lingu swamy
-
వాళ్ళ కోసం ఎంత కష్టమైనా పడతా: రామ్ పోతినేని
‘దెబ్బలు తగిలేలా స్టెప్పులు వేయడం అవసరమా?’ అని చాలా మంది నన్ను అడుగుతుంటారు. దర్శకులు కూడా అంత కఠినమైన స్టెప్పులు వద్దులేండి అంటుంటారు. కానీ అభిమానుల కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. సెట్‌కు వెళ్లిన తర్వాత కెమెరా చూస్తే కెమెరా లెన్స్ కనిపించదు. పదికోట్ల మంది కనిపిస్తారు. నా కోసం థియేటర్లకు వచ్చి చూస్తున్నారంటే... నేను వాళ్ల వాళ్ళ కోసం ఎంత కష్టమైన పనైనా వందశాతం చేయడానికి ప్రయత్నిస్తా’అని హీరో రామ్ పోతినేని అన్నారు. రామ్ పోతినేని, కృతిశెట్టి జంటగా, లింగుస్వామి తెరకెక్కించిన చిత్రం ‘ది వారియర్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సందర్భంగా రామ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు... సాయంత్రానికే పోలీస్ యూనిఫామ్ ఇంటికి తెప్పించా ‘రెడ్’ తర్వాత పోలీస్ కథ చేద్దామనుకున్నాను. నాలుగైదు కథలు విన్నాను. అనీ రొటీన్ అనిపించాయి. పోలీస్ కథలు చేస్తే ఫ్రెష్‌నెస్ ఉండాలనేది నా ఫీలింగ్. రొటీన్ కథలు విని వద్దని డిసైడ్ అయ్యాను. లింగుస్వామి కథ చెప్పడానికి వస్తానంటే సరేనన్నాను. అప్పుడు పోలీస్ కథ అని తెలియదు. కథ చెప్పే ముందు నాకు విషయం తెలిసింది. ఫార్మాలిటీ కోసం వినేసి ఆ తర్వాత వద్దని చెబుదామనుకుని వినడం మొదలుపెట్టా. కథంతా విన్న తర్వాత ఇటువంటి కథే చేయాలని డిసైడ్ అయ్యా. బయట నుంచి చూసినప్పుడు ఏ కథైనా ఒకేలా ఉంటుంది. అదే పోలీస్, అదే విలన్! కానీ, ఒక సోల్ ఉంటుంది. పోలీస్ ఎందుకు అయ్యాడు? అయిన తర్వాత ఏం చేస్తున్నాడు? అనేదానిపై సినిమాకి మెయిన్ అవుతుంది. 'ది వారియర్'లో ఆ సోల్, ఎమోషన్ నాకు బాగా నచ్చింది. ఈ కథ నన్ను ఎంత ఎగ్జైట్ చేసిందంటే... లింగుస్వామి గారు నేరేషన్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ సాయంత్రానికి పోలీస్ యూనిఫామ్ మా ఇంటికి తెప్పించా. అది అవుటాఫ్ సిలబస్ క్వశ్చన్ లా అనిపించింది ది వారియర్ షూటింగ్ సమయంలో కొంచెం సీరియస్ ఇంజ్యూరీ అయ్యింది. స్పైనల్ కార్డ్ ఇంజ్యూరీ అంటే చిన్నది కాదు కదా! ఎడమ చెయ్యి పని చేయలేదు. జిమ్ చేసిన తర్వాత మూడు నెలలు ఖాళీగా ఉండటం కష్టం అయ్యింది. ఆ సమయంలో డాక్టర్ ‘జీవితం ముఖ్యమా? సినిమాలు ముఖ్యమా?’ అని ప్రశ్నించేసరికి..'అలా అడిగారు ఏంటి?' అనుకున్నాను. తర్వాత వారానికి సెట్ అయ్యాను. అప్పటికి ఆది పినిశెట్టి వేరే సినిమాలు చేయకుండా అలా ఉన్నాడు. పెళ్ళికి రెడీ అవుతున్నాడు. అందరూ నా కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా! డాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన కరెక్ట్. నాకు ఏమో నా వల్ల అందరూ వెయిట్ చేస్తున్నారని ఫీలింగ్. సినిమాలే లైఫ్ అనుకునే నాకు అది అవుటాఫ్ సిలబస్ క్వశ్చన్ లా అనిపించింది. పూరి, లింగు స్వామి డైమండ్స్ లాంటి వాళ్లు పూరి జగన్నాథ్ గారు, లింగుస్వామి గారు ట్రెండ్ సెట్టర్స్. వేరే కథలు డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా ఆ కథలు కనెక్ట్ కావడం లేదు గానీ... వాళ్ళ బ్రిలియన్స్ కనబడుతోంది. ఇద్దరం కనెక్ట్ అయ్యి కరెక్ట్ స్క్రిప్ట్ పడితే రిజల్ట్ బాగుంటుంది. లింగుస్వామి కూడా అంతే! ఫైనల్‌గా ఈ స్క్రిప్ట్‌కు కనెక్ట్ అయ్యాం. ఈ స్క్రిప్ట్ లింగుస్వామి సినిమాగా మారితే ఎలా ఉంటుందో నేను చూశా. నన్ను బాగా ఎగ్జైట్ చేసింది. వీళ్ళందరూ డైమండ్స్ లాంటి వాళ్ళు. లోస్ వచ్చినప్పుడు కొంచెం దుమ్ము పడుతుంది. తుడిస్తే మళ్లీ డైమండ్ కనబడుతుంది. ఆది కూడా చాలా ఎగ్జైట్ అయ్యాడు ‘ది వారియర్’ కథ చెప్పినప్పుడు ఆది పినిశెట్టి రోల్... గురు క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. సినిమాకు ఆ రోల్ చాలా ఇంపార్టెంట్. ఎవరు చేస్తున్నారు? అనేది టెన్షన్. అయితే, లింగుస్వామి ఆది పేరు చెప్పినప్పుడు నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. ఆది ఏమో సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు. కథ చెప్పాక... ఆయన కూడా ఎగ్జైట్ అయ్యారు. వెంటనే ఓకే చెప్పేసి క్యారెక్టర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. దేవిశ్రీ ఎప్పుడు ఇలా చెప్పలేదు మ్యూజిక్ విషయంలో దేవి శ్రీ చాలా కేర్ తీసుకున్నారు. దేవితో నాకు ఏడో సినిమా ఇది. లింగుస్వామి స్క్రిప్ట్ చెప్పి వెళ్లిన తర్వాత నాకు ఫోన్ చేసి... రీ రికార్డింగ్ గురించి, సీక్వెన్సుల గురించి మాట్లాడాడు. అంత ఎగ్జైట్ అయ్యాడు. ఇలా అంతకు ముందు ఎప్పుడు చెప్పలేదు. పాటలు కూడా కార్ స్పీకర్లో సాంగ్స్ వినడం వేరు. ఇంట్లో వినడం వేరు. హెడ్ ఫోన్స్ పెట్టుకుని వినడం వేరు. థియేటర్లో వేరు. ఒక్కో స్పీకర్లో సాంగ్ ఎలా రావాలి? అని ఆలోచించి డిజైన్ చేశాడు. సాంగ్స్ మాత్రమే కాదు... కంప్లీట్ సినిమా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం డిజైన్ చేశాం. ఎమోషన్స్, సాంగ్స్, పెర్ఫార్మన్స్... కమర్షియల్ ప్యాకేజ్డ్ మూవీ ఇది. ఇన్నాళ్లకు కుదిరింది నేను ఎప్పటి నుంచో తమిళంలో చేయాలనుకుంటున్నాను. కథలు సెట్ కాలేదు. తమిళ్ నుంచి సూపర్ స్క్రిప్ట్స్ వచ్చాయి. కానీ, అవి తెలుగులో తేడా కొడతాయేమో అనిపించింది. తెలుగు, తమిళ్... రెండు వర్కవుట్ అయ్యే స్క్రిప్ట్ దొరికితే చేద్దామనుకున్నాను. లింగుస్వామి చెప్పిన స్క్రిప్ట్ కుదిరింది. లింగుస్వామి షాకయ్యారు నేను చెన్నైలో పెరిగాను కాబట్టి తమిళ్ మాట్లాడటం వచ్చు. డబ్బింగ్ చెప్పడం కూడా ఈజీగా అనిపించింది. ‘నేను మొత్తం డబ్బింగ్ చెప్పిన తర్వాత మీరు వినండి. మళ్ళీ కరెక్షన్స్ ఉంటే చెప్పండి. అప్పుడు వచ్చి చెబుతాను’అని లింగుస్వామితో అన్నాను. డబ్బింగ్ చెప్పిన తర్వాత.. ఒక్క సెన్సార్ కరెక్షన్ తప్ప ఏమీ లేదు. లింగుస్వామి షాక్ అయ్యారు. 'అంత పర్ఫెక్ట్గా ఎలా చెప్పారు. నేను ఊహించలేదు' అని అన్నారు. అందుకే ‘ది వారియర్’టైటిల్ కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ అనే పదం బాగా నచ్చింది. ఎవరూ బయటకు రాకుండా ఇళ్లల్లో ఉన్నప్పుడు డాక్టర్లు, పోలీసులు బయటకు వచ్చారు. అందుకని, వారియర్ టైటిల్ పెట్టాం. అలా చేస్తే హిందీ ప్రేక్షకులు చూడరు హిందీ మార్కెట్ కోసం మనం కొత్తగా ఏమీ చేయకూడదని నేను నమ్ముతా. వాళ్ళు హిందీ సినిమాలు చూస్తున్నారు. తెలుగు, సౌత్ సినిమాలు చూసేది మన ఫ్లేవర్ కోసం! మనం కన్ఫ్యూజ్ అయిపోయి బాలీవుడ్ వాళ్ళు ఏం చేస్తున్నారో అది చేస్తామంటే హిందీ ప్రేక్షకులు చూడరు. హిందీ మార్కెట్ కోసం మనం ట్రై చేయలేదు. హిందీలో డబ్బింగ్ అయినప్పుడు చూశారు. గ్యాప్ తీసుకోను ది వారియర్ విడుదలైన వెంటనే బోయపాటి సినిమా షూటింగ్లో పాల్గొంటా. ఈ సారి గ్యాప్ తీసుకోవద్దనుకుంటున్నాను. బోయపాటి తర్వాత ఎవరితో సినిమా చేయాలనేదానిపై చర్చలు జరుగుతున్నాయి. ఎవరితో ఎప్పుడు ఉంటుందనేది ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది. -
తెలుగు హీరోలతో సినిమాలు చేస్తున్న పర భాష డైరెక్టర్లు వీళ్లే..
ఇప్పుడు తెలుగు సినిమా తెలుగు సినిమా కాదు. మరి ఏంటీ అంటే.. ‘పాన్ ఇండియా సినిమా’ అయిపోయింది. ‘బాహుబలి’తో తెలుగు సినిమా రేంజ్ పెరిగిపోయింది. ఆ తర్వాత పాన్ ఇండియా సినిమాలు ఎక్కువయ్యాయి. ఇతర భాషల దర్శకుల చూపు కూడా మన హీరోలపై పడింది. తమిళం, కన్నడ, హిందీ భాషల దర్శకులు తెలుగు హీరోలతో పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. వణక్కమ్, నమస్కార, నమస్కార్ అంటూ మన హీరోలకు వాళ్ల భాషల్లో ‘నమస్కారం’ చెబుతున్నారు. ఇక ఆ డైరెక్టర్ల గురించి తెలుసుకుందాం. ‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్ అయ్యారు ప్రభాస్. ఆ సినిమా తర్వాత ప్రభాస్ ఏ సినిమా చేసినా అది పాన్ ఇండియా రేంజ్ కావడం విశేషం. హిందీ దర్శకులు ప్రభాస్‌తో సినిమా చేయడానికి ఆసక్తి చూపగా దర్శకుడు ఓం రౌత్‌కి ముందుగా అవకాశం ఇచ్చారు. ప్రభాస్ హీరోగా ఓం రౌత్ తెరకెక్కించిన ‘ఆదిపురుష్’ వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. అలాగే హిందీ చిత్రం ‘వార్’ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలోనూ ప్రభాస్ ఓ సినిమా చేయనున్నారనే టాక్ ఉంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కన్నడ దర్శకుడు, ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో ప్రభాస్ ‘సలార్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’తో పర భాషల్లో కూడా స్టార్‌డమ్‌ను పెంచుకున్న ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో సినిమా చేయడానికి ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కాకముందే ఇతర ఇండస్ట్రీ దర్శకులు ఆసక్తి చూపారు. ఆల్రెడీ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా కన్ఫార్మ్ అయింది. దర్శకుడు కొరటాల శివతో చేయనున్న సినిమాను పూర్తి చేశాక ప్రశాంత్ నీల్ కథలోకి వెళ్తారు ఎన్టీఆర్. సేమ్ ఎన్టీఆర్లానే రామ్‌చరణ్ కూడా ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ కాక ముందే తమిళ దర్శకుడు శంకర్‌తో ఓ సినిమా కమిటయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ప్రశాంత్ నీల్‌తో కూడా రామ్‌చరణ్ కథా చర్చలు జరిపినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అలాగే ఓ ప్రముఖ ముంబై నిర్మాణ సంస్థ రామ్‌చరణ్‌తో సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలిసింది. ఇటు నాగచైతన్య, రామ్ తమిళ దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. ఈ మధ్య కోలీవుడ్‌లో ‘మానాడు’తో హిట్ సాధించిన దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించనున్న ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రంలో నాగచైతన్య హీరోగా నటిస్తారు. ఇక ‘పందెంకోడి’తో హిట్ దర్శకుడిగా తెలుగు ప్రేక్షకుల్లో పేరు సంపాదించిన లింగుసామి ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ఓ ద్విభాషా సినిమా చేస్తున్నారు. ‘ది వారియర్’ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ హీరో. ఈ చిత్రం జూలై 14న రిలీజ్ కానుంది. ఇంకా దర్శకుడు శ్రీ కార్తీక్‌తో హీరో శర్వానంద్ చేసిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘ఒకే ఒక జీవితం’ రిలీజ్‌కు రెడీగా ఉంది. తమిళ దర్శకుడు రంజిత్ జయకొడి దర్శకత్వంలో సందీప్ కిషన్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘మైఖేల్’ చేస్తున్నారు. మరికొందరు పరభాషా దర్శకులు తెలుగు హీరోల డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. సో.. మరికొన్ని కాంబినేషన్స్ సెట్ కావొచ్చు. కుదిరితే... వార్తల్లో ఉన్న ప్రకారం మరికొందరు తెలుగు హీరోలు కూడా వేరే భాషల దర్శక-నిర్మాతలతో సినిమాలు చేసే అవకాశం ఉంది. అన్నీ కుదిరితే ఆ చిత్రాలు కూడా పట్టాలెక్కుతాయి. నటుడు, దర్శకుడు సముద్ర ఖని తెరకెక్కించనున్న సినిమాలో పవన్ కల్యాణ్, సాయిధరమ్‌తేజ్‌లు నటిస్తారని, హీరో గోపీచంద్, తమిళ దర్శకుడు హరి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుందనే టాక్ వినిపిస్తోంది. ఇక ‘తగ్గేదే లే’ అంటూ.. ‘పుష్ప: ది రైజ్’ సినిమాతో బాలీవుడ్ మార్కెట్లోనూ సత్తా చాటిన అల్లు అర్జున్ ఇటీవల హిందీ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీని కలిశారు. బాలీవుడ్లో బన్నీ చేయనున్న స్ట్రయిట్ సినిమా కోసమే ఈ మీటింగ్ అనే టాక్ వినిపిస్తోంది. అలాగే యంగ్ హీరోలు అఖిల్, విజయ్ దేవరకొండతో బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ సినిమాలు చేయడానికి రంగం సిద్ధం చేశారట. కీలక పాత్రల్లో... తెలుగు హీరోలను కీలక పాత్రలకు కూడా తీసుకుంటున్నారు బాలీవుడ్ దర్శకులు. రణ్‌బీర్ కపూర్ హీరోగా దర్శకుడు అయాన్ ముఖర్జీ తీసిన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో నాగార్జున ఓ లీడ్ రోల్ చేశారు. సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందనున్న ఓ చిత్రంలో వెంకటేశ్ ఓ లీడ్ రోల్ చేయనున్నారు. ఈ సినిమాకు ఫర్హాద్ సామ్జీ దర్శకుడు అని టాక్. అద్వైత్ చందన్ దర్శకత్వంలో ఆమిర్ ఖాన్ నటించిన ‘లాల్‌సింగ్ చద్దా’లో నాగచైతన్య ఓ కీలక పాత్ర చేశారు. అలాగే అభిషేక్ శర్మ దర్శకత్వంలో అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన ‘రామసేతు’లో సత్యదేవ్ ఓ ముఖ్య పాత్ర చేశారు. -
బేబమ్మతో సినిమా..కథ విన్న వెంటనే రామ్ రియాక్షన్ ఇదే
రామ్ హీరోగా లింగుసామి దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి ఓ సినిమా నిర్మించనున్న విషయం తెలిసిందే. కృతీ శెట్టి హీరో యిన్‌గా నటించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 12న హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ– ‘‘లింగుసామి చెప్పిన పవర్ఫుల్ ఊర మాస్ సబ్జెక్ట్ మా అందరికీ నచ్చింది. కథ విన్న వెంటనే సినిమా చేద్దామన్నారు రామ్. దేవిశ్రీ ప్రసాద్ ఒక లవ్ సాంగ్ కంపోజ్ చేశారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: పవన్ కుమార్. -
బ్రేక్ లేదు.. రామ్ కొత్త సినిమా అప్డేట్
ఇటీవల చిన్న బ్రేక్ తీసుకుంటున్నట్లు ప్రకటించిన రామ్ పోతినేని.. తాజాగా తన అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పారు. సినిమాలకు కొన్ని రోజులు గ్యాప్ ఇస్తాడని అనుకుంటే వెంటనే మరో ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సిద్దమయ్యాడు. ఈ క్రమంలో ‘పందెం కోడి’, ‘ఆవారా’ తదితర డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన తమిళ దర్శకుడు లింగు స్వామీతో ఓ సినిమా చేయనున్నట్లు గురువారం అధికారికంగా వెల్లడించాడు. ఈ మేరకు ట్విటర్లో పోస్టు పెట్టాడు. ‘దీని కోసం చాలా కాలం ఎదురు చూశాను. నా ఫేవరెట్ దర్శకుడు లింగు స్వామి సర్‌తో రాపో19 తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతుంది. శ్రీనివాస చిత్తూరితో పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నాను. లవ్ రాపో’ అంటూ ట్వీట్ చేశాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్6గా శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. ఇక హీరో రామ్ ఇటీవల వరుస సినిమాలు చేస్తూ స్పీడ్ పెంచాడు. తన తొలి చిత్రం దేవదాసులో మాస్ యాంగిల్ పాత్రలో హిట్ అందుకున్న రామ్ గత కొంతకాలంగా వరుస పరాజయాలను చవిచూశాడు. ఆ తర్వాత మాస్ డైరెక్టర్ పూరి దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ వంటి పక్కా మాస్ మసాలా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ తరువాత రెడ్ సినిమాతోనూ ప్రేక్షకులను అలరించిన రామ్ ఇప్పుడు మరో మాస్ సినిమాతో అలరించేందుకు రెడీ అయ్యాడు. కాగా ఈ చిత్రం ఏప్రిల్‌లో చిత్రం సెట్స్ పైకి వెళుతుందని తెలుస్తోంది. రామ్ నుంచి అప్డేట్ అందడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను అతి త్వరలో ప్రకటించనున్నారు. చదవండి: కీర్తి సురేష్ ఎవరితోనూ ప్రేమలో లేదు.. ఆరు చలాన్లు కట్టిన టాలీవుడ్ హీరో I’ve waited a long time for this! #RAPO19 - a Telugu-Tamil Bi-lingual with one of my fav @dirlingusamy sir. Looking forward to working with the passionate Srinivasaa Chitturi garu. @SS_Screens. Love..#RAPO pic.twitter.com/j6PiBPojvj — RAm POthineni (@ramsayz) February 18, 2021 -
సౌండ్ ఇంజనీర్ కాబోతున్నారు
సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబు గత ఏడాది బాక్సాఫీస్ దగ్గర రీసౌండ్ వచ్చేలా ‘రంగస్థలం’ సినిమాతో మోత మోగించారు. ఇప్పుడు ఆ సినిమా తమిళంలో రీమేక్ కాబోతోందని సమాచారం. సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్, సమంత జంటగా తెరకెక్కిన చిత్రం ‘రంగస్థలం’. సౌండ్ ఇంజనీర్ (వినికిడి లోపం ఉన్న వ్యక్తిని సరదాగా ఇలా అంటారు) చిట్టిబాబు పాత్రలో చరణ్ కనిపించారు. ఇప్పుడు సౌండ్ ఇంజనీర్‌గా మారబోతున్నారు లారెన్స్. ‘రంగస్థలం’ తమిళ రీమేక్‌లో రామ్‌చరణ్ పాత్రను రాఘవ లారెన్స్ చేయనున్నారట. ఈ సినిమాకు లింగుస్వామి దర్శకత్వం వహిస్తారని సమాచారం. -
కొత్త కాంబినేషన్
హీరోలకు కెరీర్ స్టార్టింగ్ స్టేజ్‌లో కమర్షియల్ సక్సెస్ అవసరం. వాటిని అందించడంలో దర్శకుడు లింగుస్వామి మాస్టర్ అనుకోవచ్చు. విశాల్‌ను ‘పందెంకోడి’, కార్తీని ‘ఆవారా’తో అటు తమిళం, ఇటు తెలుగు భాషల్లో మంచి బ్రేక్‌ని అందించారు లింగుస్వామి. ఇప్పుడు హవీష్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమాకు దర్శకత్వం వహించనున్నారాయన. ఈ సినిమా ఆగస్ట్‌లో ప్రారంభం కానుంది. ఇదో మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కనుందని సమాచారం. సినిమాకు పని చేయనున్న మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. విశాల్, కార్తీ తమ కెరీర్లో మంచి మాస్ హీరోలుగా నిలబడే సినిమాలను ఇచ్చినట్లే హవీష్‌కు మంచి బ్రేక్‌ని అందించి లింగుస్వామి తన మ్యాజిక్ రిపీట్ చేస్తారా? చూడాలి. -
నిర్మాతలు సినిమాకి ఊపిరిలాంటోళ్లు
2005లో విడుదలైన సూపర్‌హిట్ చిత్రం ‘పందెం కోడి’తో అటు తమిళ్లోను ఇటు లె లుగులోను విశాల్ మాస్ హీరో ఇమేజ్ సంపాదించుకున్నారు. పదమూడేళ్ల తర్వాత మళ్లీ ఆ హిట్ ఫీట్‌ని సాధించటానికి రెడీ అయ్యారు చిత్రదర్శకుడు లింగుస్వామి, హీరో విశాల్. ‘పందెం కోడి’కి సీక్వెల్‌గా ఈ హిట్ కాంబినేష్న్లో రూపొందిన ‘పందెం కోడి 2’ అక్టోబర్ 18న తమిళ్, తెలుగులో రిలీజ్ కానుంది. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ పతాకాలపై ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో ప్రముఖ పంపిణీదారుడు నారాయణదాస్ నారంగ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాతో 25 సినిమాలు పూర్తయ్యాయి. నేనీ రోజు మీ (ప్రేక్షకులు) ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే అందుకు కారణం నా తల్లిదండ్రులు, మా అన్నయ్య విశాల్‌కృష్ణ. వారి ప్రోత్సాహంతోనే హీరోగా కెరీర్ ప్రారంభించాను. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులు నన్ను ఇప్పటికీ ఆదరిస్తూనే ఉన్నారు. నా 25 సినిమాల ప్రయాణంలో ప్రతి చిత్రం మంచి విజయాన్ని సాధించాలనే కష్టపడ్డాను. నిర్మాతలు సినిమాలకు ఊపిరిలాంటోళ్లు. ‘పందెం కోడి 2’ కథ విషయానికొస్తే... ఏడు రోజుల పాటు జరిగే జాతర నేపథ్యంలో ఈ సీక్వెల్ రూపొందింది. ‘మహానటి’తో జాతీయ అవార్డు గెలుచుకునే స్థాయిలో నటనను ప్రదర్శించిన కీర్తీ సురేశ్ మా సినిమాలో అద్భుతమైన పాత్రను పోషించింది. ‘పందెం కోడి’ పార్ట్ 3 చేస్తే అందులో కూడా కీర్తీనే హీరోయిన్. వరలక్ష్మీ పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది. రాజ్‌కిరణ్‌గారు చాలా హుందాగా నటించారు. తెలుగులో మా సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్న ‘ఠాగూర్’ మధు గారికి థ్యాంక్స్’’ అన్నారు. లింగుస్వామి మాట్లాడుతూ– ‘‘విశాల్‌లోని ఎన ర్జీ లెవెల్స్‌ను ‘పందెం కోడి’లో చూపించాను. ఈ సీక్వెల్లో కూడా అవి కంటిన్యూ అవుతాయి. ఈ సినిమా నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. సీక్వెల్‌కి ఇంత గ్యాప్ రావటానికి కారణం మీరా జాస్మిన్లా నటించే హీరోయిన్, లాల్లా విలనిజమ్ చూపించే నటులు కోసం వెయిట్ చేయడమే’’ అన్నారు. ‘‘మహానటి’ తర్వాత ఆ రేంజ్లో తృప్తినిచ్చిన చిత్రమిది. అక్టోబర్ 17 నా బర్త్‌డే, సినిమా 18న విడుదలవుతుంది. నా బర్త్‌డేకి పెద్ద గిఫ్ట్‌గా భావిస్తున్నాను’’ అన్నారు కీర్తీ సురేశ్. ‘‘ఇది నాకు స్పెషల్ మూవీ’’ అన్నారు వరలక్ష్మీ. ‘‘విశాల్ అసోసియేషన్‌లో చేస్తున్న తొలి సినిమా ఇది. మొదటి భాగం కంటే రెండో భాగం ఇంకా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు ‘ఠాగూర్’ మధు. నిర్మాతలు కేఎల్ దామోదర్ ప్రసాద్, అనిల్ సుంకర, బీవీయస్ఎన్ ప్రసాద్, సుధాకర్ రెడ్డి, టీయంసి సుమన్, వీరినాయుడు, ముత్యాల రామదాస్ తదితరులు పాల్గొన్నారు. -
బహుమతుల వర్షం
‘పందెం కోడి 2’ టీమ్‌పై బహుమతుల వర్షం కురుస్తోందట. రీసెంట్గా హీరోయిన్ కీర్తీ సురేశ్ ఈ సినిమా టీమ్‌కి గోల్డ్ కాయిన్స్ పంచిన సంగతి తెలిసిందే. తాజాగా హీరో విశాల్, దర్శకుడు లింగుస్వామి కూడా టీమ్ మెంబర్స్‌కు గోల్డ్ కాయిన్స్ పంచిపెట్టారట. లింగుస్వామి దర్శకత్వంలో విశాల్, కీర్తీ సురేశ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సండైకోళి 2’ (పందెం కోడి 2). సూపర్ హిట్ చిత్రం ‘సండైకోళి’కి సీక్వెల్ ఇది. రీసెంట్గా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. వర్క్ చేసిన టీమ్ అందరికీ (సుమారు 150) ఈ సినిమా గుర్తుగా విశాల్, లింగుస్వామి విడి విడిగా గోల్డ్ కాయిన్స్ అందజేశారట. అంతకుముందు కీర్తీ సురేశ్ ఇచ్చారు. దీంతో బహుమతుల వర్షం కురుస్తోందని చిత్రబృందం ఆనందంగా చెప్పుకుంటున్నారు. -
అది జస్ట్ రూమర్!
అల్లు అర్జున్, దర్శకుడు లింగుస్వామి కాంబినేషన్లో తెలుగు, తమిళ భాషల్లో గతేడాది సెప్టెంబర్‌లో ఓ సినిమా ఆరంభమైన విషయం తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ఇంకా ప్రారంభం కాలేదు. దాంతో సినిమా లేనట్లే అని చెన్నై కోడంబాక్కమ్‌లో చర్చ జరుగుతోంది. ఈ చర్చ లింగుస్వామి వరకూ వెళ్లినట్లుంది. ‘‘బన్నీ, నా కాంబినేషన్ సినిమా ఆగిపోలేదు, ఉంటుంది. ప్రస్తుతం విశాల్‌తో ‘పందెం కోడి’ చిత్రానికి సీక్వెల్‌గా ‘పందెంకోడి–2’ తెరకెక్కించే పనిలో ఉన్నా. త్వరలో ఈ మూవీ పట్టాలెక్కుతుంది. విశాల్ మూవీ పూర్తవగానే అల్లు అర్జున్ సినిమా ప్రారంభమవుతుంది. ఆగిందనే వార్త వదంతి మాత్రమే’’ అని లింగుస్వామి స్పష్టం చేశారు. -
బన్నీ.. పెద్ద ప్లానే వేస్తున్నాడు
సన్నాఫ్ సత్యమూర్తి సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న బన్నీ ఇప్పడు వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు సినిమాలో నటిస్తున్న అల్లు అర్జున్ మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. ఈ సినిమాతో తన మార్కెట్ రేంజ్‌ను కూడా భారీగా పెంచుకోవాలని స్కెచ్ వేస్తున్నాడు. అందుకు తగ్గట్టుగానే కథా కథనాలతో పాటు దర్శకులను కూడా ఎంచుకుంటున్నాడు. సరైనోడు సినిమా తరువాత మనం ఫేం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు బన్నీ. విక్రమ్‌కు తెలుగుతో పాటు తమిళ్లో కూడా మంచి మార్కెట్ ఉండటం, ప్రస్తుతం సూర్య హీరోగా 24 సినిమాను రూపొందిస్తుండటంతో ఈ సినిమాను తమిళ్లో కూడా రిలీజ్ చేసి భారీగా కలెక్షన్లు సాధించవచ్చని భావిస్తున్నాడు. ఈ సినిమా తరువాత కూడా అదే ఫార్ములాను రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నాడు బన్నీ. తెలుగులో కూడా మంచి విజయం సాధించిన పందెంకోడి, ఆవారా సినిమాల దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్లో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్కు రెడీ అవుతున్నాడు. ఈసినిమాను భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని భావిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకే సారి తెరకెక్కించి కోలీవుడ్‌లో కూడా పాగా వేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. మరి బన్నీ ప్లాన్స్ ఎంత వరకు వర్కవుట్ అవుతాయో చూడాలి. -
ఎన్ని ఏళు నాళ్ అంటున్న కార్తీ
ఎన్ని ఏళు నాళ్కు సిద్ధం అవుతున్నారు నటుడు కార్తీ. ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి దర్శక నిర్మాత లింగుస్వామి సన్నాహాలు చేస్తున్నారు. వీరి కాంబినేషన్లో ఇంతకుముందు సూపర్ హిట్ చిత్రం పైయ్యా వచ్చిన విషయం తెలిసిందే. అందులోని పాటలన్నీ ప్రజాదరణ పొందాయి. అలాంటిది మళ్లీ కార్తీ, లింగుస్వామి కాంబినేషన్లో చిత్రమంటే భారీ అంచనాలు నెలకొం టాయి. ఆ అంచనాలను కచ్చితంగా అధిగమిస్తామంటున్నారు దర్శకుడు లింగుస్వామి. ప్రస్తుతం ఈయ న సూర్య, సమంత జంటగా అంజాన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగం గా జరుపుకుంటోంది. తదుపరి కార్తీ హీరోగా నటించే చిత్ర షూటింగ్‌కు సన్నాహాలు చేస్తున్నట్లు లింగుస్వామి తెలిపారు. ఈ చిత్రవిషయాలను త్వరలోనే వెల్లడిస్తానని అన్నారు. కార్తీ ప్రస్తుతం రంజిత్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్ర నిర్మాణ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. -
గ్యాంగ్‌స్టర్‌గా సూర్య
ప్రయోగాత్మక పాత్రలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు సూర్య. దక్షిణాది ప్రేక్షకులందరూ ఆయన్ను ఇష్టపడేది అందుకే. కెరీర్ తొలిదశలోనే విభిన్న తరహా పాత్రలు పోషించిన సూర్య... త్వరలో గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నారు. పందెం కోడి, ఆవారా సినిమాలతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న లింగుస్వామి ఈ చిత్రానికి దర్శకుడు కావడం విశేషం. ఈ సినిమాలో సూర్యకు జోడీగా సమంత నటిస్తున్నారు. సూర్య, సమంత కలిసి నటించడం ఇదే ప్రథమం. ఈ సినిమాలో సూర్య రెండు భిన్నమైన గెటప్పుల్లో కనిపించనున్నారు. ఓ గెటప్ మామూలుగా ఉంటే, ఇంకో గెటప్ గడ్డంతో చాలా స్టయిలిష్‌గా ఉంటుందట. సూర్య గత చిత్రాలను మించే స్థాయిలో ఈ సినిమా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ముంబయ్‌లో జరుగుతోంది. 80 లక్షల రూపాయలతో వేసిన ఓ సెట్లో సూర్య, సమంతలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.