‘మహానటి’నీ వదలని శ్రీరెడ్డి | Sri Reddy Comments On Keerthy Suresh | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 30 2018 9:07 AM | Last Updated on Sun, Sep 30 2018 10:25 AM

Sri Reddy Comments On Keerthy Suresh - Sakshi

తమిళసినిమా : దక్షిణాది సినిమాలో ఒక ఫైర్‌బాంబ్‌గా పేరు తెచ్చుకున్న నటి శ్రీరెడ్డి. ఇప్పుడీమె పేరు ఎత్తితేనే చిత్ర పరిశ్రమలోని కొందరు బెంబేలెత్తిపోతున్నారనే చెప్పాలి. కాస్టింగ్‌ కౌచ్‌ అంటూ ముందు టాలీవుడ్‌లో కలకలం పుట్టించిన శ్రీరెడ్డి తాజాగా కోలీవుడ్‌ను టార్గెట్‌ చేసింది. ఇక్కడ దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్, నటుడు లారెన్స్‌ లాంటి ప్రముఖులపై కూడా ఘాటుగా విమర్శలు చేసి ఫైర్‌ బాంబ్‌గా మారింది. టాలీవుడ్‌లో రక్షణ లేదు అంటూ చెన్నైలో మకాం పెట్టిన శ్రీరెడ్డి తాజాగా తెరకెక్కుతున్న తన జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న రెడ్డి డైరీ చిత్రంలో నటిస్తోంది. ఇటీవల నటుడు విశాల్‌ తాను నటించిన సండైకోళి–2 చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపై నటి శ్రీరెడ్డికి అవకాశం రావడం ఆహ్వానించదగ్గ విషయం అని పేర్కొన్నారు. అంతే కాదు ఇకపై ఆమెతో నటించేటప్పుడు అందరూ జాగ్రత్తగా ఉండాలని, ఆమె తన రక్షణ కోసం కెమెరా దగ్గరే ఉంచుకుంటారని అన్నారు. 

ఆ మాటలకు పక్కనే ఉన్న నటి కీర్తీసురేశ్‌ నవ్వేసింది. అదే శ్రీరెడ్డికి మండింది. విశాల్‌కు థ్యాంక్స్‌ చెబుతూ నటి శ్రీరెడ్డి ఇటీవల ట్విట్టర్‌లో ఒక ట్వీట్‌ చేసింది. అందులో నటి కీర్తీసురేశ్‌ నవ్వడం గురించి పేర్కొంటూ మీ నవ్వు చాలా అసహ్యంగా ఉంది. ఏం చింతించకండి మేడమ్‌ మీరు ఎప్పుడూ అగ్రస్థానంలో ఉండలేరు. పోరాడేవారి బాధేంటో మీకూ ఒక రోజు తెలుస్తుంది. గుర్తుంచుకోండి. నేనూ మీ నవ్వును మరచిపోను. మీరిప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నట్టున్నారు అని పేర్కొంది. శ్రీరెడ్డి ట్వీట్‌పై కోలీవుడ్‌లో  చర్చనీయాంశంగా మారింది. అయినా విశాల్‌ శ్రీరెడ్డి గురించి మాట్లాడినప్పుడు ఆ వేదికపై ఉన్న వారందరూ నవ్వారు. అందులో నటి కీర్తీసురేశ్‌నే శ్రీరెడ్డి టార్గెట్‌ చేయడం ఏమిటన్న వాదన వినిపిస్తోంది. మరి ఈ అమ్మడి ఫైర్‌పై నటి కీర్తీసురేశ్‌ ఎలా స్పందిస్తుందో చేడాలి. మొత్తం మీద కోలీవుడ్‌లో మరోసారి శ్రీరెడ్డి రచ్చ మొదలైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement