన కీర్తీసురేశ్ తాజాగా కమర్షియల్ హీరోయిన్ బాణీకి మారిపోయింది. ప్రస్తుతం తను విజయ్‌కు జంటగా సర్కార్, విశాల్ సరసన సండైకోళి-2, విక్రమ్‌తో సామి స్క్వేర్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. వీటిలో విశాల్‌తో రొమాన్స్ చేసిన సండైకోళి-2 చిత్రం వచ్చే నెల తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఆ తరువాత సామీ స్క్వేర్, ఆపై సర్కార్ అంటూ ఈ అమ్మడు నటించిన చిత్రాలు అభిమానులను ఎంటర్టెయిన్ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇవి కాకుండా కొత్త చిత్రాలను ఇప్పటివరకు అంగీకరించని కీర్తీసురేశ్ సినిమా కుటుంబం నుంచి వచ్చిన నటి అన్న విషయం తెలిసిందే. తండ్రి సురేశ్ మాలీవుడ్‌లో ప్రముఖ చిత్ర నిర్మాత, తల్లి మేనక ఒకప్పటి నటి. ఈమె రజనీకాంత్ సరసన పుదుకవితై అనే చిత్రంలో నటించారన్నది గమనార్హం. ఇక కీర్తీ అమ్మమ్మ నటినే. ఆమె ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. ఇటీవల కార్తీ హీరోగా నటించిన ‘కడైకుట్టి సింగం’ చిత్రంలోనూ కీర్తి అమ్మమ్మ నటించారు. తాజాగా చారుహాసన్‌తో కలిసి నటించిన ‘దాదా 87’ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. అదే విధంగా కీర్తీసురేశ్ సోదరి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసింది. ఇంతకీ కీర్తీసురేశ్ ఆశ పడే విషయం ఏమిటంటే.. నాన్న నిర్మాతగా తన అక్క దర్శకత్వంలో రూపొందించే సినిమాలో తానూ, అమ్మా, బామ్మ కలిసి నటించాలనుందని ఉందని కీర్తి పేర్కొంది. కీర్తీకి తన ఆశను నెరవేర్చుకోవడం పెద్ద పనేమీ కాదు. కాబట్టి తన కుటుంబం చేసే చిత్రాన్ని మనం చూసే అవకాశం లేకపోలేదు. అయినా రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా! దర్శకులూ ఇంకెందుకు ఆలస్యం కీర్తీ కుటుంబం కోసం కథకు పదును పెట్టే పనిలో పడిపోతే పోలా! -
బహుమతుల వర్షం
‘పందెం కోడి 2’ టీమ్‌పై బహుమతుల వర్షం కురుస్తోందట. రీసెంట్గా హీరోయిన్ కీర్తీ సురేశ్ ఈ సినిమా టీమ్‌కి గోల్డ్ కాయిన్స్ పంచిన సంగతి తెలిసిందే. తాజాగా హీరో విశాల్, దర్శకుడు లింగుస్వామి కూడా టీమ్ మెంబర్స్‌కు గోల్డ్ కాయిన్స్ పంచిపెట్టారట. లింగుస్వామి దర్శకత్వంలో విశాల్, కీర్తీ సురేశ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సండైకోళి 2’ (పందెం కోడి 2). సూపర్ హిట్ చిత్రం ‘సండైకోళి’కి సీక్వెల్ ఇది. రీసెంట్గా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. వర్క్ చేసిన టీమ్ అందరికీ (సుమారు 150) ఈ సినిమా గుర్తుగా విశాల్, లింగుస్వామి విడి విడిగా గోల్డ్ కాయిన్స్ అందజేశారట. అంతకుముందు కీర్తీ సురేశ్ ఇచ్చారు. దీంతో బహుమతుల వర్షం కురుస్తోందని చిత్రబృందం ఆనందంగా చెప్పుకుంటున్నారు. -
పందెం ముగిసింది
హీరో విశాల్ తెలుగువాడే అయినా తమిళంలో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. తమిళంలో ఆయనకున్న ప్రేక్షకాదరణ, అభిమానుల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘పందెంకోడి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు విశాల్. ఆ చిత్రం విడుదలైన పుష్కర కాలానికి సీక్వెల్‌గా ‘పందెం కోడి 2’ తెరకెక్కించారు. కీర్తీ సురేశ్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్ ఓ కీలకపాత్ర చేశారు. పార్ట్ 1 తెరకెక్కించిన లింగుస్వామి దర్శకత్వంలోనే తెరకెక్కిన ఈ సీక్వెల్ షూటింగ్‌కి ఆదివారం గుమ్మడికాయ కొట్టేశారు చిత్రయూనిట్. ఈ సినిమా అక్టోబర్ 18న విడుదల కానుంది. కాగా విశాల్, సమంత జంటగా మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇరంబుదురై’ (అభిమన్యుడు) సినిమా ఆదివారంతో 100 రోజులు పూర్తి చేసుకోవడం విశేషం. -
‘పందెంకోడి 2’ షూటింగ్ పూర్తి
‘అభిమన్యుడు’ సినిమాతో మంచి హిట్ కొట్టాడు విశాల్. మాస్ యాక్షన్ సినిమాలను చేస్తూ వచ్చిన విశాల్.. డిటెక్టివ్, అభిమన్యుడు సినిమాలతో రూటు మార్చి సక్సెస్ సాధిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం విశాల్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. విశాల్ కెరీర్లో నిలిచిపోయే హిట్ ఇచ్చిన సినిమా పందెంకోడి. ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతన్న విషయం తెలిసిందే. ఆ మధ్య రిలీజ్ చేసిన ‘పందెంకోడి 2’ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీలో మొదటి సాంగ్‌ను రేపు రిలీజ్ చేయనున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాలో వరలక్ష్మి ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. విశాల్ ‘టెంపర్’ తమిళ రీమేక్‌లో నటించనున్న సంగతి తెలిసిందే. Mass Hero @VishalKOfficial's #Sandakozhi2 / #PandemKodi2 shoot completed #Vishal25@dirlingusamy @KeerthyOfficial @varusarath @VffVishal pic.twitter.com/1Z1Cm7rrMW — BARaju (@baraju_SuperHit) 18 August 2018