బన్నీ.. పెద్ద ప్లానే వేస్తున్నాడు | bunny next films with vikram k kumar, lingu swamy | Sakshi
Sakshi News home page

బన్నీ.. పెద్ద ప్లానే వేస్తున్నాడు

Published Sun, Jan 31 2016 8:28 PM | Last Updated on Sun, Sep 3 2017 4:42 PM

బన్నీ.. పెద్ద ప్లానే వేస్తున్నాడు

బన్నీ.. పెద్ద ప్లానే వేస్తున్నాడు

సన్నాఫ్ సత్యమూర్తి సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న బన్నీ ఇప్పడు వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు సినిమాలో నటిస్తున్న అల్లు అర్జున్ మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. ఈ సినిమాతో తన మార్కెట్ రేంజ్ను కూడా భారీగా పెంచుకోవాలని స్కెచ్ వేస్తున్నాడు. అందుకు తగ్గట్టుగానే కథా కథనాలతో పాటు దర్శకులను కూడా ఎంచుకుంటున్నాడు.

సరైనోడు సినిమా తరువాత మనం ఫేం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు బన్నీ. విక్రమ్కు తెలుగుతో పాటు తమిళ్లో కూడా మంచి మార్కెట్ ఉండటం, ప్రస్తుతం సూర్య హీరోగా 24 సినిమాను రూపొందిస్తుండటంతో ఈ సినిమాను తమిళ్లో కూడా రిలీజ్ చేసి భారీగా కలెక్షన్లు సాధించవచ్చని భావిస్తున్నాడు. ఈ సినిమా తరువాత కూడా అదే ఫార్ములాను రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నాడు బన్నీ.

తెలుగులో కూడా మంచి విజయం సాధించిన పందెంకోడి, ఆవారా సినిమాల దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్లో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్కు రెడీ అవుతున్నాడు. ఈసినిమాను భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని భావిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకే సారి తెరకెక్కించి కోలీవుడ్లో కూడా పాగా వేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. మరి బన్నీ ప్లాన్స్ ఎంత వరకు వర్కవుట్ అవుతాయో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement