‘పందెంకోడి’  నా బర్త్‌డే గిఫ్ట్‌ | Pandemkodi my birthday gift - keerthi suresh | Sakshi
Sakshi News home page

‘పందెంకోడి’  నా బర్త్‌డే గిఫ్ట్‌

Published Wed, Oct 17 2018 12:30 AM | Last Updated on Wed, Oct 17 2018 12:30 AM

Pandemkodi my birthday gift - keerthi suresh - Sakshi

ఈ పుట్టినరోజు నాకు చాలా ప్రత్యేకం అంటున్నారు కీర్తీసురేశ్‌. ‘మహానటి’ తో అందరి మనసులు దోచుకున్న కీర్తీసురేశ్‌ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ– ‘‘2018 నా జీవితంలో మరచిపోలేని సంవత్సరం. ఈ పుట్టినరోజు స్పెషల్‌ ఏంటంటే.. నా బర్త్‌డే తర్వాత రోజే నేను నటించిన చిత్రం ‘పందెంకోడి 2’ రిలీజ్‌ అవుతోంది. సో.. నాకు ఆల్రెడీ బర్త్‌డే గిఫ్ట్‌ ఓ రోజు ముందు లభించినట్లే అని తెగ ఆనంద పడిపోతున్నారామె.

విశాల్‌ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ‘పందెంకోడి 2’లో కీర్తీ సురేశ్‌ కథానాయిక. ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఠాగూర్‌’ మధు రేపు(గురువారం) విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా కీర్తీ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో అల్లరి అమ్మాయిగా నటిం చాను. సినిమాల్లోకి రాకముందు నా బర్త్‌డేని ఎప్పుడూ ఫ్రెండ్స్‌తోనే జరుపుకునేదాన్ని. ఇప్పుడు కూడా నేనేమీ   మారలేదు. ఈ పుట్టినరోజు కూడా నా స్నేహితులతో కలిసి జరుపుకుంటున్నాను’’ అన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement