పందెం కోడి2 షూటింగ్‌లో సెలబ్రేషన్స్‌! | Mahanati And Abhimanyudu Success Celebrations Held In Pandem Kodi 2 Movie Shooting | Sakshi
Sakshi News home page

Published Sun, Jun 24 2018 4:01 PM | Last Updated on Sun, Jun 24 2018 4:19 PM

Mahanati And Abhimanyudu Success Celebrations Held In Pandem Kodi 2 Movie Shooting - Sakshi

మహానటి సినిమాతో తిరుగులేని కీర్తిని సంపాదించారు కీర్తి సురేష్‌. తమిళ నాట నడిగైయార్‌ తిలగం పేరుతో విడుదలై అక్కడ కూడా విజయవంతమైంది. కీర్తి ప్రస్తుతం విజయ్‌, విక్రమ్‌, విశాల్‌ లాంటి అగ్ర కథనాయకులతో నటిస్తున్నారు. తెలుగులో ఇంకా ఏ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పలేదు. కీర్తి సురేష్‌ విజయ్‌తో సర్కార్‌, విక్రమ్‌తో సామీ స్క్వేర్‌, విశాల్‌తో పందెం కోడి2 సినిమాలు చేస్తున్నారు. 

విశాల్‌ ఇరుంబుదురై (తెలుగులో అభిమన్యుడు) తో మంచి విజయాన్ని అందుకున్నారు. త్వరలోనే పందెంకోడి సినిమాకు సీక్వెల్‌గా పందెంకోడి 2 తో మన ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది. ఈ షూటింగ్‌లో కీర్తి సురేష్‌, విశాల్‌ పాల్గొన్నారు. చిత్ర యూనిట్‌ మహానటి, అభిమన్యుడు సినిమాలు విజయవంతం కావడంతో కేక్‌ కట్‌ చేసి సెలబ్రేట్‌ చేశారు. విశాల్‌ ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోను ట్విటర్‌ ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement