సరైనోడి ఊరమాస్ పార్టీ | allu Arjuns Voora Mass Party | Sakshi
Sakshi News home page

సరైనోడి ఊరమాస్ పార్టీ

Published Wed, Aug 3 2016 11:52 AM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM

సరైనోడి ఊరమాస్ పార్టీ

సరైనోడి ఊరమాస్ పార్టీ

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా సరైనోడు. ఈ ఏడాది సమ్మర్ బరిలో బిగెస్ట్ హిట్గా నిలిచిన ఈ సినిమా.., అల్లు అర్జున్ కెరీర్లోనే హైయ్యస్ట్ గ్రాసర్గా రికార్డ్ సృష్టించింది. మాస్ యాక్షన్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సరైనోడు సినిమాతో మరోసారి తన మార్కెట్ స్టామినాను ప్రూవ్ చేసుకున్నాడు బన్నీ.

ఈ సినిమా ఇటీవల వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా హీరో అల్లు అర్జున్ చిత్రయూనిట్కు భారీ పార్టీ ఇచ్చాడు. ఈ మధ్యే బిజినెస్లోకి అడుగుపెట్టిన ఈ మెగా హీరో, తన సొంతం పబ్లో సన్నిహితులు, యూనిట్ సభ్యులతో కలిసి సరదాగా గడిపాడు. అంతేకాదు బన్నీ, ఇచ్చిన ఈ పార్టీకి తన స్టైల్ లో మాస్ ఊర మాస్ పార్టీ అని పేరు పెట్టుకున్నాడు. మంగళ వారం రాత్రి జరిగిన ఈ పార్టీలో దర్శకుడు బోయపాటి శ్రీను, రచయిత రాజసింహ ఇతర నటీనటులు సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement