
‘అభిమన్యుడు’ సినిమాతో మంచి హిట్ కొట్టాడు విశాల్. మాస్ యాక్షన్ సినిమాలను చేస్తూ వచ్చిన విశాల్.. డిటెక్టివ్, అభిమన్యుడు సినిమాలతో రూటు మార్చి సక్సెస్ సాధిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం విశాల్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.
విశాల్ కెరీర్‌లో నిలిచిపోయే హిట్ ఇచ్చిన సినిమా పందెంకోడి. ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతన్న విషయం తెలిసిందే. ఆ మధ్య రిలీజ్ చేసిన ‘పందెంకోడి 2’ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీలో మొదటి సాంగ్‌ను రేపు రిలీజ్ చేయనున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో వరలక్ష్మి ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. విశాల్ ‘టెంపర్’ తమిళ రీమేక్‌లో నటించనున్న సంగతి తెలిసిందే.
Mass Hero @VishalKOfficial's #Sandakozhi2 / #PandemKodi2 shoot completed #Vishal25@dirlingusamy @KeerthyOfficial @varusarath @VffVishal pic.twitter.com/1Z1Cm7rrMW
— BARaju (@baraju_SuperHit) 18 August 2018