
కీర్తీ సురేశ్, విశాల్
ఆదివారం హాలీడే తీసుకోకుండా వర్క్ చేస్తున్నారు విశాల్, కీర్తీ సురేశ్. ప్రస్తుతం వీరిద్దరు ‘సండై కోళి 2’ (‘పందెం కోడి 2’)లో యాక్ట్ చేస్తున్నారు. 2005లో వచ్చిన ‘పందెం కోడి’కి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తు్తన్నారు. దర్శకుడు ప్యాకప్ చెప్పగానే ఇంటికి వెళ్లిపోకుండా సెట్లో సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు విశాల్, కీర్తీ. ఎవరిదైనా బర్త్‌డేనా? అంటే.. కాదు. ఇవి సక్సెస్ సెలబ్రేషన్స్.
‘అభిమన్యుడు’తో విశాల్, ‘మహానటి’తో కీర్తీ సురేశ్ సూపర్ హిట్స్ అందుకున్నారు. అందుకే ఈ డబుల్ సెలబ్రేషన్స్‌ను ప్లాన్ చేశారు. విశేషం ఏంటంటే ఈ రెండు సినిమాలు ఇటు తెలుగు అటు తమిళంలోనూ హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. ‘సండై కోళి 2’ దసరాకు రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment