అది జస్ట్‌ రూమర్‌! | Lingusamy puts rumours to rest about Allu Arjun's debut Tamil film | Sakshi
Sakshi News home page

అది జస్ట్‌ రూమర్‌!

Published Tue, Feb 28 2017 10:58 PM | Last Updated on Tue, Sep 5 2017 4:51 AM

అది జస్ట్‌ రూమర్‌!

అది జస్ట్‌ రూమర్‌!

అల్లు అర్జున్, దర్శకుడు లింగుస్వామి కాంబినేషన్‌లో తెలుగు, తమిళ భాషల్లో గతేడాది సెప్టెంబర్‌లో ఓ సినిమా ఆరంభమైన విషయం తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ఇంకా ప్రారంభం కాలేదు. దాంతో సినిమా లేనట్లే అని చెన్నై కోడంబాక్కమ్‌లో చర్చ జరుగుతోంది.

ఈ చర్చ లింగుస్వామి వరకూ వెళ్లినట్లుంది. ‘‘బన్నీ, నా కాంబినేషన్‌ సినిమా ఆగిపోలేదు, ఉంటుంది. ప్రస్తుతం విశాల్‌తో ‘పందెం కోడి’ చిత్రానికి సీక్వెల్‌గా ‘పందెంకోడి–2’ తెరకెక్కించే పనిలో ఉన్నా. త్వరలో ఈ మూవీ పట్టాలెక్కుతుంది. విశాల్‌ మూవీ పూర్తవగానే అల్లు అర్జున్‌ సినిమా ప్రారంభమవుతుంది. ఆగిందనే వార్త వదంతి మాత్రమే’’ అని లింగుస్వామి స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement